ఈ ఒక్క జ్యూస్ చాలు..అందంగా మెరిసిపోతారు..!

By telugu news team  |  First Published Jun 13, 2023, 2:04 PM IST

 చాలా మందికి అన్ని పండ్లు, కూరగాయలు తినాలని ఉండదు. అలాంటివారు హ్యాపీగా ఈ జ్యూస్ తాగేయవచ్చు. ఈ జ్యూస్ మీ చర్మాన్ని అందంగా మెరవడానికి సహాయపడుతుంది. మరి ఈ జ్యస్ ఎలా తయారు చేసుకోవాలో ఓసారి చూద్దాం..



అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా వయసు పెరుగుతున్నప్పటికీ, చిన్నగా కనిపించాలనే తాపత్రయం చాలా మందిలో ఉంటుంది. దాని కోసం చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరు బ్యూటీ పార్లర్ ల వెంట పరుగులు పెడతారు. లేదంటే ఏవైనా ఖరీదైన క్రీములు అవి, ఇవీ రాసేస్తూ ఉంటారు. అయితే, అవేమీ లేకుండా, కేవలం ఒక్క జ్యూస్ తో మనం అందంగా మెరిసిపోవచ్చట. మరి ఆ జ్యూస్ ఏంటో మనమూ తెలుసుకుందాం..

మరీ ముఖ్యంగా చాలా మందికి అన్ని పండ్లు, కూరగాయలు తినాలని ఉండదు. అలాంటివారు హ్యాపీగా ఈ జ్యూస్ తాగేయవచ్చు. ఈ జ్యూస్ మీ చర్మాన్ని అందంగా మెరవడానికి సహాయపడుతుంది. మరి ఈ జ్యస్ ఎలా తయారు చేసుకోవాలో ఓసారి చూద్దాం..

Latest Videos

ఈ జ్యూస్ తయారీకి కావాల్సిన పదార్థాలు..
ఒక బీట్ రూట్, ఒక ఆరెంజ్, ఒక ఆరెంజ్, ఒక గ్రీన్ కానీ, రెడ్ ఆపిల్, ఒక చిన్న కీర దోస, ఒక టమాట,

ఇప్పుడు ఈ పండ్లు, కూరగాయలు అన్నింటినీ కలిసి బ్లెండర్ లో వేసి మెత్తని జ్యూస్ లాగా చేసుకోవాలి. అంతే, జ్యూస్ రెడీ. ఈ జ్యూస్ ని ప్రతిరోజూ తాగడం అలవాటు చేసుకోవాలి. ఈ జ్యూస్ ప్రతిరోజూ తాగడం వల్ల చర్మం అందం పెరుగుతుంది. మీ ముఖం ఎన్నడూ లేనంత కాంతివంతంగా కనపడుతుంది. అయితే, దీనిని ప్రతిరోజూ తాగడం అలవాటు చేసుకోవాలి. ఒక్కసారి తాగితే మీకు ఎలాంటి మార్పు కనపడకపోవచ్చు. కానీ, ప్రతిరోజూ తాగడం వల్ల కచ్చితంగా తేడా మీకు కనపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీకు కాంతివంతమైన చర్మం కావాలంటే దీనిని వెంటనే ప్రయత్నించండి.
 

click me!