గుణ 369 డైరెక్టర్ అర్జున్ జంధ్యాల ఇంట విషాదం!

Published : Jun 25, 2023, 11:39 AM IST
గుణ 369 డైరెక్టర్ అర్జున్ జంధ్యాల ఇంట విషాదం!

సారాంశం

గుణ 369 చిత్ర దర్శకుడు అర్జున్ జంధ్యాల ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి అనారోగ్యంతో కన్నుమూశారు.   

యువ దర్శకుడు అర్జున్ జంధ్యాల తండ్రి చంద్ర భాస్కర శాస్త్రి శనివారం కన్నుమూశారు. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం.అర్జున్ జంధ్యాల స్వగ్రామం ప్రకాశం జిల్లా నర్సింగోలులో నేడు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. చిత్ర ప్రముఖులు, సన్నిహితులు అర్జున్ జంధ్యాల తండ్రి మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. 

అర్జున్ జంధ్యాల స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను వద్ద అసిస్టెంట్ గా పని చేశాడు. జయ జానకీ నాయక, సరైనోడు చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నాడు. గుణ 369 చిత్రంతో దర్శకుడిగా మారాడు. కార్తికేయ హీరోగా నటించిన గుణ 369 పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 

ప్రస్తుతం ఆయన మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా ఓ మూవీ చేస్తున్నారు. చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ కథ సమకూర్చాడు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..