చేదుగా ఉన్నా కాకరకాయను తప్పకుండా తినండి.. ఎందుకంటే?

By Mahesh Rajamoni  |  First Published Mar 17, 2023, 2:39 PM IST

కాకరకాయ మన శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. దీంతో గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాలు తగ్గుతాయి. 
 



కాకరకాయ అంటేనే ముఖం వికారంగా పెట్టేవాళ్లు ఉన్నారు. ఎందుకంటే ఇది చేదుగా ఉంటుంది. ఈ కూరగాయ చేదుగా ఉన్నా దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయనే విషయం చాలా మందికి తెలియదు. నిజానికి కాకరకాయ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ఐరన్ పుష్కలంగా ఉండే కాకరకాయలో పొటాషియం, విటమిన్ సి, మెగ్నీషియం, ఫోలేట్ జింక్, ఫాస్పరస్, మాంగనీస్, డైటరీ ఫైబర్స్, కాల్షియం లు కూడా మెండుగా ఉంటాయి. 

కాకరకాయ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. కళ్లు, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. యుఎస్డిఎ ప్రకారం.. 100 గ్రాముల కాకరకాయలో 13 కేలరీలు, 602 మిల్లీగ్రాముల సోడియం, 7 గ్రాముల పొటాషియం, 3 గ్రాముల కార్బోహైడ్రేట్లు,  6.34 గ్రాముల ప్రోటీన్ ఉంటాయి. 

Latest Videos

undefined

మధుమేహాన్ని నివారిస్తుంది

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 382 మిలియన్లకు పైగా ప్రజలు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. కాకరకాయలో పాలీపెప్టైడ్-పి లేదా పి-ఇన్సులిన్ అని పిలువబడే ఇన్సులిన్ లాంటి సమ్మేళనం ఉంటుంది. ఇది సహజంగా డయాబెటిస్ ను నియంత్రిస్తుందని నిరూపించబడింది.

2011 లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. నాలుగు వారాల క్లినికల్ ట్రయల్ ప్రకారం.. 2,000 మి.గ్రా బొప్పాయిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల టైప్ -2 డయాబెటిస్ రోగుల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉన్నట్టు కనుగొన్నారు. 

కాకరకాయ టైప్ -1 డయాబెటిస్ ఉన్నవారికి కూడా సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. జర్నల్ ఆఫ్ కెమిస్ట్రీ & బయాలజీలో ప్రచురించిన మరొక నివేదిక ప్రకారం..  కాకరకాయను తినడం వల్ల గ్లూకోజ్ శోషణ పెరుగుతుంది. గ్లైసెమిక్ నియంత్రణ కూడా మెరుగుపడుతుంది.

కాకరకాయ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. దీంతో గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాలు చాలా వరకు తగ్గిపోతాయి. దీనిలో ఐరన్, ఫోలిక్ యాసిడ్ లు పుష్కలంగా ఉంటాయి. ఇది గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

జుట్టుకు, చర్మానికి ఎంతో మేలు

మెరిసే చర్మానికి, అందమైన జుట్టుకు కూడా కాకరకాయ ఎంతగానో సహాయపడుతుంది. కాకరకాయ రసంలో విటమిన్ ఎ, విటమిన్ సి లతో పాటు బలమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయని వివిధ అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇవి చర్మం అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తాయి. ముడతలను తగ్గిస్తాయి. అంతేకాదు ఇది మొటిమలను కూడా తగ్గిస్తుంది. తామర, సోరియాసిస్ వంటి వ్యాధులను తగ్గించడానికి సహాయపడుతుంది. కాకరకాయ హానికరమైన యువి కిరణాల నుంచి మన చర్మాన్ని రక్షిస్తుంది.

విటమిన్ ఎ, విటమిన్ సి, బయోటిన్, జింక్ వంటి పోషకాలు జుట్టును అందంగా మారుస్తాయి. కాకరకాయ రసాన్ని క్రమం తప్పకుండా నెత్తిమీద అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు తెల్లబడటం తగ్గుతుంది. జుట్టు చివర్లు పగిలిపోయే అవకాశమే ఉండదు. రెండు టీ స్పూన్ల కాకరకాయ రసం, జీలకర్ర పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి హెయిర్ మాస్క్ వేసుకుంటే చుండ్రు తగ్గిపోతుంది. ఈ ప్యాక్ ను జుట్టుకు పట్టించి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. బాగా ఆరిన తర్వాత రెగ్యులర్ షాంపూతో తలస్నానం చేయాలి.

కాకరకాయ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాకరకాయలో కేలరీలు, కొవ్వు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఇది ఆకలిని తగ్గించడానికి సహాయపడుతుంది. కాకరకాయ వైరస్లు, బ్యాక్టీరియాలతో పోరాడి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అలర్జీలు, అజీర్తిని నివారిస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధికి వ్యతిరేకంగా పోరాడుతాయి. జర్నల్ ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ లో ప్రచురించబడిన 2010 అధ్యయనం కాకరకాయలో యాంటీ కార్సినోజెన్, యాంటీ ట్యూమర్ లక్షణాలు ఉన్నాయని కనుగొన్నారు. ఇది ప్రోస్టేట్, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

click me!