ప్రీమియం స్మార్ట్ ఫోన్లలో రారాజుగా ‘ఐఫోన్’:ఆపిల్ కంపెనీదే పై చేయి

By Sandra Ashok Kumar  |  First Published Feb 8, 2020, 11:07 AM IST

స్మార్ట్​ఫోన్ మార్కెట్లో భారత్​ దూసుకుపోతున్నట్లు ఓ ప్రముఖ విశ్లేషణ సంస్థ ఐడీసీ నివేదిక తెలిపింది. 2019లో 15.25 కోట్ల స్మార్ట్​ఫోన్లు అమ్ముడవ్వగా.. మొత్తం మొబైల్​ ఫోన్ల విక్రయాలు 28. 29 కోట్లని ఆ నివేదికలో తేలింది.


న్యూఢిల్లీ: భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ ఏయేటికాయేడు గణనీయ వృద్ధి సాధిస్తూ దూసుకెళ్తోంది. భారత్‌లో స్మార్ట్ ఫోన్ల విక్రయాలు 2019లో ఎనిమిది శాతం వృద్ధి రేటు నమోదు చేశాయి. ప్రపంచంలోనే చైనా తర్వాత రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌గా అవతరించినట్లు ప్రముఖ పరిశోధనా సంస్థ ఐడీసీ వెల్లడించింది. 2020లో కూడా ఇదే తరహాలో వృద్ధి నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు ఐడీసీ పేర్కొంది.

ప్రీమియం సెగ్మెంట్ స్మార్ట్ ఫోన్లలో టెక్ దిగ్గజం ‘ఆపిల్’కు చెందిన ఐఫోన్లదే పై చేయి. గతేడాదిలో దక్షిణ కొరియా మేజర్ శామ్ సంగ్ తో పోలిస్తే స్మార్ట్ ఫోన్ల విక్రయాల్లో గతేడాది ఐఫోన్ల వాటా 47.4 శాతానికి చేరుకున్నది. ఇంతకుముందు ఆవిష్కరించిన మోడల్ ఫోన్లపై ధరలు భారీగా తగ్గించిన ఆపిల్ పలు రకాల ఆఫర్లు, స్ట్రాంగ్ ఈ-టైలర్ సేల్స్ వంటి ఐఫోన్ల విక్రయాలకు మద్దతునిచ్చాయి. 

Latest Videos

also read వొడాఫోన్ ఐడియా కస్టమర్లను వెంటాడుతున్న నెట్వర్క్ సమస్య...ఎందుకంటే..?

ఐఫోన్ ఎక్స్ ఆర్ మోడల్ ఫోన్ తో పోలిస్తే ఐఫోన్ 11 ఫోన్ ధర తక్కువ అని ఐడీసీ తెలిపింది. ఇక ఫీచర్ ఫోన్ల సెగ్మెంట్ సేల్స్ 2018 నాలుగో త్రైమాసికంతో పోలిస్తే 21.1 శాతం తగ్గాయి. 2019 చివరి త్రైమాసికంలో 30.1 మిలియన్ల ఫోన్లు అమ్ముడు పోయాయి. దీపావళి సందర్భంగా రిలయన్స్ జియో అందించిన ఆఫర్ రూ.699 వల్ల కాసింత మెరుగ్గా విక్రయాలు సాగాయి. 

ఈ ఏడాది స్మార్ట్ ఫోన్ల విక్రయాలు సింగిల్ డిజిట్ వ్రుద్ధికే పరిమితం అవుతాయని ఐడీసీ తెలిపింది. 2018తో పోలిస్తే 2019లో స్మార్ట్ ఫోన్ల విక్రయాలు 12.3 శాతం తగ్గాయి. దీనికి 4జీ ఫీచర్ ఫోన్లు తక్కువగా ఉండటమే కారణమని తెలుస్తోంది. ఐడీసీ వెల్లడించిన డేటా ప్రకారం 2019లో మొత్తంగా 28.29 కోట్ల మొబైల్​ ​ఫోన్లు విక్రయమైనట్లు తెలిసింది. షియోమీ ఫోన్ల 4.36 కోట్ల యూనిట్లు విక్రయించింది. మరే ఇతర సంస్థకు సాధ్యంకానంతగా 2019లో ఈ సంస్థ 9.2 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది. ఈ సమయంలో స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో షియోమీ వాటా వాటా 28.6 శాతంగా ఉంది.

శామ్‌సంగ్‌ 20.3 శాతం, వివో 15.6 శాతం, ఒప్పో 10.7శాతం, రియల్‌ మీ 10.6 శాతం మార్కెట్‌ వాటాతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2019 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో మొత్తం 3.69 కోట్ల యూనిట్ల స్మార్ట్‌ఫోన్‌ షిప్‌మెంట్స్‌తో 5.5 శాతం వృద్ధి నమోదైంది. కానీ గత త్రైమాసికంతో పోల్చితే 20.8 శాతం తగ్గుదల నమోదైంది.

డిసెంబర్‌ త్రైమాసికంలో షియోమీ ఏకంగా 15.9 శాతం వృద్ధిని నమోదు చేసి మార్కెట్‌లో 29 శాతం వాటా దక్కించుకుంది. వివో 18.8 శాతం, శామ్‌సంగ్‌ 15.5 శాతం, ఒప్పో 13 శాతం, రియల్‌ మీ 12.8 శాతం మార్కెట్‌ వాటాతో తర్వాతి స్థానంలో ఉన్నాయి. 

also read గూగుల్‌ మ్యాప్స్‌ 15వ బర్త్ డే స్పెషల్...ఎంటో తెలుసా...?

భారత స్మార్ట్​ఫోన్‌ మార్కెట్‌లో భారీ వృద్ధిని నమోదు చేస్తున్నందుకు సంతోషంగా ఉందని షియోమీ ఉపాధ్యక్షుడు, సంస్థ భారత్ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మను జైన్‌ తెలిపారు. కొనుగోలుదారులను పెంచుకోవడంపైనే ద్రుష్టిని కేంద్రీకరించామని తెలిపారు. ఫీచర్ ఫోన్ల విక్రయామలు మాత్రం గత ఏడాది చివరి త్రైమాసికంలో 21.1 శాతం క్షీణించాయి. 2019 చివరి మూడు నెలల్లో 30.1 మిలియన్​ యూనిట్లు విక్రయమైనట్లు ఐడీసీ నివేదిక తెలిపింది.

వివిధ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లపై అందిస్తున్న ఆఫర్లు, డిస్కౌంట్లు, కంప్లీట్‌ ప్రొటెక్షన్‌ ఆఫర్లు‌, బైబ్యాక్‌, ఎక్ఛేంజ్‌ ఆఫర్లు‌, నో కాస్ట్‌ ఈఎంఐ లాంటి వసతులతో ఆన్‌లైన్‌ విక్రయాలు 2019లో 41.7 శాతం పెరిగాయి. 2018తో పోలిస్తే ఇది 18.4 శాతం ఎక్కువ అని ఐడీసీ ఇండియా రీసెర్చ్‌ మేనేజర్‌ ఉపాసనా జోషి తెలిపారు.

click me!