శరీరానికి కావలిసిన అతిముఖ్య విటమినులు - అవి లభించు పదార్ధాలు

By telugu news team  |  First Published Mar 17, 2021, 3:30 PM IST


 A , B , C , D , E అను పేర్లతో విటమిన్లు ప్రాముఖ్యం పొందినవి. వీటిని "దేహ నిర్మాతలు " అని తెలుగులో పిలుస్తారు. ఇవి మనం తిను ఆహారం నందు లేకున్న శరీరపోషణం సరిగ్గా జరగదు. గుడ్లు , పాలు , పండ్లు , దంపుడు బియ్యం మొదలగు సహజసిద్ధముగా లభించు పదార్ధములలో ఈ విటమిన్లు ఎక్కువుగా ఉండును.


డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Latest Videos

ప్రస్తుత కాలంలో కరోనా వైరస్ చాపకింద నీరులాగా వ్యవహరిస్తుండం మనం గమనిస్తూనే ఉన్నాం. మనం వైరస్ బారిన పడకుండా ఉండడం కొరకు ఇమ్యునిటి పవర్ పెంచుకుంటే సరిపోతుంది. మరి ఏ విటమిన్ ఏ ఆహార పదార్ధాలలో లభిస్తుందో తెలుసుకుందాం.   

 A , B , C , D , E అను పేర్లతో విటమిన్లు ప్రాముఖ్యం పొందినవి. వీటిని "దేహ నిర్మాతలు " అని తెలుగులో పిలుస్తారు. ఇవి మనం తిను ఆహారం నందు లేకున్న శరీరపోషణం సరిగ్గా జరగదు. గుడ్లు , పాలు , పండ్లు , దంపుడు బియ్యం మొదలగు సహజసిద్ధముగా లభించు పదార్ధములలో ఈ విటమిన్లు ఎక్కువుగా ఉండును. 

ఇప్పుడు ఈ అయిదు ముఖ్యవిటమిన్ల గురించి మీకు వివరిస్తాను:-

 * "A" విటమిన్  - ఇది లోపించినవారికి "రేచీకటి" వచ్చును. కన్ను , నోరు , ఊపిరితిత్తులు మొదలైన సున్నితమైన చర్మం ఎండిపోయి రోగములు తెచ్చు సూక్ష్మజీవులు దాడిచేయుటకు అనువుగా ఉండును. శరీరం చక్కగా ఎదుగుటకు, గర్భధారణకు, బాలింతలుగా ఉన్న సమయమున ఈ విటమిన్ చాలా అవసరం .

 ఈ "A" విటమిన్ ఎక్కువుగా పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, గుడ్లు, చేపలు, పచ్చికూరలు, కాడ్ లివర్ ఆయిల్, టొమాటో, బొప్పాయి, నారింజపండ్లు, బచ్చలి, తొటకూర మొదలైన వాటిలో ఎక్కువుగా ఉండును.

 *  "B" విటమిన్  - ఇది లోపించిన నరముల నిస్సత్తువ , ఉబ్బసరోగం కలుగును.

ఈ "B" పచ్చికూరలు , మాంసము , పప్పుదినుసులు, గుడ్లు మొదలయిన వాటిలో లభించును. "B6" విటమిన్ తెల్లరక్త కణాలు తయారీకి ఉపయోగపడును. అరటిపండులో, పచ్చటి ఆకుకూరలలో, పప్పుదినుసుల్లో, చిక్కుడు, బంగాళాదుంపలలో ఈ విటమిన్ ఎక్కువుగా ఉండును. 

"B12" విటమిన్ ఇది లోపించిన పెదవుల్లో పగుళ్లు వస్తాయి. ఎర్ర రక్తకణాలు ఏర్పడటానికి, నాడీ మండలం వ్యవస్థకు, నీరసం, జ్ఞాపకశక్తి తగ్గటం, నోటిపూత, నరాల కణాలు నశించిపోవడం వంటి సమస్యలు వస్తాయి. ఈ "B12" విటమిన్ పాల ఉత్పత్తుల్లో, సోయాచిక్కుడు పాలలో పుష్కలంగా ఉండును.

