
ఈరోజు ఎపిసోడ్లో యష్,వేద వైపు చూసి బాధపడుతూ గతంలో వేదతో గడిపిన క్షణాలు గుర్తుతెచ్చుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు. మరొకవైపు సులోచన ఏడుస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి అమ్మమ్మ అని ఖుషి వస్తుంది. అమ్మమ్మ అమ్మకు ఏమైంది అనడంతో అప్పుడు విన్నీ ఖుషి కి ఈ విషయం చెప్పలేదా ఆంటీ అనగా లేదు బాబు అని అంటుంది. కొన్ని కొన్ని సార్లు పిల్లలకు నిజం చెప్పడమే మంచిది ఆంటీ అని అంటాడు విన్నీ. చెప్పే విధంగా చెప్తే అర్థం చేసుకుంటారు అని అంటాడు విన్నీ. అప్పుడు విన్నీ ఖుషిని దగ్గరికి తీసుకొని ఖుషి మీ అమ్మ నాకు నువ్వు ధైర్యవంతురాలివి ఏ విషయం చెప్పినా అర్థం చేసుకుంటావని చెప్పింది అనడంతో అవును అంకుల్ అని అంటుంది ఖుషీ.
సరే అయితే నేను ఇప్పుడు ఒక విషయం చెప్తాను నువ్వు ధైర్యంగా ఉండాలి అన్నంతో సరే అంకుల్ అంటుంది. వేద అమ్మకి జ్వరం వచ్చింది హాస్పిటల్ లో ఉంది అంటూ ఖుషికి అర్థమయ్యే విధంగా చెబుతాడు విన్నీ. అలా అయితే అంకుల్ నన్ను ఒకసారి హాస్పిటల్ కి పిలుచుకుని వెళ్ళండి నేను వచ్చాను అని తెలిస్తే అమ్మ నా కోసం లేస్తుంది అని అంటుంది ఖుషీ. తీసుకెళ్తాను కానీ అమ్మకు ఈ ప్రస్తుతం రెస్ట్ అవసరం అందుకే నువ్వు ఇక్కడే ఉండు తర్వాత పిలుచుకొని వెళ్తాను అనడంతో సరే అని అంటుంది ఖుషి. అప్పుడు సులోచన దగ్గరికి వెళ్లి అమ్మమ్మ నువ్వు అమ్మ దగ్గర ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు అనడంతో ఒక ఫైల్ కోసం వచ్చాను అనగా అయితే అమ్మ నాకు ఎక్కడ పెట్టిందో తెలుసు అని ఖుషి ఆ ఫైల్ తీసుకుని వచ్చి సులోచనకు ఇస్తుంది.
అప్పుడు సులోచన ఆ ఫైల్ ని తీసుకొని వెళుతుంది. మరొకవైపు యష్ విన్నీ తప్పుగా అపార్థం చేసుకుంటూ వేద గురించి రెండు విషయాలు తెలుస్తానే పెద్ద గొప్ప అయిపోతాడా అనుకుంటూ ఉంటాడు. అప్పుడు విన్నీ అక్కడికి రావడంతో ఏంటి ఇంత లేటు ఎమర్జెన్సీ అని తెలియదా అని విన్నీ మీద విడుచుకుపడతాడు. అప్పుడు విన్నీ నీ ఫ్రస్టేషన్ ఇతరులకు కూడా ప్రాబ్లం అవుతుంది అనడంతో పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత యష్,విన్నీ ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్ళగా ఆమె అసలు ఫాస్టింగ్ ఉండకూడదు తనకు చిన్నప్పుడు వచ్చిన ప్రాబ్లమే మళ్లీ వచ్చినట్టు ఉంది అని అంటుంది డాక్టర్. ఇప్పుడు విన్నీ యష్ ఇద్దరు షాక్ అవుతారు. ఆ తర్వాత చిత్ర కి అభిమన్యు ఫోన్ చేస్తాడు.
