యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా మరో సినిమా రిలీజ్ డేట్ నూ కన్ఫమ్ చేశారు. ఏకంగా రవితేజ సినిమాకు పోటీగా విడుదల చేయబోతున్నారు.
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం యూత్ లో మంచి క్రేజ్ దక్కించుకుంటున్నారు. చిన్న హీరో అయినప్పటికీ ప్రేక్షకులు మెచ్చే సినిమాలు, యూత్ కంటెంట్ తో అదరగొడుతున్నాడు. ఏమాత్రం గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తూ తన మార్క్ చూపిస్తున్నారు. రీసెంట్ గా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రంతో మహాశివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాస్తా పర్లేదనిపించిందీ చిత్రం. దీంతో తన నెక్ట్స్ సినిమాపై ఫోకస్ పెట్టారు.
కిరణ్ అబ్బవరం లైనప్ లో తదుపరి రిలీజ్ కు సిద్ధంగా ఉన్న చిత్రం ‘మీటర్’ (Meter). డెబ్యూ దర్శకుడు రమేశ్ కడూరి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్వాహకులు నవీన్ ఎర్నెన్నీ, రవి శంకర్ ఎలమంచి సమర్పిస్తున్నారు. క్లాప్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మాత చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మిస్తున్నారు. పక్కా కమర్షియల్ చిత్రంగా థియేటర్లలోకి రాబోతోంది. షూటింగ్ పనులు దాదాపుగా పూర్తి కావస్తుండటంతో చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది.
పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్న కిరణ్ అబ్బవరం ‘మీటర్’ చిత్రాన్ని 2023 ఏప్రిల్ 7న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ కూడా చాలా గ్రాండ్ గా ఉంది. కిరణ్ స్టిల్, స్టైల్ ఆకట్టుకుంటున్నాయి. అయితే, ఈ చిత్రం సరిగ్గా మాస్ మహారాజా రవితేజ (RaviTeja) నటించిన ‘రావణసుర’ రిలీజ్ రోజే థియేటర్లోకి రాబోతోంది. ఈసినిమా కూడా సమ్మర్ విడుదలగా ఏప్రిల్ 7న గ్రాండ్ గా విడుదల కాబోతోంది.
ఇప్పటికే రవితేజ వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు. సీనియర్ హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను విడుదల చేస్తూ సక్సెస్ అవుతున్నారు. ఇప్పటికీ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్స్ ‘ధమాకా’,‘వాల్తేరు వీరయ్య’ చిత్రాల వైబ్స్ తగ్గలేదు. మరోవైపు కిరణ్ కు ఇంకా సాలిడ్ హిట్ పడలేదనే చెప్పాలి. ఈసమయంలో రవితేజ సినిమాకు పోటీగా ‘మీటర్’ చిత్రాన్ని విడుదల చేయబోతుండటం ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది. కంటెంట్ నే నమ్ముకుంటున్న కిరణ్ ఈ చిత్రంతో ఏ మేరకు అలరిస్తారో వేచి చూడాలి. ఇప్పటికే ‘సెబాస్టియన్ పీసీ 524’లో పోలీసుగా కనిపించిన కిరణ్ అబ్బవరం మరోసారి పోలీసుగా ఆకట్టుకునే ప్రయత్నం చస్తున్నారు. అలాగే ‘రూల్స్ రంజన్’ చిత్రంలోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
The maximum measure of entertainment - 💥
Entertaining in cinemas from April 7th, 2023❤️🔥 pic.twitter.com/OL81l6gP9K