'అఖండ' టైటిల్ సాంగ్ ప్రోమో: బాలయ్య యోగ మాయ.. ఫ్యాన్స్ కు థియేటర్లు బద్దలయ్యే ట్రీట్

pratap reddy   | Asianet News
Published : Nov 04, 2021, 03:34 PM ISTUpdated : Nov 04, 2021, 03:35 PM IST
'అఖండ' టైటిల్ సాంగ్ ప్రోమో: బాలయ్య యోగ మాయ.. ఫ్యాన్స్ కు థియేటర్లు బద్దలయ్యే ట్రీట్

సారాంశం

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అఖండ'. బాలయ్య, బోయపాటి సూపర్ హిట్ కాంబో కావడంతో అంచనాలు స్కై లెవల్ లో ఉన్నాయి. దాదాపుగా షూటింగ్ పూర్తయింది.

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అఖండ'. బాలయ్య, బోయపాటి సూపర్ హిట్ కాంబో కావడంతో అంచనాలు స్కై లెవల్ లో ఉన్నాయి. దాదాపుగా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అఖండ రిలీజ్ పై చిత్ర యూనిట్ ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే బోయపాటి అఖండ రిలీజ్ కు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారనేది వాస్తవం. 

ఇదిలా ఉండగా నేడు Diwali కానుకగా అఖండ చిత్రం నుంచి ఫ్యాన్స్ కు ట్రీట్ లభించింది. Akhanda టైటిల్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. 53 సెకండ్ల ప్రోమోలో అదిరిపోయే విజువల్స్, లిరిక్స్ చూపించారు. బాలయ్య అఘోరి తరహాలో యోగి గెటప్ లో ఉన్న రోల్ ఈ ప్రోమోలో చూపించారు. 

త్రిశూలం పట్టుకుని Balakrishna పవర్ ఫుల్ గా నడుస్తూ ఉండగా.. అంతే పవర్ ఫుల్ గా, క్యాచీగా ఉండే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. అఖండ టైటిల్ సాంగ్.. భం అఖండ.. భం అఖండ అంటూ సాగనుంది. 'యోగమాయతో పాతరా భూమిపై రాతి జెండా' అంటూ లిరిక్స్ అద్భుతంగా సాగుతున్నాయి. ఇది జస్ట్ ప్రోమో మాత్రమే.. ఇంకా లిరికల్ వీడియో ఉంది. ఆ తర్వాత థియేటర్స్ లో అసలైన విజువల్ ఫీస్ట్ ఉంటుంది. బాలయ్య ఈ తరహాలో పవర్ ఫుల్ గా కనిపిస్తే థియేటర్లు బద్దలైపోవడం ఖాయం. 

బాలయ్య, Boyapati sreenu కాంబో ఫెయిల్ కావడం అంటూ ఉండదు అనే సంకేతాలు ఈ సాంగ్ ప్రోమో ద్వారా అందుతున్నాయి. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. బాలయ్య సరసన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. సింహా, లెజెండ్ తర్వాత బాలయ్య, బోయ కాంబోలో వస్తున్న మూడవ చిత్రం ఇది. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌
అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే