మొలకలతో ఇడ్లీ .. బరువు కూడా తగ్గొచ్చు..!

By Ramya news team  |  First Published Feb 8, 2022, 4:57 PM IST

రెగ్యులర్ ఇడ్లీని కేవలం రెండు మాత్రమే తింటూ ఉంటారు. అది కూడా చట్నీ లేకుండా సాంబారుతో ట్రై చేస్తుంటారు. అలా కాకుండా.. కొత్తగా మొలకలతో ఇడ్లీ తీసుకుంటే.. శరీరానికి ప్రోటీన్స్ తో పాటు... సులభంగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.
 


బరువు తగ్గాలి అనుకునేవారు.. చాలా ప్రయత్నాలు  చేస్తుంటారు. ముఖ్యంగా.. తిండి తినడం మానేస్తూ ఉంటారు. అయితే..  బరువు తగ్గాలంటే..  వ్యాయామం చేయడంతో పాటు..  ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా చాలా అవసరం.  మామూలుగా మనలో చాలా మంది బరువు తగ్గాలి అనుకుంటే.. రెగ్యులర్ ఇడ్లీని కేవలం రెండు మాత్రమే తింటూ ఉంటారు. అది కూడా చట్నీ లేకుండా సాంబారుతో ట్రై చేస్తుంటారు. అలా కాకుండా.. కొత్తగా మొలకలతో ఇడ్లీ తీసుకుంటే.. శరీరానికి ప్రోటీన్స్ తో పాటు... సులభంగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Latest Videos

మరి.. ఈ మొలకల ఇడ్లీ తయారు  చేయడం ఎలాగో ఓసారి చూసేద్దామా..

పెసర పప్పు, శెనగలను కనీసం నాలుగు గంటల పాటు నీటిలో నానపెట్టాలి. అలా నానపెట్టిన వాటిని శుభ్రంగా కడిగి.. నీరు మొత్తం తీసేసి గ్రైండర్ లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. దానిలో కొద్దిగా ఉప్పు, పెరుగు వేసి బాగా కలిపి ఉంచాలి. దానిని పక్కన పెట్టాలి.

ఒక బాండీలో.. బఠానీలు, క్యారెట్లు ఉడకనివ్వాలి. తర్వాత వాటిని కొద్దిగా నూనె వేసి.. అందులో కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ వేసి  వేయించాలి. అందులోనే ఉడకపెట్టిన క్యారెట్, బఠానీలు కూడా వేయాలి. దీనిలో కూడా సరిపడా ఉప్పు వేసుకోవాలి. వీటిని.. ముందుగా రుబ్బి పెట్టుకున్న పిండి లో వేసి బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని.. ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు మాదిరిగా వేసుకొని ఆవిరి మీద ఉడికించాలి. అంతే.. టేస్టీ మొలకల ఇడ్లీ రెడీ. ఈ ఇడ్లీలను పప్పులను  మొలకలు వచ్చిన తర్వాత కూడా రుబ్చి చేసుకోవచ్చు. అది ఇంకా ఆరోగ్యానికి మంచిది. దీనిలో ప్రోటీన్ విలువలు ఎక్కువగా ఉంటాయి.

click me!