చెర్రీలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, జింక్, ఐరన్, బీటా కెరోటిన్, కాల్షియం, ఇతర యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. వీటిని తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి.
చెర్రీల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. చెర్రీలు తీయగా, పుల్లగా ఉంటాయి. నిజానికి చెర్రీల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, జింక్, ఐరన్, బీటా కెరోటిన్, కాల్షియంతో పాటుగా ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో నిద్రకు తోడ్పడే 'మెలటోనిన్' అనే హార్మోన్ కూడా ఉంటుంది. వీటిని తింటే రాత్రిళ్లు హాయిగా నిద్ర పడుతుంది. అసలు చెర్రీలను తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..