Sirivennela Seetharama Sastry Death : ఆయనో విలువల శిఖరం .. సిరివెన్నెల మృతిపై జగన్, చంద్రబాబు సంతాపం

Siva Kodati |  
Published : Nov 30, 2021, 05:42 PM IST
Sirivennela Seetharama Sastry Death : ఆయనో విలువల శిఖరం .. సిరివెన్నెల మృతిపై జగన్, చంద్రబాబు సంతాపం

సారాంశం

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో (tollywood) విషాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు .. సిరివెన్నెల కుటుంబానికి  సంతాపం తెలియజేశారు. 

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో (tollywood) విషాదం చోటు చేసుకుంది. కొద్దిరోజుల క్రితం న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. ఈ నేపథ్యంలో సిరివెన్నెల మృతిపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (ys jagan mohan reddy) సంతాపం తెలిపారు. తెలుగు సినీ గేయ ప్రపంచంలో సిరివెన్నెల విలువల శిఖరం అన్నారు. ఆయన మరణం తెలుగువారికి తీరని లోటన్నారు. ‘‘అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులని... ఆయన హఠాన్మరణం మొత్తంగా తెలుగువారికి తీరనిలోటు. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని సీఎం జగన్  ఓ ప్రకటనలో తెలిపారు.

అటు తెలుగుదేశం పార్టీ (telugu desam party) అధినేత, ఏపీ ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు (chandrababu naiduకూడా సిరివెన్నెల మరణంపై దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ‘‘ప్రముఖ సినీ గేయ రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు. అంచెలంచెలుగా ఎదిగిన ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శం. తన పాటలతో తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. మూడున్నర దశాబ్దాల సినీ జీవితంలో 3వేలకు పైగా పాటలు రాసి కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన పాటలతో ప్రజలలో చైతన్యం తీసుకువచ్చారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను ’’ అని చంద్రబాబు తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. 

Also Read:Sirivennela Seetharama Sastry Death: పాటల శిఖరం సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇకలేరు..

కాగా.. గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సిరివెన్నెల హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్ప పొందుతూ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. కొన్ని రోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల ఈ నెల 24నే ఆసుపత్రిలో చేరారు. మూడు రోజుల క్రితం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే మంగళవారం సిరివెన్నెల ఆరోగ్యం మరింత విషమించడంతో సాయంత్రం కన్నుమూసినట్టు తెలుస్తుంది. 

దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. Sirivennela Seetharama Sastry Dead మరణంతో టాలీవుడ్‌ ఒక్కసారిగా షాక్‌ కి గురైంది. మే 20, 1955న విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లిలో డాక్టర్‌ సి.వి.యోగి, సుబ్బలక్ష్మి గార్లకి సిరివెన్నెల జన్మించారు. అనకాపల్లిలో పదవ తరగతి వరకు చదువుకున్నారు. కాకినాడలో ఇంటర్మీడియన్‌ పూర్తి చేశారు. ఆంధ్ర విశ్వ కళా పరిషత్‌లో బి.ఏ పూర్తి చేశారు. ఎం.ఏ చేస్తుండగా, ప్రముఖ టాలీవుడ్‌ దర్శకుడు కె.విశ్వనాథ్‌.. `సిరివెన్నెల` సినిమాకు పాటలు రాసే అవకాశం కల్పించారు. అలా 1986లో సిరివెన్నెల కెరీర్‌ ప్రారంభమైంది. ఆయన అసలు పేరు చేంబోలు సీతారామశాస్త్రి. కానీ తొలి చిత్రం `సిరివెన్నెల`నే ఆ తర్వాత తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. 

మూడున్నర దశాబ్దాల సినీ జీవితంలో మూడు వేలకుపైగా పాటలు రాశారు సిరివెన్నెల. `విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం` సిరివెన్నెల రాసిన తొలిపాట. చివరగా ఆయన అఖిల్‌ నటించిన `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రంలో `చిట్టు అడుగు` అనే పాటని రాశారు. వేటూరి శిష్యుడిగా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న సిరివెన్నెల పాటలరచయిత మాత్రమే కాదు, కవి, సింగర్‌ కూడా. `గాయం` సినిమాలో `నిగ్గ దీసి అడుగు.. `అనే పాట ఎంతగా పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. జనాన్ని చైతన్య పరిచే ఈ పాట ఊర్రూతలూగించింది. గాయకుడిగా సిరివెన్నెలలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. 
 

PREV
click me!

Recommended Stories

అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే
అఖండ 2 లో బాలయ్య కంటే 48 ఏళ్లు చిన్న నటి ఎవరో తెలుసా? ఐదుగురు హీరోయిన్ల ఏజ్ గ్యాప్ ఎంత?