శాండ్ విచ్ కోసం హెలికాప్టర్ లో వెళ్లి మరీ తెచ్చుకున్నాడు. దీనిని సదరు కంపెనీ వాళ్లు వీడియో తీయగా.. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది.
ఆహార ప్రియులు చాలా మంది ఉంటారు. తమకు నచ్చిన ఆహారం తినడం కోసం చాలా దూరం వెళ్లి తినేస్తుంటారు. అయితే.. ఎంత వెళ్లినా మహా అయితే... ఆ సిటీలో పక్క సందులోకో.. లేదా ఇంకొం దూరంమో వెళ్లి తింటారు. కానీ.. ఓ వ్యక్తి మాత్రం ఏకంగా శాండ్ విచ్ తినడానికి ఏకంగా 130కిలోమీటర్ల దూరం హెలికాప్టర్ లో వెళ్లి మరీ.. తిన్నాడు.
ఈ సంఘటన యూకేలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
గతంలో ఓ మహిళ మెక్ డోనాల్డ్స్ బర్గర్ తినడానికి 100 మైళ్లు ప్రయాణించింది. కరోనా సమయంలో లాక్ డౌన్ విధించినా.. ఆ యువతి రూల్స్ అతిక్రమించి వెళ్లి బర్గర్ తిన్నది. కాగా.. ఇప్పుడు ఓ వ్యక్తి అలా చేయడం గమనార్హం.
శాండ్ విచ్ కోసం హెలికాప్టర్ లో వెళ్లి మరీ తెచ్చుకున్నాడు. దీనిని సదరు కంపెనీ వాళ్లు వీడియో తీయగా.. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది.
చిప్పింగ్ ఫార్మ్ షాప్ లనే యూకే బేస్డ్ కంపెనీ అక్కడ ఆర్గానిక్ ఫుడ్స్ మాత్రమే అందస్తుంది. బేకరీ ఫుడ్స్ కూడా అక్కడ అందుబాటులో ఉన్నాయి. ఆ ఫుడ్ అంటే వీరాభిమానం ఉన్న సదరు వ్యక్తి.. అంత దూరం ప్రయాణించి వెళ్లి.. తనకు నచ్చిన శాండ్ విచ్ తెచ్చుకున్నాడు. కావాలంటే ఆ వీడియో మీరు కూడా కింద చూడొచ్చు.