అన్నం ఫోర్క్ తో తినాలా...? ఏకి పారేస్తున్న నెటిజన్లు..!

Published : Mar 09, 2021, 10:02 AM ISTUpdated : Mar 09, 2021, 10:11 AM IST
అన్నం ఫోర్క్ తో తినాలా...? ఏకి పారేస్తున్న నెటిజన్లు..!

సారాంశం

ఆ పోస్టుపై అందరూ విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఆయన పోస్టుకి దాదాపు 8వేల మంది కామెంట్స్ చేయడం గమనార్హం. 1200 లైకులు వచ్చాయి.

మన దేశంలోని అన్ని ప్రాంతాల్లో దాదాపు అందరూ రైస్ ఆహారంగా తీసుకుంటారు. అంతేకాదు.. అందరం చేతులతోనే అన్నం తింటాం. అసలు అలా తింటేనే మనకు భోజనం చేసినట్లు కూడా ఉంటుంది. అయితే... తాజాగా..  అన్నం ఇలా తినాలి అంటూ... బ్రిటీష్ రాయల్ మాజీ బట్లర్ ట్విట్టర్ లో ఓ ఫోటో షేర్ చేశాడు.

కాగా... ఆయన పెట్టిన పోస్టుపై ప్రస్తుతం సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. అంత మందికి కోపం తెప్పించేలా ఆయన పెట్టిన పోస్టులో ఏముందంటే... ప్లేట్ లో అన్నం ఫోర్క్ తో తింటున్నట్లుగా ఆ ఫోటో ఉంది. అంతే కాకుండా.. తాము అన్నం.. స్పూన్, ఫోర్క్, చాప్ స్టిక్క్ తో తింటామని.. చేతులతో తినమంటూ ఆయన పోస్టు చేశారు.

 

కాగా... ఆ పోస్టుపై అందరూ విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఆయన పోస్టుకి దాదాపు 8వేల మంది కామెంట్స్ చేయడం గమనార్హం. 1200 లైకులు వచ్చాయి.

‘లేడీస్ & జెంటిల్మెన్, మేము ఎల్లప్పుడూ చాలా సౌకర్యవంతమైన, పరిశుభ్రమైన, పోర్టబుల్, పర్యావరణ అనుకూలమైన, ఖర్చు లేని పరికరమైన చేతిని  ఉపయోగిస్తాము’ అంటూ ఒకరు ఆ పోస్టుకి కామెంట్ చేశారు.

"లేడీస్ అండ్ జెంటిల్మెన్, మనం ఎప్పుడూ రోజుకు రెండుసార్లు స్నానం చేస్తామని, సరైన పరిశుభ్రత పాటించాలని గుర్తుంచుకోండి, అందువల్ల బియ్యం తినడానికి మన చేతులు లేదా వేళ్లను ఉపయోగిస్తాము .." అని మరొకరు కామెంట్ చేశారు.

"మీరు మీ బర్గర్‌లను ఎలా తింటారు? కత్తి మరియు ఫోర్క్‌తోనా.. ఎవరి కంఫర్ట్ ని బట్టి వారు తింటారు.’’ అని మరొకరు పేర్కొన్నారు.

"చాలా ధన్యవాదాలు, మేము తినడానికి మా చేతులు మరియు వేళ్లను ఇష్టపడతాము’ అంటూ మరొకరు పేర్కొన్నారు. అంతేకాదు.. చాలా మంది తాము చేతులతో అన్నం తింటున్న ఫోటోలను షేర్ చేయడం గమనార్హం. 

PREV
click me!

Recommended Stories

రాత్రిపూట అన్నం మానేస్తే ఏమవుతుందో తెలుసా?
Winter Diet: చలికాలంలో ఏ కూరగాయలు తింటే ఆరోగ్యానికి మంచిది? ఏవి తినకూడదు?