యష్‌ `కేజీఎఫ్‌2` టీజర్‌ సరికొత్త రికార్డ్..

Published : Jun 01, 2021, 03:46 PM IST
యష్‌ `కేజీఎఫ్‌2` టీజర్‌ సరికొత్త రికార్డ్..

సారాంశం

`కేజీఎఫ్‌2` టీజర్‌ ఇప్పటికే 188మిలియన్స్ వ్యూస్‌ని దక్కించుకుని రికార్డు సృష్టించింది. ఎనిమిది మిలియన్స్ కిపైగా లైకులు సొంతం చేసుకుని రికార్డు క్రియేట్‌ చేయగా, ఇప్పుడు మరో విభాగంలో సరికొత్త రికార్డ్ క్రియేట్‌ చేసింది. 

ఇండియన్‌ ఆడియెన్న్ ఆసక్తికరంగా చూస్తోన్న సినిమాల్లో `కేజీఎఫ్‌ 2` ఒకటి. తొలి భాగం సృష్టించిన సంచలనాలతో `ఛాప్టర్‌2`పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హీరో యష్‌ బర్త్ డే సందర్బంగా విడుదలైన టీజర్‌ మరిన్ని సంచలనాలు సృష్టిస్తుంది. ఈ టీజర్‌ ఇప్పటికే 188మిలియన్స్ వ్యూస్‌ని దక్కించుకుని రికార్డు సృష్టించింది. ఎనిమిది మిలియన్స్ కిపైగా లైకులు సొంతం చేసుకుని రికార్డు క్రియేట్‌ చేయగా, ఇప్పుడు మరో విభాగంలో సరికొత్త రికార్డ్ క్రియేట్‌ చేసింది. టీజర్‌కి యూట్యూబ్‌లో ఒక మిలియన్‌ అంటే పది లక్షల కామెంట్లని పొంది రికార్డ్ క్రియేట్‌ చేసింది. 

తాజాగా యూనిట్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ టీజర్‌ కన్నడ, తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. యూనివర్సల్‌ టీజర్‌గా రిలీజ్‌ అయి సంచలనం సృష్టించింది. ఇందులో కన్నడ హీరో యష్‌ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. రాకీ భాయ్‌గా ఆయన కనిపించనున్నారు. తొలి భాగంలోనే తనదైన స్టయిలీష్‌ నటనతో స్టార్‌ హీరో అయిపోయాడు. ఇప్పుడు రెండో భాగంతోనూ ఇంకెన్ని సంచలనాలు క్రియేట్‌ చేస్తాడో చూడాలి. ఈ సినిమాని జులైలో విడుదల చేయాలని భావించారు. కానీ కరోనా కారణంగా వాయిదా పడే అవకాశాలున్నాయి. 

ఈ సినిమాని ప్రశాంత్‌ నీల్‌ రూపొందించగా, హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్‌ కిరంగుదూర్‌ నిర్మిస్తున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. సంజయ్‌ దత్‌ విలన్‌గా నటిస్తున్నారు. రవీనా టండన్‌, రావు రమేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెండో భాగంగా నిడివి దాదాపు మూడు గంటలుంటుందని సమాచారం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి