పవన్ పై ఆర్ ఆర్ ఆర్ రైటర్ కామెంట్: పొగిడాడా, ఎగతాళి చేశాడా?

By team teluguFirst Published Jun 1, 2021, 3:33 PM IST
Highlights


చాలా కాలం తరువాత ఈ బాహుబలి రైటర్  విజయేంద్ర ప్రసాద్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆలీతో సరదాగా టాక్ షోలో పాల్గొన్న విజయేంద్ర ప్రసాద్ అనేక ఆసక్తికర ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం చెప్పారు. 
 


స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ అద్భుతమైన కథలు అందించారు. రాజమౌళి తండ్రిగారైన విజయేంద్ర ప్రసాద్ అందించిన కథలు బాషా బేధం లేకుండా అద్భుత విజయాలు అందుకున్నాయి. చాలా కాలం తరువాత ఈ బాహుబలి రైటర్  ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆలీతో సరదాగా టాక్ షోలో పాల్గొన్న విజయేంద్ర ప్రసాద్ అనేక ఆసక్తికర ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం చెప్పారు. 


కాగా పవన్ కళ్యాణ్ చిత్రానికి కథ రాయాల్సి వస్తే అని అడుగగా... పవన్ కి ప్రత్యేకంగా కథ రాయాల్సిన అవసరం లేదు. ఆయన గత సినిమాల నుండి కొన్ని సన్నివేశాలు తీసుకొని కథగా రాసేస్తే సరిపోతుంది . హీరోయిన్స్ తో డాన్స్ లు, ఫైట్స్, ప్రజలకు కొంచెం మంచి చేయడం . ఈ అంశాలు చాలు, పవన్ ని చూడడానికి ఫ్యాన్స్ వచ్చేస్తారు. ఆయన డైనమైట్, అది పేలాలంటే చిన్న చిన్న అగ్గిపుల్లలు చాలు. అలాగే ఆయన గత చిత్రాల సన్నివేశాలతో కథ రాసినా సినిమా పూర్తి అవుతుందని.. అని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. 


ఇక్కడ పవన్ సినిమా ఎలా ఉన్నా ప్రేక్షకులు చూస్తారు అని చెబుతూనే, ఆయన సినిమాలలో సరైన కథ ఉండదు. మూసధోరణిలో నాలుగు ఫైట్స్, ఆరు పాటలు, కొన్ని సామాజిక సన్నివేశాలు అంతే అంటూ, విమర్శించినట్లుగా కూడా ఉంది. విజయేంద్ర ప్రసాద్ అభిప్రాయం ఏమిటో కానీ ఆయన కామెంట్ లో రెండు అర్థాలు గోచరిస్తున్నాయి. ఒక అర్థంలో పవన్ సినిమా ఎలా ఉన్నా ప్రేక్షకులు చూస్తారని, మరో అర్థంలో పవన్ సినిమాలలో కొత్తదనం ఏమీ ఉండదు అని, అనిపిస్తుంది. 


అలాగే కమల్ కి కథ రాయడం అనవసరం ఆయన అన్నీ చేసేశారు . ఇక అవకాశం వస్తే రజినీకాంత్ కోసం  రావణాసురుడు కథ రాస్తాను అన్నారు. మహేష్ కి కథ రాయడం కష్టం, అది పూరి జగన్నాధ్ వలెనే అవుతుంది అన్నారు.
 

click me!