జేమ్స్‌ బాండ్‌ ను ఫాలో అవుతున్న ప్రభాస్, యాక్షన్ మూడ్ లో యంగ్ రెబల్ స్టార్

Published : Apr 01, 2023, 01:48 PM IST
జేమ్స్‌ బాండ్‌  ను ఫాలో అవుతున్న ప్రభాస్, యాక్షన్ మూడ్ లో యంగ్ రెబల్ స్టార్

సారాంశం

ప్రభాస్‌ షూటింగ్స్ తో బిజీ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సలార్ షూటింగ్ లో ఉన్న ప్రభాస్.. ఫారెన్ లో యాక్షన్ సీక్వెన్స్ లు చేస్తున్నాడు. ప్రభాస్ సలర్ కోసం జేమ్స్ బాండ్ ను ఫాలో అవుతున్నాడట. ఎలాగంటే.. ?  


 తన కొత్త సినిమా  -సలార్‌ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ప్రభాస్.  ప్రస్తుతం సలార్ మూవీ  ఇటలీలో షూటింగ్‌ జరుపుకుంటున్నది. ఇక్కడ మటేరా లో ఇంపార్టెంట్ సీన్స్ ను షూట్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్ బృందం. ఇక ఈ షూటింగ్ విషయంలో ప్రభాస్ హాలీవుడ్ యాక్షన్ ఐకాన్ జేమ్స్ బాండ్ ను ఫాలో అవుతున్నాడట.  ప్రస్తుతం షూటింగ్ జరుగుతన్న ప్రాంతం మటేరాలో.. జేమ్స్‌ బాండ్‌ సినిమా నో టైమ్‌ టు డై లో ఈ లొకేషన్స్‌లోనే.. హై యాక్షన్‌ సీక్వెన్సులు చేశారు. ఇక్కడ చేసిన యాక్షన్ సీన్స్ కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. దాంతో మన ప్రభాస్ కూడా అదే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. 

 సినీ ప్రియుల్ని ఆకట్టుకోవడం కోసం ప్రభాస్‌  కూడా అదే స్థాయి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇటలీ,నేపుల్స్‌,రోమ్‌, బుడా పెస్ట్‌లోని చారిత్రక ప్రదేశాల్లో కీలక యాక్షన్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నారట టీమ్.  ఈ షెడ్యూల్‌తో సినిమా మొత్తం పూర్తవుతుందని సమాచారం. ఇక సలార్ సినిమాను కెజియఫ్ సినిమాను తెరకెక్కించిన హోంబలే ఫిల్మ్స్‌ నిర్మాణంలో విజయ్‌ కిరగందూర్‌ సలార్ ను నిర్మిస్తున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ రూపొందిస్తున్నారు. శృతి హాసన్‌ నాయికగా నటిస్తున్నది. 

సెప్టెంబర్‌ 28న సలార్ మూవీని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. అటు సలార్ తో పాటు.. ఆదిపురుష్, ప్రాజక్ట్ కే, రాజాడీలక్స్, స్పిరిట్ లాంటి సినిమాల్లో నటిస్తున్నాడు ప్రభాస్. ఒక్కొక్కటిగా సినిమాలను కంప్లీట్ చేస్తూ వస్తున్నాడు. ఇక ఈమూవీ షూటింగ్ అయిపోగాగే.. అటు ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ తో సినిమా స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఇటు ప్రభాస్ కూడా మిగిలినషూటింగ్స్ పై దృష్టి పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rashmi Gautam: కోరుకున్నవాడితోనే రష్మి పెళ్లి.. ఎట్టకేలకు కన్ఫమ్‌ చేసిన జబర్దస్త్ యాంకర్‌
Bigg Boss 9 Finale Voting : కళ్యాణ్ పడాల , తనూజ మధ్య అసలు పోటీ.., ఫినాలే ఓటింగ్ లో ఎవరు ముందున్నారంటే?