కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తినాల్సిందే..!

By Mahesh Rajamoni  |  First Published Jun 18, 2023, 2:52 PM IST

మూత్రపిండాల వ్యాధులను సమర్థవంతంగా  తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఉప్పు, ప్రోటీన్, పొటాషియం, భాస్వరం తక్కువగా ఉండే ఆహారాలనే మూత్రపిండాల సమస్యలున్న వారు తినాలి. 
 


మూత్రపిండాలు మన శరీరం నుంచి విషాన్ని, మలినాలను బయటకు పంపే ముఖ్యమైన అవయవాలు.అందుకే మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. కానీ  మన మూత్రపిండాల ఆరోగ్యం ఎన్నో కారణాల వల్ల దెబ్బతింటుంది. డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి వ్యాధులు కొన్నిసార్లు మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తాయి. మూత్రం లేదా మూత్రపిండాలలో రాళ్లు మూత్రపిండాల పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం వల్ల కిడ్నీల ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి డాక్టర్ సలహా మేరకు మాత్రమే పెయిన్ కిల్లర్స్ ను వాడాలి. మూత్రపిండాల వ్యాధులను తగ్గించడానికి ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. మన కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

గుడ్లు

Latest Videos

గుడ్డు మంచి సంపూర్ణ  ఆహారం. దీనిని తింటే మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు అందుతాయి. గుడ్డులోని తెల్లసొనను ఆహారంలో చేర్చుకోవడం వల్ల మన మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి.

క్యారెట్లు

క్యారెట్లను తింటే కంటి ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాదు ఇది కిడ్నీ రోగులు కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. క్యారెట్లను తింటే అధిక రక్తపోటు తగ్గుతుంది. మధుమేహం నియంత్రణలో ఉంటుంది. అందుకే వీటిని తరచుగా తింటూ ఉండాలి. 

కాలీఫ్లవర్

కాలిఫ్లవర్ లో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఇ, ఫోలేట్ , ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే మన మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. 

క్యాబేజీ

క్యాబేజీ మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. టేస్టీగా లేదని ఈ కూరగాయలను పక్కన పెడితే ఎన్నో పోషకాలను మిస్ అవుతారు. ఈ కూరగాయ మన మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 

రెడ్ క్యాప్సికమ్

రెడ్ క్యాప్సికమ్ లో పొటాషియం చాలా తక్కువగా ఉంటుంది. ఈ కూరగాయ మూత్రపిండాల ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. రెడ్ క్యాప్సికమ్ లో విటమిన్ సి, విటమిన్ బి6, విటమిన్ ఎ, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మూత్రపిండాల ఆరోగ్యాన్ని  కాపాడుతాయి. 

బ్లూబెర్రీలు

బ్లూబెర్రీల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇలతో పాటుగా మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కిడ్నీల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

పసుపు

పసుపునకు కర్కుమిన్ అనే రసాయనం రంగు ఇస్తుంది. ఇది మనం అనేక వ్యాధుల నుంచి బయటపడటానికి సహాయపడుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పసుపును డైట్ లో చేర్చుకోవడం వల్ల కిడ్నీల ఆరోగ్యం బాగుంటుంది. 

అల్లం

అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ అల్లాన్ని తీసుకుంటే మూత్రపిండాల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. 

వెల్లుల్లి

మీ రోజువారి ఆహారంలో వెల్లుల్లిని చేర్చడం వల్ల మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. 

ఆలివ్ ఆయిల్

కిడ్నీ వ్యాధులన్నవారు ఆలివ్ ఆయిల్ ను ఖచ్చితంగా వాడాలి. ఎందుకంటే ఇది ఆరోగ్యకరమైన కొవ్వుకు మంచి మూలం. మూత్రపిండాల ఆరోగ్యాన్ని రక్షించడానికి కూడా ఇవి సహాయపడతాయి.

ఎర్రద్రాక్ష

ఎర్ర ద్రాక్షలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

click me!