
`యాత్ర`, `ఆనందో బ్రహ్మా` వంటి చిత్రాలను, `సేవ్ ది టైగర్స్` వంటి వెబ్ సిరీస్‌లను రూపొందించిన డైరెక్టర్ మహి వి రాఘవ్ ఇటీవల తెరకెక్కించిన క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ 'సైతాన్'. బోల్డ్ కంటెంట్‌తో, క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ వెబ్ సిరీస్ సక్సెస్ ఫుల్‌గా రన్ అయ్యింది. బోల్డ్ కంటెంట్ ఉన్న నేపథ్యంలో అనేక విమర్శల వచ్చినప్పటికీ భారీ వ్యూవ్ రావడం విశేషం. ఈ నేపథ్యంలో దర్శకుడు మహి వీ రాఘవ్ తాజాగా దీనికి సీక్వెల్‌ని ప్రకటించాడు. శనివారం సక్సెస్ మీట్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు.
దర్శకుడు మహి వీ రాఘవ్ మాట్లాడుతూ, `సైతాన్` వెబ్ సీరీస్ `సేవ్ ది టైగర్స్` కంటే నాలుగు రెట్లు ఎక్కువ విజయం సాధించింది. ఈ విజయం మేము ఊహించలేదు. ప్రతి ఆర్టిస్ట్ , టెక్నీషియన్ ఈ సిరీస్ కోసం కష్టపడి పనిచేశారు. మ్యూజిక్, కెమెరా వర్క్, డైలాగ్స్, ఆర్ట్ ఇలా ప్రతి డిపార్ట్మెంట్ కు మంచి ప్రశంశలు లభిస్తున్నాయి. త్వరలో `సేవ్ టైగర్స్` కు కొనసాగింపు ఉంటుంది, అలాగే `సైతాన్` కు కూడా కొనసాగింపు ఉంటుంది. ఆలాగే త్వరలో తాను దర్శకత్వం వహించిన `సిద్దా లోకం ఎలా ఉంది నాయనా` సినిమా విడుదల కాబోతోందని తెలిపారు.
ఈ సందర్భంగా `సైతాన్`ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియెన్స్ కి థ్యాంక్స్ చెప్పారు మహి వీ రాఘవ్. `సైతాన్` వెబ్ సిరీస్ రిలీజ్‌కి ముందు కూడా దీనికి అత్యధిక వ్యూస్ వస్తాయనే ధీమా వ్యక్తం చేశారు. `రానా నాయుడు` వంటి సిరీస్‌పై ఎన్నో విమర్శలు వచ్చినా, ఆడియెన్స్ ఎగబడి చూశారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం యూత్ ఇలాంటి సిరీస్‌లనే ఇష్టపడుతుందని చెప్పారు. ఇప్పుడు అదే నిజం కావడంతో ఇక ఈ సిరీస్‌పై ఆయన మరింత నమ్మకంతో ఉన్నారు.
ఇందులో నటించి నటి సెల్లి మాట్లాడుతూ, `సైతాన్` సీరీస్ లో నాకు సావిత్రి పాత్రను ఇచ్చిన దర్శకుడు మహి గారికి కృతజ్ఞతలు. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆధరిస్తారని ఈ సిరీస్ ద్వారా ప్రూవ్ అయ్యింది. భవిషత్తులో మరిన్ని మంచి రోల్స్ లో మీ ముందుకు వస్తానని అన్నారు. ఆమె సావిత్రిగా చాలా బోల్డ్ రోల్ చేసింది సెల్లి. కుటుంబ పోషణ కోసం పోలీసుకి ఉంపుడుగత్తేగా నటించడం గమనార్హం.
బాలి పాత్రలో నటించిన నటుడు రిషి మాట్లాడుతూ, `సైతాన్` వెబ్ సిరీస్ ను ఆదరిస్తున్న అందరికి కృతజ్ఞతలు. బాలి అనే రోల్ లో నాకు నటించడానికి స్కోప్ ఉంది, అదే విధంగా ఈ పాత్రను అద్భుతంగా డిజైన్ చేశారు దర్శకులు మహి వి రాఘవ్. `సైతాన్` లో అందరూ బాగా నటించారు. టెక్నీకల్ గా కూడా సీరీస్ బాగుందని అందరూ అంటున్నారు. సక్సెస్ ఫుల్ ప్రాజెక్ట్ లో నటించానన్న సంతృప్తి ఉందని తెలిపారు. నటి దేవియాని మాట్లాడుతూ, సేవ్ టైగర్స్ తరువాత సైతాన్ సీరీస్ చెయ్యడం చాలా హ్యాపీగా ఉంది, రెండు సీరీస్ లకు విపరీతమైన పాజిటీవ్ రెస్పాన్స్ లభించింది. నా రోల్స్ రెండు సీరీస్ లో డిఫరెంట్ గా ఉన్నాయని రివ్యూస్ లో చూస్తుంటే సంతోషంగా ఉంది. మీ అందరి సపోర్ట్ తో భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాల్లో నటించాలని ఉందని చెప్పారు.