చిరంజీవి సినిమాకి కనీస ఓపెనింగ్స్ రాలేదు.. అందుకే పవన్‌ కళ్యాణ్‌కి ఐదు కోట్లు.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Published : Apr 22, 2024, 05:56 PM IST
చిరంజీవి సినిమాకి కనీస ఓపెనింగ్స్ రాలేదు.. అందుకే పవన్‌ కళ్యాణ్‌కి ఐదు కోట్లు.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

సారాంశం

మెగాస్టార్‌ చిరంజీవి సినిమాలకు కనీసం ఓపెనింగ్స్ రావడం లేదని, పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు చూస్తేనే ఓపెనింగ్స్ వస్తాయని వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.   

మెగాస్టార్‌ చిరంజీవి.. తన తమ్ముడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కి ఇటీవల ఐదు కోట్ల విరాళం అందించారు. తాను నటిస్తున్న `విశ్వంభర` మూవీ షూటింగ్‌ సెట్‌కి పవన్‌ని పిలిపించుకుని ఈ విరాళం అందించారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. అయితే దీనిపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు చిరంజీవి, ఇటు పవన్‌ కళ్యాణ్‌పై విమర్శలు చేస్తూ, చిరంజీవి సినిమాకి కనీసం ఓపెనింగ్స్ రావడం లేదంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. 

చిరంజీవి సినిమాకి ఓపెనింగ్స్ రావాలంటే పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు చూడాలని, వాళ్లు చూడటం కోసం పవన్‌కి చిరంజీవి విరాళం ఇచ్చాడని, చిరంజీవి పక్కా కమర్షియల్‌ అని సంచలన ఆరోపణలు చేశాడు భీమవరం ఎమ్మెల్యే గ్రాంధీ శ్రీనివాస్‌. పవన్‌ కళ్యాణ్‌ బాయ్‌కాట్‌ చేయాలని చెబితే చిరంజీవి సినిమాని చూసే దిక్కే లేదని ఆయన వ్యాఖ్యానించడం దూమారం రేపుతుంది. 

ఆయన మాట్లాడుతూ, సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తికి చిరంజీవి నమస్కారం పెడితే దాన్ని పవన్‌ తట్టుకోలేకపోతున్నాడని, చిరంజీవి సినిమాని బాయ్‌కాట్‌ చేయమని పిలిపునిస్తే ఆ తర్వాత రిలీజ్‌ అయిన చిరు మూవీకి కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. తన సినిమా ఆడాలంటే, పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు వస్తేగానీ తన సినిమా ఆడదని చెప్పి, చిరంజీవి పక్క కమర్షియల్‌ అని మనందరికి తెలుసు. అందుకే ఆతర్వాత పవన్‌ కళ్యాణ్‌ని రెండు మాటలు పొగిడారు. మరో ఐదారు నెలల్లో చిరంజీవిది కొత్త సినిమా రిలీజ్‌ అవుతుంది. ఆ సినిమాకి ఓపెనింగ్స్ కావాలని చెప్పి, ఓపెనింగ్స్ రావాలంటే పవన్‌ కళ్యాణ్‌ ని కాకా పట్టుకోవాలని, మొన్న ఐదు కోట్లేదో విరాళం ఇచ్చాడు. ఇది వీళ్ల మనస్థత్వాలు` అంటూ భీమవరం ఎమ్మెల్యే గ్రాంధీ శ్రీనివాస్‌. 

ప్రస్తుతం ఎమ్మెల్యే వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో రచ్చ అవుతున్నాయి. పవన్‌ కళ్యాణ్‌పై కామెంట్స్ చేస్తే అది రాజకీయం, కానీ ఆయన చిరంజీవిపై ఇలాంటి సంచలన ఆరోపణలు చేయడం, విమర్శలు గుప్పించడంతో మెగా అభిమానులు విరుచుకుపడుతున్నారు. ఇది ఎప్పుడు జరిగిందంటూ సెటైర్లు పేలుస్తున్నారు. మెగా ఫ్యామిలీ మధ్య చిచ్చు పెట్టాలని ఎవరు ఎంత ప్రయత్నించినా  మెగా ఫ్యామిలీ ఎప్పటికీ ఒక్కటే అని అంటున్నారు. సదరు ఎమ్మెల్యేని ఆడుకుంటున్నారు మెగా అభిమానులు. దీనికి వైసీపీ అభిమానులు కౌంటర్లిస్తుండటంతో పెద్ద రచ్చ అవుతుంది. 

ఇక ప్రస్తుతం మెగాస్టార్‌ `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. మరో ఐదుగురు హీరోయిన్లు మెరవబోతున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 10న విడుదల కానుంది. సోషియో ఫాంటసీగా ఈ చిత్రం తెరకెక్కబోతుంది. ఇక చిరంజీవి.. చివరగా `భోళా శంకర్‌` చిత్రంలో నటించారు. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. అంతకుముందు `వాల్తేర్‌ వీరయ్య`తో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. అంతకు ముందు `ఆచార్య`తో మరో డిజాస్టర్‌ చవిచూశారు చిరు. ఈ సినిమాని ఉద్దేశించే తాజాగా ఎమ్మెల్యే కామెంట్స్ చేయడం గమనార్హం. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?