అజిత్‌కి బాంబ్‌ బెదిరింపులు.. పోలీసుల తనిఖీలు..

Published : Jun 01, 2021, 01:56 PM IST
అజిత్‌కి బాంబ్‌ బెదిరింపులు.. పోలీసుల తనిఖీలు..

సారాంశం

తమిళ హీరో అజిత్‌ ఇంట్లో బాంబ్‌ ఉందంటూ వచ్చిన ఫోన్‌ కాల్‌ పెద్ద దుమారం సృష్టించింది. మంగళవారం ఓ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈ ఫోన్‌ కాల్‌ కోలీవుడ్‌ మొత్తం కలకలం రేపింది. 

తమిళ హీరో అజిత్‌ ఇంట్లో బాంబ్‌ ఉందంటూ వచ్చిన ఫోన్‌ కాల్‌ పెద్ద దుమారం సృష్టించింది. మంగళవారం ఓ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈ ఫోన్‌ కాల్‌ కోలీవుడ్‌ మొత్తం కలకలం రేపింది. దీంతో అజిత్‌తోపాటు, ఆయన అభిమానులు షాక్‌కి గురయ్యారు. వివరాల్లోకి వెళితే, కోలీవుడ్‌ స్టయిలీష్‌ స్టార్‌గా పేరున్న అజిత్‌ చెన్నైలోని తిరువాన్మియూరులోని నివాసం ఉంటున్నారు. భార్య షాలిని, పిల్లలతో ఆయన నివాసం ఉంటున్నారు. 

ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఇంట్లో బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. దీంతో ఈ విషయాన్ని అజిత్‌ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అజిత్‌ ఇంటికి చేరుకున్నారు. జాగిలాలతో ఇల్లు మొత్తం తనఖీ చేసిన పోలీసులు ఇంట్లో ఎలాంటి బాంబ్‌ లేదని నిర్ధారించారు. ఎవరో ఆఖతాయిలు చేసిన పనిగా భావిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే అజిత్‌కి ఇలాంటి బెదిరింపు ఫోన్‌ కాల్స్ కొత్త కాదు, గతంలోనూ వచ్చాయి. 

మరోవైపు ప్రస్తుతం అజిత్‌ `వాలిమై` చిత్రంలో నటిస్తున్నారు. హెచ్‌ వినోద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. బోనీ కపూర్‌ నిర్మాత. ఈసినిమా దాదాపు షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఇటీవల అజిత్‌ తన 50వ పుట్టిన రోజుని జరుపుకున్న విషయం తెలిసిందే.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి