`ప్రాజెక్ట్ కే` షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డ అమితాబ్‌ బచ్చన్‌.. హెల్త్ అప్‌ డేట్‌ ఇచ్చిన బిగ్‌ బీ

Published : Mar 06, 2023, 10:06 AM ISTUpdated : Mar 06, 2023, 11:01 AM IST
`ప్రాజెక్ట్ కే` షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డ అమితాబ్‌ బచ్చన్‌..  హెల్త్ అప్‌ డేట్‌ ఇచ్చిన బిగ్‌ బీ

సారాంశం

బిగ్‌ బి అమితా బచ్చన్‌ ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రాజెక్ట్ కే చిత్ర షూటింగ్‌లో గాయపడ్డారు. హైదరాబాద్‌లో షూటింగ్‌ జరిగే క్రమంలో ఆయన గాయాపడినట్టు తెలుస్తుంది

బిగ్‌ బి అమితా బచ్చన్‌ ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రాజెక్ట్ కే చిత్ర షూటింగ్‌లో గాయపడ్డారు. హైదరాబాద్‌లో షూటింగ్‌ జరిగే క్రమంలో ఆయన గాయాపడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ముంబైలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.  ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సీలో `ప్రాజెక్ట్ కే` చిత్ర షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుందట. ఈ సందర్బంగా బిగ్‌ బీకి  స్వల్ప గాయాలు అయినట్టు తెలుస్తుంది. 

ఆ వెంటనేస్పందించింది యూనిట్‌ హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. దాదాపు రెండు రోజులు ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారట. ఆదివారం సాయంత్రం ఆయన ఆసుపత్రి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ముంబయిలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నట్టు సమాచారం. తాజాగా దీనిపై బిగ్‌ బీ స్పందించారు. తనకు జరిగిన ప్రమాదంపై వివరణ ఇచ్చారు. గాయాలు తీవ్రంగానే జరిగినట్టు వెల్లడించారు.

``ప్రాజెక్ట్ కే` యాక్షన్‌ సీక్వెన్స్ తీసే క్రమంలో  గాయపడ్డారట. దీంతో తన పక్కటెముక విరిగిందని, కుడి పక్కటెముకలో కండరాలు చిరిగినట్టు ఆయన తన బ్లాగ్‌లు రాసుకొచ్చారు. ఈ ప్రమాదంతో షూటింగ్‌ క్యాన్సిల్‌ చేశారట. వెంటనే హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారని, అక్కడ సీటీ స్కాన్‌ చేశారని, టెస్ట్ లు ఇచ్చి తాను ఇంటికి వచ్చినట్టు పోస్ట్ చేశారు. కోలుకోవడానికి కొన్ని వారాలు పడుతుందని, రెస్ట్ తీసుకోవాలని వైద్యులు తెలియజేయడంతో షూటింగ్‌ రద్దు చేసినట్టు చెప్పారు. 

ఇంకా తన గాయం గురించి చెబుతూ, ఊపిరి తీసుకునే సమయంలో నొప్పిగా ఉందని, దీనికి సంబంధించిన మెడిసిన్‌ తీసుకుంటున్నట్టు చెప్పారు బిగ్‌ బీ. అంతేకాదు తాను ఈ వారం తన జల్సా ఇంటి వద్ద అభిమానులను కలవడం కష్టమే అని వెల్లడించారు. అందుకే వీలైనంత మందికి ఈ సమాచారం అందించాలని చెప్పారు. అమితాబ్‌ ప్రతి వారం తన ఇంటి వద్ద అభిమానులను కలుస్తూ అభివాదం చేస్తుంటారు.

ప్రభాస్‌ హీరోగా దీపికా పదుకొనె కథానాయికగా `ప్రాజెక్ట్ కే` చిత్రం రూపొందుతున్న విసయం తెలిసిందే. `మహానటి` ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వినీదత్‌ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్‌ వరల్డ్ రేంజ్‌లో ఈ చిత్రం రూపొందుతుంది. సైన్స్ ఫిక్షన్‌ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. ఈ సినిమాని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి జనవరి 12న విడుదల చేయబోతున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్
Motivational Dialogue: ఒక్కో డైలాగ్ ఒక్కో బుల్లెట్‌.. మ‌న‌సులో నుంచి పోవ‌డం క‌ష్టం