Ramarao On Duty Release Date: బాక్సాఫీస్ హాంటింగ్ కు బయల్దేరుతున్న ‘రామరావు ఆన్ డ్యూటీ’.. రిలీజ్ ఎప్పుడంటే?

Published : Mar 23, 2022, 12:01 PM IST
Ramarao On Duty Release Date: బాక్సాఫీస్ హాంటింగ్ కు బయల్దేరుతున్న ‘రామరావు ఆన్ డ్యూటీ’.. రిలీజ్ ఎప్పుడంటే?

సారాంశం

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) వరుస సినిమాలతో ఆడియెన్స్ ను అలరిస్తున్నారు. క్రాక్, ఖిలాడీ వంటి మాస్ అండ్ ఎంటర్ టైన్ తో మంచి జోష్ లో ఉన్నారు. తాజాగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. 

మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'రామారావు ఆన్ డ్యూటీ'. శరత్ మండవ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆర్ టి టీం వర్క్స్ బ్యానర్ లో రవితేజ, ఎస్ ఎల్ వి సినిమాస్ ఎల్ ఎల్ ఫై బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రాక్ (Krack), ఖిలాడీ (Khiladi)తో మాస్ ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించారు రవితేజ. దీంతో తన తదుపరి చిత్రంపై మరింత అంచనాలు పెరిగాయి. దీంతో మరోసారి ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీతో ప్రేక్షకుల ముుందుకు వస్తున్నారు మాస్ మహారాజా. ప్రారంభం నుంచే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దానికితోడు మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్ర టీజర్ విడుదల చేశారు మేకర్స్. టీజర్ మొత్తం రవితేజ సీరియస్ గా, పవర్ ఫుల్ ఆఫీసర్ గా కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. గతంలో రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. 

రవితేజ సినిమాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పారు. మొన్నటి  దాకా ఖిలాడీ మేనియా చూపించిన రవితేజ.. ఇప్పుడు ‘రామారావు ఆన్ డ్యూటీ’తో థియేటర్లలో రిపోర్ట్ చేయనున్నారు. తాజాగా మేకర్స్ మాస్ ఆడియన్స్ కు క్రేజీ అప్డేట్స్ అందించారు. జూన్ 7న ‘రామారావు ఆన్ డ్యూటీ’ (Rama Rao On Duty) చిత్రం రిలీజ్ కానున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో అఫిషియల్ అనౌన్స్ మెంట్ చేశారు. రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

ఈ చిత్రంలో రవితేజకి జోడిగా మజిలీ ఫేమ్ దివ్యాంష కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే జై భీం ఫేమ్ రాజిష కీలక పాత్రలో నటిస్తోంది. సామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా పనిచేస్తున్నారు. వరుస సినిమాలతో ఆడియెన్స్ ను అలరిస్తున్న రవితేజ.. రామారావు ఆన్ డ్యూటీతో మెప్పిస్తే హ్యాట్రిక్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నట్టు చెప్పొచ్చు. 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా