హీరోయిన్ ఖుష్భూ తెలుగువారందరికీ పరిచయమే. విక్టరీ వెంకటేష్ నటించిన తొలి చిత్రం కలియుగ పాండవులు. ఆ చిత్రంతోనే ఖుష్బూ హీరోయిన్ గా తన కెరీర్ ప్రారంభించింది.
హీరోయిన్ ఖుష్భూ తెలుగువారందరికీ పరిచయమే. విక్టరీ వెంకటేష్ నటించిన తొలి చిత్రం కలియుగ పాండవులు. ఆ చిత్రంతోనే ఖుష్బూ హీరోయిన్ గా తన కెరీర్ ప్రారంభించింది. కలియుగ పాండవులు తర్వాత తెలుగు తమిళ భాషల్లో కుష్బూ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఖుష్బూ తెలుగులో స్టాలిన్, యమదొంగ, అజ్ఞాతవాసి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది. ఖుష్బూ పొలిటికల్ గా కూడా బిజీగా ఉంటోంది. ఈ మధ్యన ఖుష్బూ జబర్దస్త్ జడ్జిగా కూడా మారిన సంగతి తెలిసిందే.
ఖుష్భూ రాజకీయ నాయకురాలు కూడా. ప్రస్తుతం ఖుష్భూ బీజేపీలో యాక్టివ్ గా ఉన్నారు. ఇటీవలే ఖుష్భూకి కీలక పదవి కూడా దక్కింది. నేషనల్ ఉమెన్ కమిషన్ లో ఖుష్బూకి సభ్యురాలిగా అవకాశం వచ్చింది. ఇటీవలే భాద్యతలు కూడా తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖుష్భూ మహిళల గురించి మాట్లాడుతూ తన జీవితంలో జరిగిన సంచలన సంఘటనని రివీల్ చేశారు.
ఖుష్భూ తన తండ్రిపైనే చేసిన ఈ వ్యాఖ్యలు ప్రతి ఒక్కరికి షాక్ ఇస్తున్నాయి. తనకి 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన తండ్రే తనని లైంగికంగా, శారీరకంగా వేధించేవాడు అంటూ ఖుష్భూ ప్రకంపనలు రేపే కామెంట్స్ చేసింది. అమ్మాయికి అయినా, అబ్బాయికి అయినా చిన్న తనంలోనే వేధింపులు ఎదురైతే జీవితం భయకంరంగా అనిపిస్తుంది.
మా అమ్మ గురించి చెప్పాలంటే వివాహం చేసుకుని ఎంతో చిత్రవధ అనుభవించింది. ఒక మగాడు తన భార్యని కొట్టడం, పిల్లలని కొట్టడం , చివరకి కూతురుని కూడా అసభ్యంగా తిట్టడం వేధించడం తన జన్మ హక్కుగా భావించే రోజులు అవి. నాకు 8 ఎల్లా నుంచే మా నాన్న వల్ల వేధింపులు ఎదురయ్యాయి. ఆయన్ని ఎదిరించడానికి కావలసిన ధైర్యం నాకు 15 ఏళ్లకు వచ్చింది.
ఈ విషయం మా అమ్మకి చెప్పినావు నమ్మేది కాదు. ఎందుకంటే ఆమె పతియే దైవం అని భావించే ఎన్విరాన్మెంట్ లో పెరిగింది. ఏం జరిగినా, ఆయన ఏం చేసినా నా భర్త దేవుడు అనే భావనలో ఉండేది. కానీ నా 15 ఏళ్ల నుంచి మా నాన్నపై తిరిగబడడం ప్రారంభించాను. కానీ నాకు 16 ఏళ్ళు ఉన్నప్పుడు నాన్న మరణించారు. అప్పుడు పూట గడవడం కూడా కష్టంగా ఉండేది అంటూ ఖుష్భూ తన బాల్యంలో జరిగిన సంచలన సంఘటనని తెలిపింది.
ఇదిలా ఉండగా ఖుష్బూ తమిళ ప్రముఖ దర్శకుడు సుందర్ సిని వివాహం చేసుకుంది. 2000లో వీరి వివాహం జరగగా.. ఇద్దరు కుమార్తెలు సంతానం ఉన్నారు.