విచారణలో విస్తుపోయే నిజాలు, ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో దొంగతనం కేసులో సంచలన విషయాలు..

Published : Apr 01, 2023, 11:57 AM IST
విచారణలో విస్తుపోయే నిజాలు, ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో దొంగతనం కేసులో సంచలన విషయాలు..

సారాంశం

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు.. ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో.. విస్తుపోయే నిజాలుబయటకు వస్తున్నాయి. చోరీ కేసులో పనిమనిషిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారణలో ఆమె చెప్పిన విషయాలు విని షాక్ అయ్యారు.   


ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో చోరీ సంఘటన అనేక మలుపులు తిరుగుతోంది. చోరీ ఘటనలో ఆ ఇంట్లో పనిచేసే ఈశ్వరిని అరెస్ట్ చేసి విచారించారు పోలీసులు. అయితే ఈ విషయంలో వారు కూడా విస్తుపోయేలా కొన్ని విషయాలు వెలుగులోకివచ్చాయి. అసలు దొంగతనం ఎందుకు జరిగింది. దేనికి చేశారు..? కారణం ఏంటీ లాంటి కోణాల్లో విచారణ జరగ్గా.. పనిమనిషి షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఇక ఆ వర్కర్ గురించి ఆరా తీసిన పోలీసులకు కూడా కొన్ని విషయాలు షాకింగ్ గా అనిపించినట్టు తెలుస్తోంది. 

గత కొన్ని రోజులు క్రితం రజనీకాంత్ కూతురు.. హీరో ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో చోరీ జరిగింది. ఈ దొంగతనంలో దాదాపుగా 60 సవర్ల బంగారం దొంగతనం జరిగినట్టు కంప్లైంట్ వెళ్ళింది పోలీసులకు. పనిమనిషి కనిపించకపోవడంతో..  పోలీసుల విచారణ అంతా పనిమనిషి చుట్టూ తిరిగింది. ఈ విచారణలో ఆమె షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఆ పనిమనిషికి చెన్నైలో.. రెండు ఇళ్ళు ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. అంతే కాదు ఈ 60 సవర్ల బంగారంతో పాటు మరో 40 సవర్ల బంగారు, 4 కేజీల వెండి, 30 గ్రాముల వజ్రాలు కూడా ఆమె ఇంట్లో గుర్తించారు పోలీసులు. 

ఇక దొంగతనం ఎందుకు చేశావు  అని అడగ్గా.. దానికి కారణం ఐశ్వర్యనే అంటోంది పనిమనిషి ఈశ్వరి. రోజు గొడ్డులా కష్టపడుతున్నా.. నెలకు 30 వేలు మాత్రమే ఇస్తున్నారని.. అవి తన కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోవడం లేదంటూ.. వెల్లడించింది. ఇక తన ఇంట్లో దోరికిన బంగారం వెండీ, వజ్రాల విషయంలో విచారణ చేస్తున్నారు పోలీసులు. అయితే ఈ పనిమనిషి.. అటు ధనుష్, రజనీకాంత్ ఇంట్లో కూడా కొంత కాలం పనిచేసినట్టు తెలుస్తోంది. దాంతో ఒక వేళ ఆ ఇళ్ళలో ఏమైన దొంగతనాలు జరిగి ఉంటాయా.. వారు గుర్తించలేకపోయారా అనే కోణంలో విచారణజరుగుతోంది. 

ఇక ఐశ్వర్య రజనీకాంత్ గత కొంత కాలంగా ఒక్కరే ఉంటున్నారు. థనుష్ తో విడాకులు తరువాత ఆమె ప్రొఫిషినల్ గా బిజీ  అయిపోయింది. అంతే కాదు మూడు సినిమాలను ఆమె డైరెక్ట్ చేసింది. ప్రస్తుతం దర్శకురాలిగా సెటిల్ అవ్వాలని చూస్తుంది. ఓ మూవీని నిర్మిస్తుంది కూడా. కథల విషయంలో ఐశ్వర్య ఫైనల్ వర్క్ చేస్తునట్టు తెలుస్తోంది. 


 

PREV
click me!

Recommended Stories

Rashmi Gautam: కోరుకున్నవాడితోనే రష్మి పెళ్లి.. ఎట్టకేలకు కన్ఫమ్‌ చేసిన జబర్దస్త్ యాంకర్‌
Bigg Boss 9 Finale Voting : కళ్యాణ్ పడాల , తనూజ మధ్య అసలు పోటీ.., ఫినాలే ఓటింగ్ లో ఎవరు ముందున్నారంటే?