Ala Modalaindi : డైరెక్టర్ వంశీ పైడిపల్లి లవ్ స్టోరీ.. ఆమెతో ఫస్ట్ ఫస్టే అలా అనేశాడు.. ధైర్యవంతుడే

By Asianet News  |  First Published Apr 1, 2023, 11:32 AM IST

ప్రముఖ కమెడియన్, నటుడు వెన్నెల కిషోర్ వ్యాఖ్యాతగా కొనసాగుతున్న ‘అలా మొదలైంది’ షోకు తాజాగా వంశీ పైడిపల్లి తన భార్యతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరి లవ్ స్టోరీపై ఇంట్రెస్టింగ్ గా స్పందించారు. 
 


ప్రముఖ కమెడియన్, నటుడు వెన్నెల కిషోర్ (Vennela Kishore) హోస్ట్ గా ఈటీవీలో ప్రసారం అవుతున్న టాక్ షో ‘అలా మొదలైంది’ Ala Modalaindi.  ఈ షోకి టాలీవుడ్ లోని స్టార్స్ ను తమ లైఫ్ పార్ట్ నర్ తో పిలుస్తున్న విషయం తెలిపిందే. చాలా ఆసక్తికరంగా షోను రన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ షోకు యంగ్ హీరో నిఖిల్ - ఆయన భార్య పల్లవి గెస్ట్స్ గా వచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా టాలీవుడ్ దర్శకుడు, రైటర్ వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) ఆయన సతీమణి మాలిని షోకు గెస్ట్ లుగా హాజరయ్యారు. 

తాజాగా వంశీ పైడిపల్లికి సంబంధించిన ప్రోమోను వదిలారు. ప్రోమోలో వంశీ తన లవ్ స్టోరీని రివీల్ చేశారు. మొదట ఆమెను చూడగానే ఆమె చేయి పట్టుకొని ‘నీతో లైఫ్ చాలా బాగుంటుంది‘  అని భావిస్తున్నట్టు చెప్పారంట. ఆమెను కలిసేందుకు వారంలో ఒకరోజు మాత్రమే కుదురుతుండటంతో ఆమె కోసం ఏకంగా బెంగళూరు వరకు బస్సులో వెళ్లేవారని చెప్పారు. లవ్ లెటర్స్ కూడా రాశారంట. మాలిని కూడా వంశీ వ్యక్తిత్వాన్ని ఇష్టపడుతుందని చెప్పారు. వంశీ అప్పుడప్పు అలుగుతూ ఉంటారని, అలాగే తనకోసం అద్భుతంగా పాటలూ పడుతుంటారని చెప్పారు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నప్పుడు ట్యాంక్ బండ్ తదితర ఫేమస్ ప్లేస్ లలో బైక్ పై రైడ్స్ కూడా చేశారంట.

Latest Videos

దర్శకుడిగా, రైటర్ గానే ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న వంశీ పైడిపల్లి లవ్ స్టోరీ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే ప్రస్తుతానికి  అలా మొదలైంది.. షో నుంచి కేవలం ప్రోమో మాత్రమే విడుదల చేశారు. ఏప్రిల్ 4న ఫుల్ ఎపిసోడ్ విడుదల కానుంది. వంశీ పర్సనల్ లైఫ్ గురించి, తమ లైఫ్ జర్నీ గురించి మరింతగా తెలుసుకోవాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేంత వరకు ఆగాల్సిందే. ఇక వంశీ - మాలిని పెళ్లి 2007లో జరిగింది. వీరికి ఒక పాప ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లోనే నివసిస్తున్నారు.

సెలబ్రెటీల లైఫ్ జర్నీ, వారి లవ్, కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలపై ముందుగానే వర్క్ చేసి షోలో ప్రశ్నలు సంధిస్తున్నారు. వెన్నెల కిషోర్ సమయస్ఫూర్తి కూడా ఆకట్టుకుంది. దీంతో షో ప్రస్తుతం ఆసక్తికరంగా సాగుతోంది. ఇక వంశీ పైడిపల్లి రీసెంట్ గా తమిళ స్టార్ విజయ్ దళపతితో ‘వారసుడు’ చిత్రం తెరకెక్కించి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.  అంతకు ముందు ‘మహార్షి’తో హిట్ అందుకున్నారు. 

 

It's not a joke brother .. promo bagundihttps://t.co/Q4eZyr1bsP

— K P (@isatruelover)
click me!