Shiva Shankar Master: శివశంకర్‌ మాస్టర్‌ అంత్యక్రియల్లో పాడె మోసిన ఓంకార్‌.. వీడియో వైరల్‌

By Aithagoni Raju  |  First Published Nov 30, 2021, 3:41 PM IST

 శివశంకర్‌మాస్టర్‌ భౌతిక కాయానికి నిన్న(సోమవారం) అంత్యక్రియలు పూర్తయ్యాయి. హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో గల మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. 


ప్రముఖ కొరియోగ్రాఫర్‌, నటుడు శివశంకర్‌ మాస్టర్‌ రెండు రోజుల క్రితం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కరోనాతో పోరాడుతూ, చివరి కరోనా నెగటివ్‌ పొంది కూడా అనారోగ్యం కారణంగా ఆయన మరణించారు. శివశంకర్‌ మాస్టర్‌ మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాదు,సౌత్‌ ఇండస్ట్రీ మొత్తం తీవ్ర దిగ్ర్శాంతి చెందింది. ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేశారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, పవన్‌ కళ్యాణ్‌, వెంకటేష్‌, మంచు విష్ణు, సోనూసూద్‌, ధనుష్‌, సూర్య, కార్తి ఇలా అనేక మంది తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. 

ఇదిలా ఉంటే శివశంకర్‌మాస్టర్‌(Shiva Shankar Master) భౌతిక కాయానికి నిన్న(సోమవారం) అంత్యక్రియలు పూర్తయ్యాయి. హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో గల మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు(Shiva Shankar Master Last Rites) నిర్వహించారు. శివశంకర్‌ మాస్టర్‌ చిన్న కుమారుడు అజయ్‌.. తండ్రి భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకు ముందు పంచవటి కాలనీలోని శివశంకర్‌ మాస్టర్‌ నివాసానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై మాస్టర్‌కి నివాళ్లు అర్పించారు. వీరిలో రాజశేఖర్‌ కూడా ఉన్నారు. 

Latest Videos

undefined

ఇదిలా ఉంటే యాంకర్‌, దర్శకనిర్మాత ఓంకార్‌Omkar).. శివశంకర్‌ మాస్టర్‌ పాడె మోయడం విశేషం. శివశంకర్ మాస్టర్‌ ఫ్యామిలీకి కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చిన్న కుమారుడు అజయ్‌ మాత్రమే అన్ని చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పైగా కరోనా పేషెంట్‌ కావడంతో పాడె మోసేందుకు సుముఖత చూపరు. ఈ నేపథ్యంలో ఓంకార్‌, ఆయన తమ్ముడు, హీరో అశ్విన్‌బాబులు శివశంకర్‌ మాస్టర్‌ పాడె మోశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకు దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చూసుకున్నారు. 

ఓంకార్‌, శివశంకర్‌ మాస్టర్‌ కాంబినేషన్‌లో వచ్చిన డాన్సు షోలో గతంలో మంచి ఆదరణ పొందాయి. అప్పటి నుంచి శివశంకర్‌ మాస్టర్‌కి, ఓంకార్‌కి మధ్య మంచి అనుబంధం ఉంది. శివశంకర్ మాస్టర్‌ తమిళంలో వచ్చిన `కురువి కూడు` (1980) అనే చిత్రంతో కొరియోగ్రాఫర్‌గా సినిమా పరిశ్రమకి పరిచయం అయ్యారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్రాలకు ఆయన కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. హైదరాబాద్‌లోనే సెటిల్‌ అయ్యారు. శివశంకర్‌ మాస్టర్‌ దాదాపు 800లకు పైగా చిత్రాల్లోని పాటలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. `మగధీర` చిత్రంలోని `ధీర ధీర` పాటకి జాతీయ అవార్డుని అందుకున్నారు. 

also read: Shiva Shankar Master: శివశంకర్ మాస్టర్ కి కోవిడ్ నెగిటివ్.. కానీ, వైద్యులు ఏం చెప్పారంటే..

click me!