 *  "C" విటమిన్ - శరీరంలో ఈ విటమిన్ "స్కర్వీ " అను వ్యాధి వస్తుంది. ఈ విటమిన్ యాంటిబయాటిక్ గా పనిచేయును . జీర్ణశక్తిని పెంచును. విటమిన్ C లోపించిన ఐరన్ ను ప్రేగులు గ్రహించలేవు . ఐరన్ లోపిస్తే రక్తహీనత ఏర్పడును. ఈ విటమిన్ ఎక్కువుగా నిమ్మకాయ, ఉసిరికాయ, కొత్తిమీర, పండ్లరసములు, మొలకెత్తిన గింజలలో, కలబందలో, వెల్లుల్లిలో, ముల్లంగిలో, పైనాపిల్ లో, కొబ్బరి బోండాలలో, మునగ ఆకులో పుష్కలంగా లభించును.

 *  "D" విటమిన్ - బిడ్డల ఎదుగుదలకు ఈ విటమిన్ చాలా అవసరం. ఇది లోపించిన బిడ్డలు దొడ్డికాళ్ళు వారగును. ఇది A విటమిన్ తో కలిసి వెన్న, గుడ్డులొని పచ్చసొనలో ఉండును. ఉదయం, సాయంకాలం శరీరముకు సూర్యరశ్మి తగులుట వలన శరీరానికి కావలసిన D విటమిన్ బాగుగా లభించును. ఈ విటమిన్ శరీరంలో కొంత మొత్తంలో తయారగును.

ఈ D విటమిన్ మన శరీరంలో ఎముకలు క్షీణించకుండా చూస్తూ వాటిని దృడంగా ఉంచును. రోగ నిరోధక శక్తి బలోపెతం చేసేగుణం ఈ విటమిన్ కు ఉండును. ఇన్సులిన్ శరీరం సంగ్రహించుటకు తోడ్పడును. విటమిన్ D కణ విభజనను నియంత్రిస్తుంది. ఫలితముగా క్యాన్సరు నివారణకు తోడ్పడును. విటమిన్ D లోపము వలన పేగు క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు, ప్రొస్టేట్ గ్రంథి క్యాన్సరు, క్లోమ క్యాన్సరు ముప్పుని తొలగించును. ఉదయం 6 నుంచి 8 లోపు సూర్య నమస్కారాలు చేయుట మంచిది. ఈ విటమిన్ లోపం ఉన్నవాళ్లు తరచుగా పాలు, గోధుమలు, మరియు దేశివాళీ ఆవునెయ్యిలో తరచుగా తీసికొనవలెను .

 * "E " విటమిన్  - ఇది లోపించిన నపుంసకత్వం కలుగును. A విటమిన్ మరియు C విటమిన్లను మరియు ప్రోటీయాసిడ్స్ ని శరీరం నుండి నశించకుండా రక్షించే గుణం పైనాపిల్ లో ఉన్న E విటమిన్ లో ఉన్నది. వేరుశనగలో, బాదంలో, కాయగింజలలో, సొయాచిక్కుడు, గట్టి గింజలలో దొరుకును. గోధుమ, మొలకెత్తిన గింజలలో, మాంసములో ఎక్కువుగా లభించును.

 వీటితో పాటు విటమిన్ K కూడా మనకి ముఖ్యమయినది. ఈ విటమిన్ K రక్తం గడ్డకట్టుటకు ఉపయోగపడింది. ఈ విటమిన్ K లోపించడం వలన రక్తం గడ్డకట్టడం జరగదు. ఈ విటమిన్ K పచ్చిబఠాణీ, ఆవునెయ్యి, క్యారెట్ లలో ఎక్కువుగా ఉండును.

పై తెలిపిన విషయాలు రోజు మనం తీసుకునే ఆహారంలో ఉండేలా జాగ్రత్త పడాలి. రోజు పరిగడుపున గోరువెచ్చని నీళ్ళు త్రాగాలి. క్రమం తప్పకుండా యోగాసానాలు, ధ్యానం, వాకింగ్ లాంటివి తప్పకుండా చేయాలి. మైదా పిండితో తయారైన వంటకాలు తినవద్దు. బేకరి పదార్ధాలకు దూరంగా ఉండాలి. సాధ్యమైనంత బయట పదార్ధాలు తినకపోవడం ఉత్తమం.  


 

click me!