సెకండ్‌ ఇన్నింగ్స్ లో రూట్‌ మార్చిన కాజల్‌.. `సత్యభామ`గా వచ్చేది అప్పుడే?

Published : Apr 22, 2024, 05:26 PM IST
సెకండ్‌ ఇన్నింగ్స్ లో రూట్‌ మార్చిన కాజల్‌.. `సత్యభామ`గా వచ్చేది అప్పుడే?

సారాంశం

కాజల్‌ పెళ్లైన తర్వాత రూట్‌ మార్చింది. గ్లామర్‌ పాత్రలు కాకుండా నటనకు స్కోప్‌ ఉన్న రోల్స్ తో వస్తుంది. అందులో భాగంగా లేడీ ఓరియెంటెడ్‌ మూవీతో రచ్చ చేసేందుకు వస్తుంది.   

తెలుగు తెర అందాల చందమామ కాజల్‌ అగర్వాల్‌.. పెళ్లి చేసుకుని ఇప్పుడు నీల్‌ కిచ్లుకి తల్లి కూడా అయ్యింది. అంతకు ముందు గ్లామర్‌ డాల్‌గా మెరిసింది కాజల్‌. స్టార్‌ హీరోల సినిమాల్లో అలా వచ్చి ఇలా పోయే పాత్ర, పాటలకు పరిమితమయ్యే పాత్రల్లోనే ఎక్కువగా కనిపించి ఆకట్టుకుంది. కానీ ఇప్పుడు రూట్‌ మార్చింది. పెళ్లి తర్వాత ఆమె కథల ఎంపికలో చాలా మార్పు కనిపిస్తుంది. కేవలం గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉంటుంది. నటనకు స్కోప్‌ ఉన్న పాత్రలకే ప్రయారిటీ ఇస్తుంది. 

పెళ్లై, తల్లి అయిన తర్వాత ఆమె గతేడాది బాలయ్యతో `భగవంత్‌ కేసరి` చిత్రంలో నటించింది. ఇందులో ఆమె పాత్ర కనిపించేది కాసేపే అయినా, నవ్వులు పూయించేలా ఉంది. ఇక ఇప్పుడు ఏకంగా లేడీ ఓరియెంటెడ్‌ సినిమాతో వస్తుంది. ఆమె `సత్యభామ` పేరుతో ఓ మహిళా ప్రధానమైన సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో శక్తివంతమైన పోలీస్‌ పాత్రలో కనిపిస్తుంది కాజల్‌. క్రైమ్‌ని ఆమె ఎలా సాల్వ్ చేసింది, ప్రత్యర్థులను ఎలా ఎదుర్కొంది, ఈ క్రమంలో తాను ఎలాంటి ఆటు పోట్లని ఫేస్‌ చేసిందనే కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది. 

కాజల్‌ మెయిన్‌ లీడ్‌గా నటిస్తున్న `సత్యభామ` మూవీలో నవీన్‌ చంద్ర ఆమెకి జోడీగా కనిపిస్తున్నాడు. అమరేందర్‌ పాత్రలో నటిస్తున్నారు. శశికిరణ్‌ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తున్న ఈ మూవీకి సుమన్‌ చిక్కాల దర్శకుడు. క్రైమ్‌ థ్రిల్లర్‌ కథతో రూపొందుతున్న ఈ మూవీని అవురమ్‌ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్‌కి రెడీ అయ్యింది. వచ్చే నెలలో రిలీజ్‌ కాబోతుంది. మే 17న థియేటర్‌లోకి సినిమాని తీసుకొస్తున్నట్టు టీమ్‌ ప్రకటించింది. 

సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ కోసం డిజైన్ చేసిన వీడియో క్రియేటివ్ గా ఉంది. క్రైమ్ సీన్ నుంచి రికవరీ చేసిన గన్ విడి పార్ట్స్ లోడ్ చేసి కాజల్ షూట్ చేయగా..అది క్యాలెండర్ లో మే 17 డేట్ ను టార్గెట్ చేస్తూ దూసుకెళ్తుంది. `సత్యభామ` సినిమా రిలీజ్ ను ఇలా ఇన్నోవేటివ్ గా ప్రకటించడం ఆకట్టుకుంది. సినిమాకి సంబంధించి విడుదలైన గ్లింప్స్, టీజర్‌ ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలను పెంచింది. ఇందులో ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.  శ్రీ చరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్నారు.  
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..
500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా