
యాంకర్ రష్మీ గౌతమ్ పై నెటిజెన్స్ మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెను టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగిన బాలుడి ఉదంతం దీనికి కారణమైంది. వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ళ బాలుడు మరణించారు. ఈ సంఘటనను మెజారిటీ వర్గాలు ఖండిస్తున్నాయి. వారి ఆగ్రహం యానిమల్ లవర్స్ మీదకు మళ్లింది. వీధి కుక్కల రక్షణ కోసం పోరాటం చేస్తున్న రష్మీ గౌతమ్ లాంటి వాళ్ళను నెటిజెన్స్ తీవ్రంగా తప్పుబడుతున్నారు.
వీధి కుక్కలను నియంత్రించకుండా కేసులు వేసి అధికారులను భయపెట్టి... భయానక పరిస్థితులు తెచ్చారు. వీధి కుక్కలను పోషిస్తూ వాటి సంతతి పెరిగేలా చేస్తున్న రష్మీ లాంటి వాళ్ళను ముందు శిక్షించాలంటూ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. ఇక గత వారం రోజులుగా రష్మీని నెటిజెన్స్ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. కొడతాం, యాసిడ్ దాడులు చేస్తామనే బెదిరింపులు కూడా ఎదురవుతున్నాయి.
ఈ క్రమంలో ఓ నెటిజెన్... ముందు రష్మీ గౌతమ్ ని అరెస్ట్ చేయాలి. వీధి కుక్కలకు ఆహారం పెడుతూ వాటిని దాడులకు ప్రోత్సహిస్తుంది, అని ట్వీట్ చేశాడు. సదరు ట్వీట్ కి రష్మీ గౌతమ్ స్పందించారు. 'అది అంత ఈజీ కాదు. నీకు చేతనైంది చేసుకో' అని రిప్లై ఇచ్చారు. రష్మీ ట్వీట్ వైరల్ గా మారింది. నన్ను ఏం చేయలేరని రష్మీ గౌతమ్ నేరుగానే చెప్పింది.
ఇటీవల ఓ నెటిజన్ రష్మీని కుక్కను కొట్టినట్లు కొట్టాలి... అంటూ ట్వీట్ చేశాడు. దీని మీద కూడా రష్మీ స్పదించారు. అడ్రస్ చెప్పు నేనే వస్తా. నువ్వు ఏం చేస్తావో చూస్తా. తేల్చుకుందాం... అని రిప్లై ఇచ్చింది. తనపై ఎవరు పరుష వ్యాఖ్యలు చేసినా రష్మీ అసలు తగ్గడం లేదు. వెంటనే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. రష్మీ కూడా అనసూయ మాదిరి తయారైంది. ఇక ఈ వివాదం ఎన్ని రోజులు సాగుతుందో చూడాలి.
రష్మీ గౌతమ్ చాలాకాలంగా యానిమల్ లవర్ గా ఉన్నారు. ఆమె సోషల్ మీడియా ద్వారా మూగజీవాల తరపున క్యాంపైన్ చేస్తున్నారు. జీవహింస చేయకుండా జనాల్లో అవగాహన కల్పిస్తుంటారు. రష్మీ వీగన్ గా మారారు. మాంసాహారం ముట్టరు. కనీసం గుడ్లు, పాలు కూడా ఉపయోగించరు. వాటి కోసం జంతువులను మనుషులు వేధిస్తున్నారని వీగన్స్ నమ్మకం. మరోవైపు రష్మీ యాంకర్ గా తన ప్రొఫెషన్ లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య స్టార్ మా లో కూడా సందడి చేస్తున్నారు.