నువ్వు నాకెందుకు ఫోన్ చేశావు అనడంతో వేదకు ఎలా ఉందో తెలుసుకుందామని కాల్ చేశాను అనగా మా అక్కకి ఎలా ఉంటే నీకెందుకు అని అంటుంది వేద. లీవ్ కావాలని అడిగావంట కదా వన్ డే కాకపోతే వన్ వీక్ తీసుకో నేను కాదంటానా అంటాడు అభి. ఇది నా పర్సనల్ నెంబర్ సేవ్ చేసుకో అవసరం అయితే నాకు కాల్ చేయి అనడంతో నీకు కాల్ చేసే అంత అవసరం నాకు రాదు అని చిత్ర కోపంగా ఫోన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత యష్, వేద దగ్గరికి వెళ్తాడు. అప్పుడు గతంలో వేదతో మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు. అప్పుడు ఏంటి వేద ఎంతసేపని ఇలా పడుకుంటావు బోర్ కొట్టడం లేదా నాకు ఎలాగో ఉంది తెలుసా ఒక పూట గడిచిపోయింది నువ్వు ఇంకా నిద్ర లేవలేదు తొందరగా నిద్ర లేవు వేద అని అంటాడు.
ఈపాటికి ఇంట్లో మనిద్దరం ఎన్నిసార్లు పోట్లాడుకునే వాళ్లమో ఇద్దరూ పదేపదే గొడవ పడుతూ ఉంటాము. ప్రతి భార్యాభర్తలు ఇలాగే ఉంటారా లేకుంటే మనం మాత్రమే ఇలా ఉంటామా అని బాధగా మాట్లాడుతూ ఉంటాడు. నాకే అర్థం కాని నన్ను నువ్వు బాగా అర్థం చేసుకున్నావు నన్ను చదివేశావు. నేను ఒకసారి తాకచ్చా వేద నీ పర్మిషన్ అంటూ వేద తల నిమురుతాడు. తర్వాత యష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు సులోచన అంతా నా వల్లే అని తలబాదుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. వర్మ చిత్ర ఇద్దరూ బాధపడకు ఇలాగే బాధపడితే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది అని ఓదారుస్తూ ఉంటారు. అది నా బిడ్డ కదా దాని పరిస్థితి నాకు తెలుసు కదా అది ఉపవాసం చేస్తానంటే నేను ఒప్పుకోవడం ఏంటి అని కన్నీళ్లు పెట్టుకుంటుంది సులోచన.
ఇంతలోనే యష్ అక్కడికి వస్తాడు. మీరందరూ ఇంటికి వెళ్ళండి అత్తయ్య మీరు కూడా ఇంటికి వెళ్ళండి అనడంతో బాబు నా కూతురికి ఇలా ఉంటే నేను ఎలా ఇంటికి వెళ్తాను అంటుంది సులోచన. అప్పుడు విన్నీ వెళ్దాం పదండి ఆంటీ అని అందరిని పిలుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత చిత్ర, వసంత్ ఇద్దరూ ఒక చోటికి వెళ్లగా అప్పుడు వసంత్ చిత్రమీద అలుగుతాడు. అప్పుడు చిత్ర వెంటనే వసంతిని హత్తుకుని నా వసంత్ కు ఇష్టం లేని పని నేను ఏదీ చేయను. నాకు వసంత్ కంటే ఏది ముఖ్యం కాదు. రేపు ఉదయాన్నే నేను అభిమన్యు ఆఫీసులో జాబ్ మానేస్తాను అనడంతో వసంత్ సంతోషపడుతూ నీకు ఇష్టం లేని పని ఏది చేయొద్దు చిత్ర కానీ నువ్వు జాగ్రత్త అని అంటాడు.
ఆ తర్వాత చిత్ర, వసంత్ కోసం భోజనం తీసుకొని వచ్చి గోరుముద్దలు తినిపిస్తూ ఉండగా ఇంతలోనే యష్ అక్కడికి వచ్చి వారిద్దరిని చూసి వేదను తలచుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు. అప్పుడు వసంత్ కూడా చిత్రకి గోరుముద్దలు తినిపిస్తూ ఉండగా అది చూసి మరింత బాధపడుతూ ఉంటాడు యష్. అప్పుడు వసంత్ చిత్ర ఇద్దరు యష్ వైపు చూసి బాధపడుతూ ఉంటారు.