`ఎఫ్‌3` పార్టీ సాంగ్‌.. పూజా హెగ్డేతో కలిసి స్టేజ్‌పై రచ్చ రచ్చ చేసిన వెంకీ, వరుణ్‌

Published : May 16, 2022, 11:33 AM ISTUpdated : May 16, 2022, 11:36 AM IST
`ఎఫ్‌3` పార్టీ సాంగ్‌.. పూజా హెగ్డేతో కలిసి స్టేజ్‌పై రచ్చ రచ్చ చేసిన వెంకీ, వరుణ్‌

సారాంశం

వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ కలిసి నటించిన `ఎఫ్‌ 3` మూవీ లోని పార్టీ సాంగ్‌ విడుదలైంది. ఇందులో పూజా హెగ్డేతో కలిసి వీరిద్దరు చేసే రచ్చ హైలైట్‌గా నిలిచింది.

`వెంకీమామ` వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ రచ్చ రచ్చ చేశారు. పూజా హెగ్డేతో కలిసి నానా రచ్చ చేశారు. స్టేజ్‌పై బుట్టబొమ్మతో కలిసి పార్టీలో దుమ్ములేపారు. దీంతో ఇప్పుడిది ట్రెండ్‌ అవుతుంది. ఆ విశేషాలు చూస్తే, వెంకటేష్‌, వరుణ్‌ కలిసి `ఎఫ్‌ 3` సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇది మూడేళ్ల క్రితం వచ్చిన `ఎఫ్‌2` సినిమాకి సీక్వెల్‌. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన `ఎఫ్‌3` చిత్రంలో తమన్నా, మెహరీన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. సోనాల్‌ చౌహాన్‌ మరో కీలక పాత్రలో మెరవబోతుంది. దీంతోపాటు సునీల్‌ కూడా కూడా ఓ కీ రోల్‌ పోషిస్తున్నారు. 

అయితే ఈ చిత్రంలో పార్టీ సాంగ్‌ పేరుతో ఓ స్పెషల్‌ సాంగ్‌ని పెట్టారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. బుట్టబొమ్మ పూజా హెగ్డేతో ఈ పార్టీ సాంగ్‌ చేయించారు. `లైఫ్‌ అంటే ఇట్లా ఉండాలా` అంటూ సాగే ఈ పార్టీ సాంగ్‌ ప్రోమోని విడుదల చేశారు. సోమవారం ఉదయం ఈ సాంగ్‌ ప్రోమోని విడుదల చేయగా, ఇందులో పూజా హెగ్డేతో కలిసి వెంకీ, వరుణ్‌ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. హైలైట్‌ గా నిలుస్తుంది. పూజా హాట్‌ స్టెప్పులకు, వెంకీ, వరుణ్‌ మాస్‌ స్టెప్పులు ఉర్రూతలూగిస్తున్నాయి. జస్ట్ ప్రోమోనే ఈ రేంజ్‌లో ఉంటే ఇక ఫుల్‌ సాంగ్‌ ఇంకే రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 

ప్రస్తుతం ఈ పాట ప్రోమో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ పాట పూర్తి లిరికల్‌ సాంగ్‌ని రేపు(మే 17)న విడుదల చేయనున్నారు. `రంగస్థలం` తర్వాత పూజా హెగ్డే చేస్తున్న స్పెషల్‌ సాంగ్‌ ఇది కావడం విశేషం. ఇక దిల్‌రాజు నిర్మిస్తున్న `ఎఫ్‌ 3` చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేయబోతున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్