
రాధే శ్యామ్ (Radhe Shyam)ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై ట్రైలర్ విడుదల చేశారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషాల్లో రాధే శ్యామ్ ట్రైలర్ గ్రాండ్ గా ఫ్యాన్స్ లాంఛ్ చేశారు. అవుట్ అండ్ అవుట్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా రాధే శ్యామ్ తెరకెక్కింది. విధికి ప్రేమకు మధ్య సంఘర్షణగా ఓ భిన్నమైన కాన్సెప్ట్ తో దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించారు.
ట్రైలర్ లాంచ్ అనంతరం ఈవెంట్ కి హాజరైన చిత్ర ప్రముఖులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. కాగా రాధే శ్యామ్ హీరోయిన్ పూజా హెగ్డే సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రాధే శ్యామ్ చిత్రం కోసం దాదాపు నాలుగేళ్లు పనిచేశాం. మా స్వేదం, రక్తం చిందించామని పూజా (Pooja Hegde)అన్నారు. రాధే శ్యామ్ మూవీ కోసం పని చేసిన సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు ఆమె కృతఙ్ఞతలు తెలిపారు.
ముఖ్యంగా దర్శకుడు రాధాకృష్ణ పై ఆమె ప్రసంశలు కురిపించారు. ఆయన ఎంచుకున్న కథ, తెరకెక్కించిన విధానం అద్భుతం అన్నారు. విజువల్ గా రాధే శ్యామ్ అద్భుతంగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనేక యాక్షన్ చిత్రాలు చేసిన ప్రభాస్ ఇలాంటి సబ్జెక్టు ఎంచుకోవడానికి కారణం.. ఫ్యాన్స్ కి కొత్త అనుభూతి పంచాలనే అన్నారు. ఫ్యాన్స్ రాధే శ్యామ్ చిత్రాన్ని బాగా ఇష్టపడతారని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇక తనకు సంక్రాంతి సీజన్ బాగా కలిసి వస్తుందని, ఆ సెంటిమెంట్ రాధే శ్యామ్ మూవీ విషయంలో కూడా జరగాలని ఆశిస్తున్నానన్నారు. రాధే శ్యామ్ మూవీలో ఓ కొత్త ప్రభాస్ (Prabhas), పూజా లను చూస్తారని ఆమె తెలియజేశారు. కాగా రాధే శ్యామ్ జనవరి 14న పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో విడుదల కానుంది.
Also read Radhe Shyam Trailer: ది గ్రేట్ విక్రమాదిత్య.. పామిస్ట్రీ లో ఐన్ స్టీన్ అతడు, ప్రళయం సృష్టించే ప్రేమ కథ
ఇక రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వివిధ పరిశ్రమల ప్రముఖులు హాజరయ్యారు. స్పిరిట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ తో పాటు ప్రాజెక్ట్ కె దర్శకుడు నాగ అశ్విన్ అతిధిగా వచ్చారు. నిర్మాత దిల్ రాజు, ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు, ఆయన పెద్దమ్మ గారు సైతం వేడుకకు విచ్చేశారు. ఇక ఐదు భాషల్లో రాధే శ్యామ్ ట్రైలర్ గ్రాండ్ వేదిక సాక్షిగా విడుదల చేశారు. రష్మీతో పాటు హీరో నవీన్ పోలిశెట్టి యాంకర్స్ గా ఈవెంట్ లో జోష్ నింపారు. ముఖ్యంగా నవీన్ తన ఎనర్జీ తో ఫ్యాన్స్ ని ఫిదా చేశారు.
Also read Radhe Shyam prerelease event:రాయల్ ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్... నేషనల్ మీడియా మొత్తం ఆయన చుట్టే