ఆడొక నీచ్ కమీన్ కుత్తే, అదొక సినిమానా..కేజీఎఫ్ పై విరుచుకుపడ్డ డైరెక్టర్, తల్లి సీన్స్ పై వెటకారం

Published : Mar 06, 2023, 10:44 AM IST
ఆడొక నీచ్ కమీన్ కుత్తే, అదొక సినిమానా..కేజీఎఫ్ పై విరుచుకుపడ్డ డైరెక్టర్, తల్లి సీన్స్ పై వెటకారం

సారాంశం

చిత్ర పరిశ్రమలో విభేదాలు తరచుగా తెరపైకి వస్తూనే ఉంటాయి. కానీ బహిరంగంగా తీవ్రస్థాయిలో విమర్శించుకోవడం చాలా అరుదుగా చూస్తుంటాం. తాజాగా యువ దర్శకుడు మహా వెంకటేష్ వివాదంలో చిక్కుకున్నారు.

చిత్ర పరిశ్రమలో విభేదాలు తరచుగా తెరపైకి వస్తూనే ఉంటాయి. కానీ బహిరంగంగా తీవ్రస్థాయిలో విమర్శించుకోవడం చాలా అరుదుగా చూస్తుంటాం. తాజాగా యువ దర్శకుడు మహా వెంకటేష్ వివాదంలో చిక్కుకున్నారు. కేరాఫ్ కంచరపాలెం చిత్రంతో మహా వెంకటేష్ దర్శకుడిగా గుర్తింపు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. 

ఓ ఇంటర్వ్యూలో మహా వెంకటేష్ కేజిఎఫ్ చిత్రంపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారంగా మారేలా ఉన్నాయి. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ యష్ హీరోగా తెరకెక్కించిన కెజిఎఫ్ రెండు భాగాలు ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసే విక్టరీ అందుకున్నాయి. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో ప్రశాంత్ నీల్ తనదైన మార్క్ ప్రదర్శించారు. ఇక యష్ అదరగొట్టే పెర్ఫామెన్స్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. 

కానీ అనూహ్యంగా వెంకటేష్ మహా ఈ చిత్రంపై వెటకారం చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. వెంకటేష్ మహా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో జరిగిన చర్చలో వెంకటేష్ మహా కేజిఎఫ్ చిత్రం గురించి పేరు ప్రస్తావించకుండా ఇలా అన్నారు.. 'ఆ సినిమా పేరు చెప్పను.. ఒక తల్లి తన కొడుకుని గొప్పవాడు అవ్వమని చెబుతుంది.. గొప్పవాడు అంటే బాగా సంపాదించి నలుగురికి ఉపయోగపడమని. కానీ నాకొక క్వశ్చన్ ఉంది. తల్లి ఒక వస్తువు అడుగుతుంది. ఆ వస్తువుని తవ్వి తీసేవాళ్ళు ఉంటారు. వీడు వెళ్లి వాళ్ళని ఉద్ధరిస్తాడు. ఒక పాట వస్తుంది. 

చివర్లో మొత్తం బంగారం తీసుకువెళతారు.. నేను స్టోరీ మొత్తం చెప్పేస్తున్నా.. ఆ మహా తల్లిని నాకు కలవాలని ఉంది. ఆడు ఒక నీచ్ కమీన్ కుత్తే.. వాడి చుట్టూ కొన్ని వేల మంది ఉంటారు.. వాళ్ళందరిని వదిలేసి ఆ బంగారాన్ని ఒక చోట పారదొబ్బుతాడు. అలాంటి కుత్తే అవ్వమని తల్లి అడగడం.. అలాంటి కథని సినిమాగా తీస్తే మనం ఎగబడి చూశాం' అంటూ మహా వెంకటేష్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 

ఈ ఇంటర్వ్యూలో శివ నిర్వాణ, నందిని రెడ్డి, ఇంద్రగంటి మోహన్ కృష్ణ కూడా ఉన్నారు. మహా వెంకటేష్ మాట్లాడుతుంటే వీరంతా పగలబడి నవ్వారు. నువ్వు ఏ సినిమా గురించి అంటున్నావో మాకు అర్థం అయింది అని చెప్పారు. మరి వెంకటేష్ మహా వ్యాఖ్యలపై కేజిఎఫ్, యష్, ప్రశాంత్ నీల్ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్
Motivational Dialogue: ఒక్కో డైలాగ్ ఒక్కో బుల్లెట్‌.. మ‌న‌సులో నుంచి పోవ‌డం క‌ష్టం