Zee Telugu Surprise: బంగార్రాజు' స్పెషల్ మాష్ అప్ సాంగ్ ఎక్స్ క్లూసివ్‌ టెలికాస్ట్.. డిటెయిల్స్

Published : Mar 23, 2022, 01:02 PM IST
Zee Telugu Surprise: బంగార్రాజు' స్పెషల్ మాష్ అప్ సాంగ్ ఎక్స్ క్లూసివ్‌ టెలికాస్ట్.. డిటెయిల్స్

సారాంశం

అక్కినేని నాగార్జున, నాగచైతన్యల అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతుంది జీతెలుగు. వీరిద్దరు కలిసి నటించిన `బంగార్రాజు` చిత్రంలోని ఓ స్పెషల్‌ సాంగ్‌ని ఎక్స్ క్లూజివ్‌గా విడుదల చేయబోతుంది.

కొత్తదనం అంటే జీ తెలుగు. ఎప్పుడు కూడా ప్రేక్షకులని అలరించాలనే తాపత్రయంతో సాధన చేస్తూనే ఉంటుంది. అందుకే వినోదం పంచడంలో ఎప్పుడూ ముందుంటుంది.  అలాంటి ఒక వినోదాన్ని స్వాగతిస్తూ, 2022 మొదటి బ్లాక్ బస్టర్ సినిమా 'బంగార్రాజు' ను ఈ ఆదివారం, మార్చి 27 సాయంత్రం 5.30 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేయనుంది. ఈ సంవత్సరం మొదలైనప్పటి నుండి అభిమానులని కొత్త రకంగా పలకరిస్తున్న మన ఛానల్, ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కోసం కూడా ఒక సర్ప్రైజ్ ఏర్పాటు చేసింది. తెలుగు టెలివిజన్ లో కని విని చూడని విధంగా ఇది ఉండబోతుంది. 

మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఒక స్పెషల్ మాష్ అప్ సాంగ్ చేయబోతున్నారు. ఈ సాంగ్ థియేటర్ లోగానీ, ఓ టి టి ప్లాట్ ఫాం లలో కూడా చూడని కంటెంట్. ఎక్స్ క్లూసివ్ గా టివి అభిమానులకి మాత్రమే అందించబోతుంది. ఇవన్నీ ఎప్పుడు ఎలా మీ ముందుకు వస్తాయో తెలియాలంటే జీ తెలుగు ఛానల్ ని వీక్షించండని చెబుతున్నారు టీవీ నిర్వహకులు.

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన `బంగర్రాజు` చిత్రంలో అన్ని రకాల ఎంటర్‌టైనింగ్‌ అంశాలున్నాయి. అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాలో రమ్య కృష్ణన్, కృతి శెట్టి నటించారు. జీ తెలుగు ఛానల్ ఎప్పుడు కూడా ప్రజల గుండెలలో మరియు వారి మధ్యలో ఉండాలని అనుకుంటుంది. అందుకే `భీమవరం లో బంగార్రాజులతో బులెట్ ర్యాలీ` అని అక్కినేని ఫాన్స్ కు ఒక అరుదైన అవకాశం కల్పించింది. `బంగార్రాజు` కాస్ట్యూమ్ వేసుకొని, బుల్లెట్ బైక్ నడపాలి. అలా అని చెప్పగానే, ఎంతో 70 + బైకర్స్ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని తెలుగు టెలివిజన్ లోనే సరికొత్త రికార్డును సృష్టించారు. మార్చి 20 తేదీన జరిగిన ఈ కార్యక్రమం అందరిని ఆకట్టుకుంది.

``సోగ్గాడే చిన్ని నాయన` చిత్రం ఎక్కడ ముగిసిందో, అక్కడి నుంచి `బంగార్రాజు` కథ స్టార్ట్‌ అవుతుంది. చిన్నబంగార్రాజు(నాగచైతన్య) కూడా తాత మాదిరే ఊర్లో అమ్మాయిల వెంటపడుతుంటాడు. మరోపక్క చిన్న బంగార్రాజు మరదలు నాగలక్ష్మి(కృతిశెట్టి) ఆ ఊరికి సర్పంచ్‌ అవుతుంది. వీరిద్దరికి ఒకరంటే ఒకరికి పడదు. కానీ వీరిద్దరికి పెళ్లి చేస్తే బాగుంటుందని భావిస్తుంది సత్తెమ్మ(రమ్యకృష్ణ). తన మనవడి ప్రేమకి సహాయం చేయడానికి బంగార్రాజుని భూమ్మీదకి పంపిస్తుంది. చిన్న బంగార్రాజు శరీరంలోకి పెద్ద బంగార్రాజు చేరి, సర్పంచ్‌ నాగలక్ష్మిని ప్రేమించేలా చేస్తాడు. మరోవైపు చిన్న బంగార్రాజును హత్య చేయడానికి కొంతమంది ప్లాన్‌ చేస్తారు. ఆపదలో ఉన్న మనవడిని బంగార్రాజు ఎలా కాపాడుకున్నాడు?  అనేదే కథ` అని జీ తెలుగు నిర్వహకులు తెలిపారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా