ఫోన్‌పేలో చాట్ ఫీచర్ తో సహ చాట్ హిస్టరిలో వారి మనీ ట్రాన్సాక్షన్స్ చూసుకోవడానికి వినియోగదారులను ఉపయోగపడుతుంది.డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్‌పే యాప్ లో కొత్త చాట్ ఫీచర్‌ను అధికారికంగా ప్రారంభించింది.
ప్రముఖ ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్ యాప్ ఫోన్‌పే ఒక కొత్త ఫీచర్‌ను తాజాగా వినియోగదారులకోసం అందుబాటులోకి తిసుకొచ్చింది. డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్‌పే యాప్ లో కొత్త చాట్ ఫీచర్‌ను అధికారికంగా ప్రారంభించింది. ఈ చాట్ ఫీచర్ లో వినియోగదారులు చాట్ తో పాటు వారు చేసిన మనీ ట్రాన్సఫర్ హిస్టరిని కూడా చూసుకోవచ్చు.
also read వాట్సాప్ సేఫ్ కాదు...టెలిగ్రామ్ సీఈఓ హెచ్చరిక...
చాట్ పేరిట యూజర్లకు లభిస్తున్న ఈ ఫీచర్ సహాయంతో ఫోన్‌పే యాప్‌లో వారు తమ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వారికి మనీ రిక్వెస్ట్ పంపుకోవచ్చు.అలాగే వారికి డబ్బులు సులభంగా పంపించవచ్చు.ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఇప్పుడు మరే ఇతర మెసేజింగ్ యాప్ అవసరం లేకుండా మని రిక్వెస్ట్ ఇంకా పేమెంట్ చేసుకోవచ్చు.
"ఫోన్‌పే చాట్ మా వినియోగదారులకు చాట్ చేస్తు వారు డబ్బును సులభంగా పంపడానికి సహకరిస్తుంది.ఫోన్‌పే యాప్ లో యూజర్ లావాదేవీల హిస్టరి చాట్ కూడా చూపిస్తుంది. ఇది చాలా ఆకర్షణీయమైన ఫీచర్ గా ఉపయోగపడుతుంది "అని ఫోన్‌పే సహ వ్యవస్థాపకుడు, సిటిఓ రాహుల్ చారి ఒక ప్రకటనలో తెలిపారు.
also read కరోనావైరస్ కారణంగా తగ్గుతున్న ఐఫోన్ ఉత్పత్తి....
ఇది చాట్ హిస్టరితో పాటు వారి లావాదేవీలను ట్రాక్ చేయడానికి వినియోగదారులను ఉపయోగకరంగా ఉంటుంది."రాబోయే రోజుల్లో మేము గ్రూప్ చాట్ వంటి ఫీచర్లతో ఫోన్‌పే చాట్‌ను మెరుగుపరుస్తాము. ఇంకా వినియోగదారులకు వారి కాంటాక్ట్స్ ద్వారా ఫ్రెండ్స్, కుటుంబ సభ్యుల నుండి డబ్బును పంపించడం / పొందడం చాలా సులభం చేస్తుంది" అని రాహుల్ చారి తెలిపారు.
ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజెస్ కోసం వారం క్రితం లాంచ్ చేసిన ఈ ఫీచర్ 185 మిలియన్ ఫోన్‌పే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిందని కంపెనీ తెలిపింది.