ఈ పెద్దాయన స్పెషల్: అప్పుడు ఎన్టీఆర్ వద్ద. ఇప్పుడు జగన్ వద్ద

First Published May 25, 2019, 4:17 PM IST

అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఎవరెవరికి ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందా అన్న ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 

అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఎవరెవరికి ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందా అన్న ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.
undefined
ఎన్నికల పోలింగ్ లో అత్యధికశాతం ఓట్లను కొల్లగొట్టింది. ఎవరూ ఊహించనట్లుగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లను కైవసం చేసుకుంది. ఈనెల 30న వైయస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు.
undefined
ఇలాంటి తరుణంలో వైయస్ జగన్ పార్టీలో ఎవరెవరికి ప్రాధాన్యత ఇస్తారు. ఎవర్ని మంత్రులుగా చేస్తారు..ఇవే అంశాలు అందరి మదిని తొలచివేస్తున్నాయి. అయితే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న తర్వాత పార్టీ తరపున ప్రజలకు, కార్యకర్తలకు కృతజ్ఞత తెలిపే అవకాశాన్ని మాత్రం పార్టీ సీనియర్ నేత శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు అప్పగించారు వైయస్ జగన్.
undefined
దీంతో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీ వాయిస్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వైయస్ జగన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇకపోతే వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన కీలక ఘట్టం శాసన సభాపక్ష సమావేశం.
undefined
ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షుడి హోదాలో జగన్ ఉన్నప్పటికీ ఆ సమావేశంలో అధ్యక్షత హోదా మాత్రం మళ్లీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకే కట్టబెట్టారు వైయస్ జగన్. శాసన సభాపక్ష సమావేశంలో వైయస్ జగన్ పక్కన కూర్చున్న ఒకే ఒక్క నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు.
undefined
ఇకపోతే వైయస్ జగన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు పార్టీలో చేరినప్పటి నుంచి ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. అంతేకాదు శాసనమండలిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేతగా అవకాశం కల్పించారు.
undefined
అంతేకాదు ప్రముఖ సభలలో, సమావేశాలలో అధ్యక్ష హోదా ఇచ్చి గౌరవించారు. అంతేకాదు వైయస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాదయాత్ర ప్రజాసంకల్పయాత్ర ముగిసిన తర్వాత ఇచ్చాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలోనే కీలక పాత్ర పోషించారు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు.
undefined
ఆ మేనిఫెస్టో కమిటీకి చైర్మన్ గా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును వైయస్ జగన్ నియమించారు. ఇకపోతే రాష్ట్రంలో జరిగిన అనేక ఘటనలలో వైసీపీ ఏర్పాటు చేసిన నిజనిర్థారణ కమిటీలకు అత్యధిక శాతం అధ్యక్షత వహించింది ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లే కావడం విశేషం.
undefined
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకి ఏ పని అప్పగించినా అది కమిట్మెంట్ తో పనిచేస్తారని పార్టీలో ప్రచారం ఉంది. పార్టీ పరంగా ఏది ఆశించకుండా ఎలాంటి ఒత్తిడులు అధినేతపై తేకుండా నిస్వార్థంగా పార్టీకి పనిచేస్తారని అందువల్లే వైయస్ జగన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకి అంత ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది.
undefined
అలాగే రాజకీయాల్లో కురువృద్ధుడు అయిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రజల నాడి పట్టడంలో కానీ ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలి అనే అంశాలపై వ్యూహరచన చేయడంలో సిద్ధహస్తుడని తెలుస్తోంది. అంతేకాకుండా ప్రజా సమస్యలను పసిగట్టడంతోపాటు వాటిపై పోరాటం చేయడంలోనూ ఆయన ఇచ్చే సూచనలు సలహాలు అద్భుతమని వైయస్ జగన్ సైతం పలుమార్లు చెప్పారట.
undefined
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏడాదికాలం పైగా ప్రజల మధ్యే ఉన్నారు. ఈలోగా పార్టీ వ్యవహారాలు, అధికార పార్టీపై విమర్శల దాడి అనుసరించాల్సిన వ్యూహాలను సిద్ధం చేసింది ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లేనని పార్టీలో టాక్.
undefined
పార్టీపట్ల నమ్మకంతో, చిత్తశుద్ధితో పనిచేసే వారు కాబట్టే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును దివంగత సీఎం ఎన్టీఆర్ సైతం పక్కన పెట్టుకునేవారట. ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు ఇచ్చేవారట. కీలక కమిటీలలో సభ్యులుగా అవకాశం ఇవ్వడంతోపాటు మంత్రిగా కూడా అవకాశం ఇచ్చారు.
undefined
ఎన్టీఆర్ చేతుల నుంచి పార్టీ చంద్రబాబు నాయుడు చేతుల్లోకి వచ్చినప్పటికీ కొంతకాలంపాటు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సైలెంట్ గా ఉన్నా అనంతరం చంద్రబాబు సైతం అతని పనితనాన్ని గుర్తించి మంచి అవకాశాలే ఇచ్చారు.
undefined
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కమిట్మెంట్ పనితనం, నిస్వార్థ రాజకీయం గురించి తెలుసుకున్న వైయస్ జగన్ ఆయన అడగకుండానే అన్ని ఇస్తున్నారని పార్టీలో ప్రచారం జరుగుతుంది. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అడగకుండానే ఎమ్మెల్సీ ఇచ్చినా వైయస్ జగన్ , శాసనమండలి ప్రతిపక్ష నేతగా కూడా చేశారు.
undefined
తనకు ఇచ్చిన పదవిని ఒక బాధ్యతగా భావిస్తూ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మరింత కమిట్మెంట్ తో పార్టీకి సేవ చేసే విషయంలో మరింత కమిట్మెంట్ గా పనిచేసేవారని తెలుస్తోంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి డ్రాఫ్టింగ్ విషయంలో ఉమ్మారెడ్డి అద్భుతమని ఆ పార్టీలో ప్రచారం ఉంది.
undefined
ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మంత్రిగా అవకాశం వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని తెలుస్తోంది. వయసు రీత్యా ఆయన మంత్రి పదవిని నిరాకరిస్తే అల్లుడు ఎమ్మెల్యే రోశయ్యకు కీలక పదవి కట్టబెట్టే అవకాశం కూడా లేకపోలేదని తెలుస్తోంది.
undefined
click me!