సొరకాయను వీళ్లు అస్సలు తినకూడదు..

By Shivaleela Rajamoni  |  First Published Jun 29, 2024, 10:08 AM IST

ఆరోగ్యకరమైన కూరగాయల్లో సొరకాయ ఒకటి. సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటంది. ఇది మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంతో పాటుగా మనం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది. కానీ ఈ కూరగాయను కొంతమంది మాత్రం అస్సలు తినకూడదు. వాళ్లు ఎవరెవరంటే?
 


సొరకాయ మంచి హెల్తీ కూరగాయ. దీనిలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో  పోషకాలు ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. వీటితో పాటుగా విటమిన్ బి, విటమిన్ సి తో పాటుగా ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. కానీ సొరకాయ కొంతమందికి మాత్రం అస్సలు మంచిదికాదు. దీన్ని తింటే ఎన్నో సమస్యలు వస్తాయి. అసలు సొరకాయను ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

మూత్రపిండాల సమస్యలు 

Latest Videos

మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు సొరకాయను అస్సలు తినకూడదు. ఎందుకంటే దీన్ని తింటే వీరి శరీరంలో పొటాషియం పరిమాణం పెరుగుతుంది. దీంతో మూత్రపిండాల ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది. 

అలెర్జీ

కొంతమందికి సొరకాయ అలెర్జీ కూడా ఉంటుంది. మీకు ఏదైనా చర్మ సమస్య ఉంటే.. సొరకాయను తినడం మానేయండి. ఎందుకంటే ఇది అలెర్జీకి దారితీస్తుంది.

ప్రెగ్నెన్సీ టైంలో తినకూడదు 

గర్భంతో ఉన్నప్పుడు ఆడవారు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా సొరకాయను కూడా తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ తినాలనుకుంటే డాక్టర్ ను సంప్రదించిన తర్వాత మాత్రమే తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గర్భధారణ సమయంలో దీనిని తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. 

పాలిచ్చే తల్లులు

పాలిచ్చే ఆడవారు కూడా సొరకాయను తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది వారి ఆరోగ్యంపై చెడు ప్రభావాన్నిచూపుతుంది. అయితే దీనిపై మరిన్ని పరిశోధనలు అవసరమవుతాయని నిపుణులు అంటున్నారు. 

జీర్ణ సమస్యలు

సొరకాయను తింటే జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా దీన్ని తింటే గ్యాస్, అపానవాయువు, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే సొరకాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.  ఇది జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. 

డయాబెటిస్ పేషెంట్లు

సొరకాయను డయాబెటీస్ పేషెంట్లు కూడా తినకూడదు. ఎందుకంటే దీన్ని తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఒకవేళ మీరు డయాబెటీస్ కంట్రోల్ లో ఉండటానికి మందులు వాడుతున్నట్టైతే సొరకాయను తినకుండా ఉండండి. 

click me!