రాధేశ్యామ్. నైజాం రైట్స్ 36.50 కోట్లకు దక్కించుకోగా.. అక్కడ ఇప్పటిదాకా 24.73 షేర్ వచ్చింది. ఉత్తరాంధ్ర రైట్స్ 13 కోట్లకు తీసుకోగా.. అక్కడ మూవీ 4.86 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇలా రెండు చోట్లా కలిపి దిల్ రాజుకి 20 కోట్ల భారీ నష్టం కలగనుందని చెప్తున్నారు.
ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం రాధేశ్యామ్ మార్నింగ్ షోకే ఫ్లాప్ టాక్ మూట గట్టుకుంది. రెవెన్యూ పరంగా చూసుకుంటే ఇది భారీ డిజాస్టర్ అని ట్రేడ్ లో తేల్చేసారు. విడుదలైన 10 రోజుల్లో ఈ సినిమాకు 200 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించున్నా అంతలేదని జనం అంటున్నారు. ఈ వీకెండ్ ముగిసేసరికి సినిమాకు అటుఇటుగా 60 కోట్ల రూపాయల నష్టం వాటిల్లేలా ఉందంటూ లెక్కలు తేలుస్తున్నారు. ఈ సినిమా దెబ్బకి బయ్యర్లు దాదాపు 120 కోట్లు నష్టపోనున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ భారీ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈ సినిమా కారణంగా 20 కోట్లు నష్టపోనున్నారని సమాచారం.
'రాధేశ్యామ్'ని నైజాం(తెలంగాణ)తో పాటు ఉత్తరాంధ్రలో దిల్ రాజు రిలీజ్ చేశారు. ఈ రెండు ఏరియా రైట్స్ కలిపి దాదాపు 50 కోట్లకు దిల్ రాజు దక్కించుకోగా.. 30 కోట్ల షేర్ కూడా రాలేదని సమాచారం. రాధేశ్యామ్. నైజాం రైట్స్ 36.50 కోట్లకు దక్కించుకోగా.. అక్కడ ఇప్పటిదాకా 24.73 షేర్ వచ్చింది. ఉత్తరాంధ్ర రైట్స్ 13 కోట్లకు తీసుకోగా.. అక్కడ మూవీ 4.86 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇలా రెండు చోట్లా కలిపి దిల్ రాజుకి 20 కోట్ల భారీ నష్టం కలగనుందని చెప్తున్నారు.
ఇంక 'రాధేశ్యామ్' బాక్సాఫీస్ రన్ దాదాపు ముగిసినట్లే.ఎల్లుండి అంటే ఈ నెల 25 న 'ఆర్ఆర్ఆర్' విడుదలకు సిద్ధమవుతోంది. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర బెనిఫిట్ షో ల కోసం దిల్ రాజు భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రమోషన్స్లో భాగంగా ఈ సినిమా బెనిఫిట్ షో లను మరియు పెయిడ్ ప్రీమియర్స్ ను కూడా నిర్వహించాలని దర్శక నిర్మాతలు ముందుగానే నిర్ణయించుకున్నారు.ఈ నేపథ్యంలో ఈ సినిమా మీద ఉన్న నమ్మకంతో దిల్ రాజు బెనిఫిట్ షో ల కోసం భారీ మొత్తాన్ని అడుగుతున్నారని తెలుస్తోంది. టికెట్ పై కేవలం 75 రూపాయల పెంచడానికి మాత్రమే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి తెలంగాణలోనే సినిమా నుంచి మంచి కలెక్షన్లు రాబట్టాలని దిల్ రాజు ఇలా చేస్తున్నట్లు కొందరు చెబుతున్నారు.