సల్మాన్ ముద్దు సీన్ కి ఒప్పుకోడు, ప్రియాంక చోప్రా ఇప్పటికీ ఆ పని చేయదు.. మేము మాత్రం అడిగింది ఇచ్చేయాలా ?

Published : Apr 22, 2024, 05:46 PM IST
సల్మాన్ ముద్దు సీన్ కి ఒప్పుకోడు, ప్రియాంక చోప్రా ఇప్పటికీ ఆ పని చేయదు.. మేము మాత్రం అడిగింది ఇచ్చేయాలా ?

సారాంశం

ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ సంఘటనల గురించి తరచూ వింటూనే ఉన్నాం. క్రమంగా ఒక్కో నటి తమకి ఎదురైన కాస్టింగ్ కౌచ్ సంఘటనలని బయట పెడుతున్నారు. తాజాగా నటి గాయత్రీ రేమ సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ సంఘటనల గురించి తరచూ వింటూనే ఉన్నాం. క్రమంగా ఒక్కో నటి తమకి ఎదురైన కాస్టింగ్ కౌచ్ సంఘటనలని బయట పెడుతున్నారు. తాజాగా నటి గాయత్రీ రేమ సంచలన వ్యాఖ్యలు చేసింది. గాయత్రీ ప్రముఖంగా తమిళ చిత్రాల్లో నటించింది. 

తెలుగులో ఆమె ప్రణవం అనే చిత్రంలో హీరోయిన్ గా మెరిసింది. ఓ ఇంటర్వ్యూలో గాయత్రీ రేమ మాట్లాడుతూ సినిమాలో ఆఫర్ కావాలంటే అడ్జెస్ట్మెంట్ తప్పదు అని చెబుతారు. వాళ్ళు చెప్పిన విధంగా చేస్తే సినిమాలో ఛాన్స్ ఒకే అవుతుంది.. లేకుంటే లేదు అని నన్ను చాలా సార్లు అడిగారు. 

అడ్జెస్ట్మెంట్ అంటే వాళ్ళతో ఒక రాత్రి గడపాల్సిందే. ఇలాంటి సంఘటనలతో చాలా బాధపడ్డా. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ ఇప్పటికీ ముద్దు సన్నివేశంలో నటించరు. ప్రియాంక చోప్రా హాలీవుడ్ కి వెళ్లినప్పటికీ ఆమె న్యూడ్ సీన్స్ లో నటించదు. 

కానీ మేము మాత్రం వీళ్ళు చెప్పినట్లు వినాల్సిందే. లేకుంటే అవకాశాలు ఉండవు అంటూ గాయత్రీ రేమ మండిపడింది. ఒక వేళ అవకాశం ఇచ్చినా మా లాంటి వాళ్లకు సెట్స్ లో కనీసం మర్యాద ఉండదు. ఒకసారి పీరియడ్స్ సమయంలో షూటింగ్ లో పాల్గొన్నా. 

దగ్గర్లోనే మా ఇల్లు ఉంటే వెళ్లి ప్యాడ్స్ మార్చుకుని వస్తా అని చెప్పా. లేదు.. హీరోయిన్ క్యారవాన్ లోకి వెళ్లామన్నారు. అది స్టార్ హీరోయిన్ క్యారవ్యాన్.. అక్కడికి వెళితే హీరోయిన్ తల్లి నా వద్దకు వచ్చి లోపలి ఎందుకు వచ్చావు అంటూ అందరి ముందు అసభ్యంగా మాట్లాడింది. ఆమె కూడా మహిళే కదా.. అంత కఠినంగా ఎలా ఉంటారు మనుషులు అని ఆశ్చర్యపోయినట్లు గాయత్రీ రేమతనకు ఎదురైన ఇబ్బందులు వివరించింది. 

PREV
click me!

Recommended Stories

Raghavendra Rao: ఈ వయసులో ఇవేం పనులు, దర్శకేంద్రుడిపై మండిపడుతున్న నెటిజన్లు
Nagabandham Trailer Review: అనంత పద్మనాభస్వామి ఆలయ రహస్యాలు, నాగబంధం ట్రైలర్ రివ్యూ..