
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రాన్ని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేశారు. ఈ ఏడాది మార్చి 25 ప్రపంచ వ్యాప్తంగా ప్రాంతీయ భాషల్లోనూ రిలీజ్ అయ్యింది. తొలిరోజునుంచే ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. దాదాపు నెలకు పైగా RRR క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతాఇంతా కాదు. అటు హిందీలోనూ బాక్సాఫీసు రికార్డులను బ్రేక్ చేసింది. ఇప్పటి వరకు రూ.1200 గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి టాప్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్ లో నాల్గొ స్థానానికి చేరుకుంది.
అయితే ఈచిత్రం (RRR OTT) రెండు నెలల తర్వాత ఓటీటీలోకి రానుంది. జీ 5(Zee5)లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే రోజున డిజిటల్ స్ట్రీమింగ్ మొదలవుతుంది. ఇది ఎన్టీఆర్ అభిమానులకు మంచి ట్రీట్ అనే చెప్పొచ్చు. అయితే ఇది హిందీ కాకుండా, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఓటీటీలోకి రాబోతుంది. హిందీలో మాత్రం మరో నెల రోజుల తర్వాత నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది.
కాగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని ఇప్పటికీ చూడని వారు ఓటీటీలో చూడాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు సినిమా నచ్చిన వారు, అభిమానులు మరోసారి ఓటీటీలో చూడాలని భావిస్తున్నారు. ఈ సందర్భంగా జీ5 వీరికి భారీ షాక్ ఇచ్చింది. ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని చూడాలనుకుంటే కొంత మొత్తంలో డబ్బులు చెల్లించాలని షరతు విధించింది. జీ5 ఓటీటీ ‘జీప్లెక్స్’ ద్వారా సినిమాలను రెంట్ కు అందిస్తున్నండగా.. ఆర్ఆర్ఆర్ ను వీక్షించాలనుకునే వారు రూ.100 చెల్లించి అద్దె ప్రాతిపదికన సినిమాను పొందవచ్చని పేర్కొన్నాడు. గతంలో సబ్ స్క్రిప్షన్ ఉన్నవారు కూడా అదనంగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. వారం రోజుల వరకు సినిమా అందుబాటులో ఉంటుంది.
అయితే ‘ఆర్ఆర్ఆర్’ థియేట్రికల్ రిలీజ్ అప్పుడు కూడా భారీగా టికెట్స్ రేట్లను పెంచారు. తెలంగాణలో తొలి మూడు రోజుల్లో మల్టీప్లెక్స్ లో అయితే రూ.413, సింగిల్ థియేటర్ లో అయితే టికెట్ రేటు రూ.236కు పెంచారు. నాలుగో రోజు నుంచి కేవలం రూ.100 వరకు తగ్గించి.. సింగిల్ థియేటర్లో రూ.212, మల్టీప్లెక్స్ లో రూ. 354 వసూల్ చేశారు. అయినా అభిమానులు, సినీ ప్రియులు ఎగబడిమరీ సినిమాను చూశారు. ఇంతటి భారీ డిమాండ్ ఉన్న ఈ చిత్రానికి ఓటీటీలోనూ ప్రత్యేకంగా రేట్ ఫిక్స్ చేయడం షాక్ కు గురిచేస్తోంది. ఆర్ఆర్ఆర్ లో తారక్, చరణ్ ఫ్రీడం ఫైటర్స్ కొమురం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రలను పోషించారు. అలియా భట్, శ్రియా శరన్, ఒలివియా హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటించారు. డీవీవీ దానయ్య నిర్మించారు.