`ఉస్తాద్‌ భగత్‌సింగ్‌`ని పక్కన పెట్టిన హరీష్‌ శంకర్‌.. రవితేజతో సినిమా ప్రకటన..

Published : Dec 13, 2023, 08:26 PM IST
`ఉస్తాద్‌ భగత్‌సింగ్‌`ని పక్కన పెట్టిన హరీష్‌ శంకర్‌.. రవితేజతో సినిమా ప్రకటన..

సారాంశం

ఇప్పట్లో `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` సినిమా షూటింగ్‌ స్టార్ట్ అయ్యే పరిస్థితి లేదు.  దీంతో ఇన్నాళ్లు వెయిట్‌ చేసిన దర్శకుడు హరీష్‌.. ఇక ఆగలేకపోయాడు. పవన్‌ సినిమాని పక్కన పెట్టాడు.

హరీష్‌ శంకర్‌.. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌తో `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` సినిమాని చేస్తున్న విషయం తెలిసింది. కొంత వరకు షూటింగ్‌ కూడా జరుపుకుంది. కానీ మళ్లీ ఈ మూవీ ఎప్పుడు షూటింగ్‌ స్టార్ట్ అవుతుందనే సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. అదిగో, ఇదిగో అన్నారు. ఇంకా ఎలాంటి అప్‌డేట్‌ లేదు. పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. మొన్నటి వరకు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అంతకు ముందు చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆయా కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. ఇప్పుడు ఏపీ రాజకీయాలపై ఫోకస్‌ పెట్టారు. ఏపీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆయన కసరత్తులు చేస్తున్నారు. 

దీంతో ఇప్పట్లో `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` సినిమా షూటింగ్‌ స్టార్ట్ అయ్యే పరిస్థితి లేదు. మరో ఆరు నెలల వరకు పవన్‌ షూటింగ్‌ ల వైపు వెళ్లే అవకాశం లేదు. దీంతో ఇన్నాళ్లు వెయిట్‌ చేసిన దర్శకుడు హరీష్‌.. ఇక ఆగలేకపోయాడు. పవన్‌ సినిమాని పక్కన పెట్టి మరో సినిమాకి కమిట్‌ అయ్యాడు. ముందు నుంచి వినిపిస్తున్నట్టుగానే రవితేజ్‌తో సినిమాని ప్రకటించారు. బుధవారం ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో `షాక్‌` వంటి డిజాస్టర్‌, `మిరపకాయ్‌` వంటి మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ వచ్చింది. మంచి ఆరదణ పొందింది. 

దాదాపు 12ఏళ్ల తర్వాత ఈ కాంబో రిపీట్‌ కాబోతుంది. రవితేజ వంటి మాస్‌, ఎనర్జీకి, హరీష్‌ మాస్‌ యాక్షన్‌ టేకింగ్‌ తోడైతే సినిమా నెక్ట్స్ లెవల్‌ ఉండబోతుందని చెప్పొచ్చు. ఇప్పుడు అలాంటి సినిమాకే రెడీ అవుతున్నారు. పవన్‌ ఫ్రీ అయ్యే లోపు ఆయన రవితేజతో సినిమా చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఇక రవితేజ, హరీష్‌ కాంబినేషన్‌లో సినిమా ఎంత మాసీగా ఉండబోతుందో తెలియజేయడానికి `ఈసారి మాస్ రీయూనియన్ స్పైసీగా ఉంటుంది` అని మేకర్స్ అనౌన్స్ చేశారు.  త్వరలోనే ఈ మూవీ ప్రారంభం కాబోతుందట. 

రవితేజ ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆయన `ఈగల్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఇది సంక్రాంతికి రాబోతుంది. మరోవైపు గోపీచంద్‌ మలినేనితో ఓ సినిమా చేస్తున్నారు. దీంతోపాటు మరో సినిమాకి కూడా కమిట్‌ అయ్యారట. తాజాగా హరీష్‌ శంకర్‌ మూవీ తోడయ్యింది. అయితే ఈ చిత్రాన్ని చాలా వేగంగా పూర్తి చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. 

Read more: హరీష్ శంకర్ తో అల్లు అర్జున్ అఫీషియల్... కాని ట్విస్ట్ ఏంటంటే..?
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే