NTR: బాలయ్య చేతుల మీదుగా ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు.. ఏడాదిపాటు నిర్వహణ

Published : May 16, 2022, 01:07 PM IST
NTR: బాలయ్య చేతుల మీదుగా ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు.. ఏడాదిపాటు నిర్వహణ

సారాంశం

ఈ జయంతితో 99ఏళ్లు పూర్తి చేసుకుని వందవ ఏడాది ప్రారంభమవుతుంది. దీంతో ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు నిర్వహించబోతున్నారు. ఈ వేడుకలు ఎన్టీఆర్‌ నటన వారసుడు బాలకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు నిర్వహకులు తెలిపారు. 

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు(Nandamuri Taraka Ramarao) నటుడిగా తెలుగు తెరపై, రాజకీయ నాయకుడిగా తెలుగు రాష్టంపై చేరగని ముద్ర వేసుకున్నారు. రాముడంటే, కృష్ణుడంటే, రావణుడంటే గుర్తొచ్చేది ఆయనే. వెండితెరపై పాత్ర ఏదైనా అందులోకి పరకాయ ప్రవేశం చేసిన రక్తికట్టించి, ఆడియెన్స్ ని ఆ పాత్రలతో రంజింప చేసిన ఘనత NTR సొంతం. సీఎంగా తెలుగు రాష్ట్రంలో ఆయన చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమాలు చేపట్టారు. తెలుగు ప్రజల అభిమాన సీఎం అయ్యారు. ఆయన జయంతి మే 28. 

ఎన్టీఆర్‌ మే 28, 2023లో జన్మించిన నేపథ్యంలో ఈ జయంతితో 99ఏళ్లు పూర్తి చేసుకుని వందవ ఏడాది ప్రారంభమవుతుంది. దీంతో ఎన్టీఆర్‌ శతజయంతి(NTR 100th Anniversary) వేడుకలు నిర్వహించబోతున్నారు. ఈ వేడుకలు ఎన్టీఆర్‌ నటన వారసుడు బాలకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు నిర్వహకులు తెలిపారు. `తెలుగు ప్రేక్షకుల, ప్రజల గుండెల్లో అన్న నందమూరి తారక రామారావు గారు సృష్టించుకున్న స్థానం సుస్థిరమైనది. తెలుగు భాషపై.. తెలుగు నేలపై ఆయన ముద్ర అజరామరం. అందుకే ఆయన తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అయ్యారు.

 సినిమా రంగమైనా.. రాజకీయ వేదిక అయినా.. అన్ని చోట్ల కోట్లాది మంది మనసులో నిలిచిపోయిన యుగ పురుషుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఎన్నేళ్లయినా.. ఎన్నాళ్లైనా ఆ మహానుభావుడు తెలుగు జాతిపై చేసిన సంతకం మరువలేనిది. ఈ ఏడాది మే 28 నుండి ఆయన శత జయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి. అన్నగారి శత జయంతి వేడుకలు  హిందూపురం ఎమ్మెల్యే 'నటసింహ'నందమూరి బాలకృష్ణ గారి చేతుల మీదుగా ఘనంగా జరగనున్నాయి. 

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పుట్టిన ఊరు నిమ్మకూరులో ఈ వేడుకలు మే 28న ఉదయం బాలకృష్ణ గారి చేతుల మీదుగా అత్యంత ఘనంగా ప్రారంభం కానున్నాయి. అలాగే మధ్యాహ్నం గుంటూరు లోను, సాయంత్రం తెనాలిలోనూ ఈ శత జయంతి సందర్భంగా ఏడాది పొడవునా జరగనున్న కార్యక్రమాలను సైతం బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో, ఆయన చేతుల మీదుగానే ప్రారంభిస్తున్నారు. వీటికి సంబంధించిన ఏర్పాట్లు భారీగానే జరగనున్నాయి. అన్న గారి శత జయంతి వేడుకలు అంటే.. 10 కోట్ల మంది తెలుగు వారికి ప్రతి ఇంటి పండగ. ఈ వేడుకలకు అభిమానులు సైతం భారీగా హాజరు కాబోతున్నారు. స్వర్గీయ తారక రామారావు గారి శత జయంతి వేడుకలకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం` అని నిర్వహకులు తెలిపారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్