యంగ్ టైగర్ Jr NTR తన ఇద్దరు ముద్దుల కుమారులతో Diwali సంబరాల్లో మునిగిపోయాడు. ఎన్టీఆర్ నివాసంలో ఫెస్టివల్ వైబ్స్ కనిపిస్తున్నాయి.
దీపావళి పండుగ అంటే చిన్నపిల్లల సందడి ఎక్కువగా ఉంటుంది. దీపాలు వెలిగిస్తూ మహిళలు కూడా సంబరాల్లో పాల్గొంటారు. టాలీవుడ్ లో దీపావళి హంగామా కాస్త ఎక్కువగానే ఉంటుంది. సినిమాల రిలీజ్ లతో పాటు.. స్టార్స్ తమ ఫ్యామిలీ మెంబర్స్ తో దీపావళి పండుగని జరుపుకుంటారు. టపాకాయలు వాతావరణ కాలుష్యానికి కారణం కాబట్టి సాధ్యమైనంతగా వాటికి దూరంగా దీపాలు వెలిగించి దీపావళిని సేఫ్ గా , సంతోషంగా జరుపుకోవాలని సెలెబ్రిటీలు అవేర్ నెస్ క్యాంపైన్ చేయడం చూస్తూనే ఉన్నాం.
కానీ టపాకాయల మోత మాత్రం ఎప్పుడూ తగ్గదు. ఇదిలా ఉండగా యంగ్ టైగర్ Jr NTR తన ఇద్దరు ముద్దుల కుమారులతో Diwali సంబరాల్లో మునిగిపోయాడు. ఎన్టీఆర్ నివాసంలో ఫెస్టివల్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ తన ఇద్దరు కుమారులు నందమూరి అభయ్ రామ్, నందమూరి భార్గవ్ రామ్ లతో దీపావళి సంబరాల్లో ఉన్న పిక్ షేర్ చేశాడు. అందరికి దీపావళి శుభాకాంక్షలు చెబుతూ ఎన్టీఆర్ షేర్ చేసిన ఈ పిక్ అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పిక్ లోతండ్రి, తనయులు ఒకరిని మించి మరొకరు లుక్ తో ఆకట్టుకుంటున్నారు.
undefined
ముగ్గురూ కుర్తా ఫైజామా ధరించి అదుర్స్ అనిపిస్తున్నారు. అభయ్, భార్గవ్ ఇద్దరూ చూడముచ్చటగా ఉన్నారు. ఎన్టీఆర్ బియర్డ్ లుక్ లో కనిపిస్తున్నాడు. అయితే అక్కడ టపాకాయల మోత మాత్రం కనిపించడం లేదు. పక్కనే దీపాలు మాత్రం కనిపిస్తున్నాయి.
ఎన్టీఆర్ దీపావళి సెలెబ్రేషన్స్ అనగానే జనతా గ్యారేజ్ చిత్రాన్ని గుర్తు చేసుకోవలసిందే. ఆ మూవీలో దీపావళికి నిత్యా మీనన్ టపాకాయలు కాల్చుతుంటే ఎన్టీఆర్ వెళ్లి క్లాస్ పీకే సన్నివేశం ఫన్నీగా, సందేశాత్మకంగా ఉంటుంది. దీపావళి అంటే దీపాల పండుగ అని ఎన్టీఆర్ నిత్యామీనన్ కు చెబుతాడు. టపాకాయలు కాల్చవద్దని వార్నింగ్ ఇస్తాడు.
ఇదిలా ఉండగా ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం జనవరి 7న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్ అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో.. రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు.