బిగ్‌ బాస్‌ చరిత్ర సృష్టిస్తా.. యావర్‌ ఉద్వేగభరిత వ్యాఖ్యలు.. రైతు గర్వించేలా చేస్తా..పల్లవి ప్రశాంత్‌ ఎమోషనల్

Published : Dec 13, 2023, 11:19 PM IST
బిగ్‌ బాస్‌ చరిత్ర సృష్టిస్తా.. యావర్‌ ఉద్వేగభరిత వ్యాఖ్యలు.. రైతు గర్వించేలా చేస్తా..పల్లవి ప్రశాంత్‌ ఎమోషనల్

సారాంశం

తమకి బిగ్‌ బాస్‌ గ్రాండ్‌గా వెల్ కమ్‌ చెప్పిన అనంతరం పల్లవి ప్రశాంత్‌, యావర్‌ ఎమోషనల్‌ వర్డ్స్ చెప్పారు. హీరోయిజాన్ని పలికిస్తూ రెచ్చిపోయారు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 7 మరో మూడు రోజులతో క్లోజ్‌ కాబోతుంది. చివరి వారంలో టాప్‌ 6 కంటెస్టెంట్లు ఉన్నారు. శివాజీ, పల్లవి ప్రశాంత్‌, అమర్‌ దీప్‌, అర్జున్‌, ప్రియాంక, యావర్‌ ఉన్నారు. వీరికి బిగ్‌ బాస్‌ గ్రాండ్‌గా వెల్‌ కమ్‌ చెబుతున్నారు. ఇప్పటికే అర్జున్‌, అమర్‌, ప్రియాంక, శివాజీ లకు బిగ్‌ బాస్‌ ఘనంగా స్వాగతం పలికారు. ఇక బుధవారం ఎపిసోడ్‌లో యావర్‌, పల్లవి ప్రశాంత్‌లకు గ్రాండ్‌గా స్వాగతం పలికారు. 

ఇందులో యావర్‌ జర్నీని చాలా గొప్పగా వర్ణించాడు బిగ్‌బాస్‌. తన పోరాట పఠిమని, యోధుడిలా ఆడిన తీరుని, ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న తీరుని వివరించారు. బిగ్‌ బాస్‌ మాటలకు యావర్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన డెకరేషన్‌ చూసుకుని ఉబ్బితబ్బిబ్బయ్యాడు. మరోవైపు ఏవీ చూపించి మరింతగా కన్నీళ్లు పెట్టించారు. చాలా డిటెయిలింగ్‌గా ఏవీ చూపించడంతో చాలా ఎమోషనల్‌గా ఉంది. అందులో తడిసి ముద్దయ్యాడు యావర్‌. ఏవీ అయిపోయాక ఆవేశంతో ఊగిపోయాడు. ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. హిందీలో అదిరిపోయే డైలాగులు చెప్పారు. 

తాను చరిత్ర సృష్టిస్తానని ప్రకటించారు. అంతటి దమ్ము, సామర్థ్యం తనలో ఉందని చెప్పారు. తాను ఎక్కడి నుంచి వచ్చాను, బిగ్‌ బాస్‌ ఎలా మార్చాడు అని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు యావర్‌. హీరోలా రియాక్ట్ అయ్యాడు. తాను కనుక ఈ బిగ్‌ బాస్‌లో నిలబడితే(విన్నర్‌ అయితే) అవసరంలో ఉన్న వారికి సహాయం చేస్తానని, వారి కోసం తాను నిలబడతా అని వెల్లడించారు. అంతేకాదు తాను హైదరాబాదీకి చెందిన వాడిని కాదు, కొల్‌కత్తాకి చెందిన వాడిని కాదు, మీ అందరిన వాడిని అంటూ ఎమోషనల్‌ వర్డ్స్ వెల్లడించారు. విరోచితంగా మాట్లాడి అందరి మనసులు గెలుచుకున్నారు యావర్‌. 

ఆ తర్వాత రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌కి స్వాగతం పలికారు. రైతు బిడ్డగా, కమన్‌ మ్యాన్‌గా వచ్చావని, బిగ్‌ బాస్‌ షోకి రావాలన ఎన్నో రోజులుగా కలలు కన్నావని, ఇప్పుడు ఆ కలలు నిజం అయ్యాయని చెబుతూ హౌజ్‌లో తన ఆట తీరుని, తన వ్యక్తిగతాన్ని ప్రశంసించాడు బిగ్‌ బాస్‌. ప్రత్యేకమైన మాటలతో ప్రశాంత్‌ చేత కన్నీళ్లు పెట్టించాడు. ఆ తర్వాత ఏవీ చూసుకుని మరింత ఎమోషనల్‌ అయ్యాడు ప్రశాంత్‌. తన ఆట తీరు, మడమ తప్పని తీరు, పుష్పలా పోరాడిన తీరుని చూపించిన విధానం అదిరిపోయింది. ఇక చివరగా తాను రైతు బిడ్డని అని, రైతు గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నట్టు తెలిపారు ప్రశాంత్‌. ఇలా ఆద్యంతం ఎమోషనల్‌గా ఈ ఎపిసోడ్‌ ముగిసింది. 

ఆదివారం బిగ్‌ బాస్‌ తెలుగు 7వ సీజన్‌ క్లోజ్‌ కానుంది. మరి ప్రస్తుతం ఉన్న ఆరుగురిలో ఎవరు విజేత అనేది ఆసక్తికరంగా మారింది. ప్రశాంత్‌ విన్నర్‌ అని అంటున్నారు. శివాజీ కూడా పోటీలో ఉన్నారు. అమర్‌ డౌన్‌ అయ్యాడని, యావర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నట్టు తెలుస్తుంది. 

Read more: Bigg Boss 7 Grand Finale Guests: బిగ్ బాస్ ఫినాలే గెస్ట్స్ గా ఇద్దరు స్టార్ హీరోలు!
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే