Radhe Shyam Trailer: ది గ్రేట్ విక్రమాదిత్య.. పామిస్ట్రీ లో ఐన్ స్టీన్ అతడు, ప్రళయం సృష్టించే ప్రేమ కథ

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 23, 2021, 10:08 PM IST
Radhe Shyam Trailer: ది గ్రేట్ విక్రమాదిత్య.. పామిస్ట్రీ లో ఐన్ స్టీన్ అతడు, ప్రళయం సృష్టించే ప్రేమ కథ

సారాంశం

రాధే శ్యామ్ ట్రైలర్ రొమాంటిక్ గా మొదలై ఎమోషనల్ గా ముగుస్తుంది. విక్రమాదిత్య, ప్రేరణ ప్రేమ కథ ఎలా ముగిసింది.. ఎలాంటి పరిణామాలకు దారితీసింది అనేది ఈ చిత్ర కథగా అర్థం అవుతోంది.

అభిమానులంతా ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకునే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. బాహుబలి చిత్రంతో ప్రభాస్ దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో నిరాశపరిచింది. దీనితో తన అభిమానులని ఫుల్ ఖుషి చేసేందుకు ప్రభాస్ ఈ సంక్రాంతికి రాధే శ్యామ్ చిత్రంతో రాబోతున్నాడు. దేశవ్యాప్తంగా ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ తరుణంలో రాధే శ్యామ్ ప్రచార కార్యక్రమాలు షురూ అయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో గ్రాండ్ గా రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాధే శ్యామ్ ట్రైలర్ లాంచ్ చేశారు. ట్రైలర్ విశేషాలు ఇప్పుడు చూద్దాం.. 

రాధే శ్యామ్ ట్రైలర్ రొమాంటిక్ గా మొదలై ఎమోషనల్ గా ముగుస్తుంది. విక్రమాదిత్య, ప్రేరణ ప్రేమ కథ ఎలా ముగిసింది.. ఎలాంటి పరిణామాలకు దారితీసింది అనేది ఈ చిత్ర కథగా అర్థం అవుతోంది. ట్రైలర్ ప్రభాస్ డైలాగ్ తో ప్రారంభం అవుతుంది. 

'రేయ్ అమ్మ పెళ్లి గురించి అడిగితే చెప్పు.. నా చేతిలో ప్రేమ, పెళ్లి లేవని' అంటూ ప్రభాస్ ఆసక్తికరమైన డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ప్రభాస్, పూజా హెగ్డే మధ్య రొమాంటిక్ ట్రాక్ మొదలవుతుంది. అద్భుతమైన లొకేషన్స్ లో అన్ని సన్నివేశాలని దర్శకుడు రాధా కృష్ణ కలర్ ఫుల్ గా తెరకెక్కించాడు. విజువల్ వండర్ అనిపించే షిప్, సముద్రపు సన్నివేశాలు కూడా ఉన్నాయి. 

అసలు ఎవరీ గుడ్ లుకింగ్ బ్యాడ్ ఫెలో అని పూజా హెగ్డే చెప్పగానే కృష్ణం రాజు స్వామిజీ గా ఎంట్రీ ఇస్తాడు. ప్రభాస్ విక్రమాదిత్య పాత్ర గురించి కృష్ణం రాజు చెప్పే డైలాగులు అంచనాలు పెంచేస్తున్నాయి. 'ది డ్రెస్ విక్రమాదిత్య.. పామిస్ట్రీలో అతడు ఐన్ స్టీన్. ప్రపంచ దేశ నాయకులందరూ కలవాలనుకునే గొప్ప హస్త సాముద్రిక నిపుణుడు' అంటూ కృష్ణం రాజు డైలాగులు చెబుతున్నారు. 

 

'నీ ప్రేమ ఎదురవ్వడం వరం.. కానీ అందుకోవడం మాత్రం యుద్ధం' అని ప్రభాస్ చెప్పగానే సముద్రం అల్లకల్లోలంగా కనిపిస్తూ పెద్ద షిప్ మునిగిపోతూ ఉంటుంది. విక్రమాదిత్య, ప్రేరణ ప్రేమ వల్ల విపరీత పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయని దర్శకుడు చెప్పకనే చెప్పాడు. మొత్తంగా రాధే శ్యామ్ ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింతగా పెంచేసింది. 

Also Read: Radhe Shyam Pre Release event: నవీన్ పోలిశెట్టి అదిరిపోయే ఎంట్రీ.. రచ్చ రచ్చ చేసిన జాతిరత్నం

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కెరీర్ మొత్తం అలాంటి సినిమాలు చేసి ఇప్పుడు నీతులు చెబుతున్న బాలయ్య హీరోయిన్.. సూపర్ హిట్ మూవీపై విమర్శలు
రాజమౌళి తో రెండు సినిమాలు మిస్సైన అన్ లక్కీ స్టార్ హీరో ఎవరో తెలుసా?