Stuartpuram Donga First Look: బెల్లంకొండ శ్రీనివాస్ మైండ్ బ్లోయింగ్ లుక్.. అస్సలు గుర్తుపట్టలేరు

pratap reddy   | Asianet News
Published : Nov 04, 2021, 07:32 PM IST
Stuartpuram Donga First Look: బెల్లంకొండ శ్రీనివాస్ మైండ్ బ్లోయింగ్ లుక్.. అస్సలు గుర్తుపట్టలేరు

సారాంశం

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ ఆరంభం నుంచి మాస్ చిత్రాలే చేస్తున్నాడు. దీనితో మాస్ లో శ్రీనివాస్ కి మంచి ఫాలోయింగే ఏర్పడింది. అయితే ఒక సాలిడ్ హిట్ కోసం శ్రీనివాస్ గట్టిగా ప్రయత్నిస్తున్నాడు.

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ ఆరంభం నుంచి మాస్ చిత్రాలే చేస్తున్నాడు. దీనితో మాస్ లో శ్రీనివాస్ కి మంచి ఫాలోయింగే ఏర్పడింది. అయితే ఒక సాలిడ్ హిట్ కోసం శ్రీనివాస్ గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం శ్రీనివాస్ బాలీవుడ్ లో ఛత్రపతి రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

అలాగే Bellamkonda Srinivas మరో ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్ లో కూడా నటిస్తున్నాడు. డెబ్యూ దర్శకుడు కేఎస్ దర్శకత్వంలో 'స్టువర్ట్ పురం దొంగ'(Stuartpuram Donga) అనే చిత్రంలో నటిస్తున్నాడు. చాలా రోజుల క్రితమే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ జరిగింది. నేడు దీపావళి కానుకగా ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఈ చిత్రం కోసం బెల్లంకొండ శ్రీనివాస్ కంప్లీట్ గా తన మేకోవర్ మార్చుకున్నాడు. కొద్దిసేపటి క్రితమే విడుదలైన ఫస్ట్ లుక్ టెరిఫిక్ గా ఉంది. 

ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఉన్నది బెల్లంకొండ శ్రీనివాస్ అని బాగా గమనిస్తే కానీ గుర్తుపట్టలేం. అంతలా శ్రీనివాస్ పాత్రలో ఒదిగిపోయాడు. ఫ‌స్ట్ లుక్ ని గ‌మ‌నిస్తే పొడ‌వుగా వెన‌క్కి దువ్విన జుట్టు, గుబురు గ‌డ్డంతో, రెండు తుపాకుల‌ను ప‌ట్టుకుని బెల్లం కొండ సాయి శ్రీనివాస్ సీరియస్‌గా చూస్తున్న లుక్‌తో ఉండ‌టాన్ని గ‌మ‌నించవ‌చ్చు.  ఇప్ప‌టి వ‌ర‌కు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా చేసిన చిత్రాల‌కు భిన్న‌మైన సినిమా ఇది. హీరోయిజంతో పాటు ఎమోష‌న్స్‌, ఇన్‌టెన్స్ ఉన్న స‌బ్జెక్ట్‌తో రూపొందుతోన్న చిత్ర‌మిది.

 

1970, 80 దశకం బ్యాక్‌ డ్రాప్‌లో పేరు మోసిన గ‌జ‌దొంగ నాగేశ్వ‌ర‌రావు జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అప్ప‌ట్లో నాగేశ్వ‌ర‌రావు ఎంతో చాక‌చ‌క్యంగా దొంగ‌త‌నాలు చేయ‌డ‌మే కాదు..పోలీసుల‌కు దొర‌క్కుండా త‌ప్పించుకునేవారు. అంతే కాకుండా ఉన్న‌వాడిని దోచి లేని వాడికి పంచేవారు. దాంతో ఆయ‌న్ని అంద‌రూ రాబిన్ హుడ్ అని టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు అని పిలిచేవారు.

Also Read: Unstoppable With NBK: చిరంజీవి పెళ్లిపై మోహన్ బాబు కామెంట్స్ వైరల్.. కాబట్టే బాగున్నాడు అంటూ..

తొలిసారి బెల్లంకొండ శ్రీనివాస్ పీరియాడిక్ చిత్రంలో నటిస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందిస్తోన్న ఈ చిత్రానికి శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ఎ.ఎస్‌.ప్ర‌కాశ్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌. బెల్లకొండ శ్రీనివాస్ హోమ్ బ్యానర్ శ్రీ లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ పై బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌
అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే