మృణాల్‌ ఠాకూర్‌ కోలీవుడ్‌ ఎంట్రీ.. స్టార్‌ హీరో సరసన బంపర్‌ ఆఫర్‌?

By Aithagoni Raju  |  First Published Jun 25, 2023, 8:56 AM IST

సీతా మహాలక్ష్మి గా పాపులర్‌ అయిన మృణాల్‌ ఠాకూర్‌ కెరీర్‌ పరంగా జోరుపెంచుతుంది. తాజాగా ఆ బ్యూటీ కోలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతుందట. స్టార్‌ హీరోతో ఛాన్స్ కొట్టిందని సమాచారం. 


`సీతారామం` బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ నెమ్మదిగా అవకాశాలను దక్కించుకుంటూ బిజీ అవుతుంది. ఒకప్పుడు హీరోయిన్‌గా సినిమా అవకాశాల కోసం అనేక స్ట్రగుల్స్ పడ్డ ఈ భామకి ఇప్పుడు మేకర్స్ పిలిచి మరీ ఆఫర్లు ఇస్తున్నారు. భారీ అవకాశాలు ఈ బ్యూటీ తలుపు తడుతుండటం విశేషం. `సీతారామం`లో సీతగా మెప్పించి అందరిని ఆకట్టుకుంది. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పటికే సీతామహాలక్ష్మి తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది. 

టాలీవుడ్‌లో నానితో `నాని30`లో హీరోయిన్‌గా నటిస్తుంది మృణాల్‌ ఠాకూర్‌. ఇందులో శృతి హాసన్‌ మరో కథానాయిక. దీంతోపాటు ఇటీవలే నానితో పరశురామ్‌ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. మరికొన్ని సినిమాలకు మృణాల్‌తో చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం వచ్చిందట. తమిళంలో శివకార్తికేయన్‌తో కలిసి నటించే ఆఫర్‌ వచ్చిందని సమాచారం. శివ కార్తికేయన్‌.. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్‌ అయ్యారు. అందులో హీరోయిన్‌గా మృణాల్‌ ఠాకూర్‌ పేరుని పరిశీలిస్తున్నారట. 

Latest Videos

ప్రస్తుతం శివ కార్తికేయన్‌..తెలుగు ఆడియెన్స్ కి కూడా దగ్గరయ్యారు. `డాక్టర్‌`, `డాన్‌`, `రెమో` చిత్రాలు ఇక్కడ ఆదరణ పొందాయి. చివరగా ఆయన `ప్రిన్స్` మూవీ కూడా నిరాశ పరిచింది. ప్రస్తుతం ఆయన అశ్విన్‌ మరోనా దర్శకత్వంలో `మావీరన్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఇది త్వరలో విడుదల కాబోతుంది. ఇది తెలుగులోనూ రిలీజ్‌ కానుంది. దీంతోపాటు కమల్‌ హాసన్‌ బ్యానర్‌లో ఓ సినిమా చేస్తున్నారు శివ కార్తికేయన్‌. ఇందులో సాయిపల్లవి హీరోయిన్‌గా చేస్తుంది. దీంతోపాటు ఏఆర్‌ మురుగదాస్‌తో మరో సినిమా చేయనున్నారట. ఇందులో హీరోయిన్‌గా మృణాల్‌ పేరు వినిపిస్తుంది. ఇదే నిజమైతే మృణాల్‌ కోలీవుడ్‌లోనూ త్వరలో బిజీ కాబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

ఇప్పటికే ఈ బ్యూటీ హిందీలో ఫుల్‌ బిజీగా ఉంది. అక్కడ నాలుగు సినిమాలు చేస్తుంది. ఇందులో ఒక వెబ్‌ మూవీ `లస్ట్ స్టోరీస్‌2` కూడా ఉంది. ఇందులో ఆమె పెళ్లి చేసుకునే అమ్మాయిగా కనిపిస్తుంది. పెళ్లికి ముందే టెస్ట్ డ్రైవ్‌ కాన్సెప్ట్ ఈమె స్టోరీలోపెట్టడం గమనార్హం. దీంతోపాటు `పూజా మేరి జాన్‌`, `పిప్పా`, `ఆంఖ్‌ మిచోలి` చిత్రాలు చేస్తుంది మృణాల్‌. ఇక వెండితెరపై హోమ్లీ లుక్‌లో మెరిసే ఈ భామ సోషల్‌ మీడియాలో మాత్రం దుమ్మురేపుతుంది. అందాల ఆరబోతలో గేట్లు ఎత్తేస్తూ షాకిస్తుంది. ఈ క్రమంలో ఆమె ట్రోలింగ్‌కి గురయ్యింది.కానీ వాటిని లెక్కచేయకుండా తనకు నచ్చినట్టు ఉంటుంది మృణాల్‌.
 

click me!