
ఉప్పన సినిమాతో ఉప్పెలా టాలీవుడ్ పై పడింది కృతీ శెట్టి.. తన సొగసులతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సునామీ సృష్టించిన ఈ బ్యూటీ... ఒక్క సినమాతోనే వరుస అవకాశాలు సాధించింది. స్టార్ హీరోల సినిమాలననీ తన గుమ్మం ముందు ఎదురు చూసేలా చేసుకుంది బ్యూటీ అంతే కాదు.. వరుసగా మూడు సినిమాలు హిట్ కొట్టి..హ్యాట్రిక్ హిట్ హీరోయిన్ గా..లక్కీ స్టార్ గా మారిపోయింది. ఇక కృతి శెట్టి కెరీర్ కు ఏమాత్రం డోకా లేదు అనుకున్నారు సినీ జనాలు. కథల విషయంలో కూడా ఈ బ్యూటీ జాగ్రత్తగా అడుగులు వేస్తుంది.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ హోదా దక్కినట్టే అని అనుకున్నారు.
అంతే కాదు కృతి శెట్టి తరువాత శ్రీలీల లాంటి తారలు వచ్చినా.. ఆమె సినిమాలకు ఢోకా లేదు అనుకున్న టైమ్ లో.. కృతి శెట్టికి వరుసగా దెబ్బ మీద దెబ్బ తగిలింది. వరుస సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడం స్టార్ట్ అయ్యింది. స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. ఏ గ్రేడ్ హీరోల దగ్గరకు చేరుతుంది అనుకున్న టైమ్ లో తన కెరీర్ కు బ్రేక్ పడింది. కథల సెలక్షన్.. ఏ హీరోల సినిమాలు చేయాలి అనే విషయంలో ఇండస్ట్రీకి క్లారిటీ ఇవ్వలేకపోయింది అన్న విమర్ష ఉంది కృతి శెట్టిపై.
ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు లాంటి హిట్ సినిమాలు చేసిన ఈ బ్యూటీకి వారియర్ సినిమాతో పెద్ద దెబ్బ తగిలింది. కుర్రకారు మనసులను ఒక రేంజ్ లో దోచేసిన కృతి శెట్టి .. అంతే స్పీడ్ తో మూడు ఫ్లాపులు కూడా మూటగట్టేసింది. ఇక అప్పటి నుంచి ఆమె కొత్త ప్రాజెక్టులలో పెద్దగా కనిపించడం లేదు. చైతూ జోడీగా చేస్తున్న కస్టడీ తప్ప మరో సినిమాలో ఆమె ఉన్నట్టు సూచనలే లేవు. గతంలో మాదిరిగా కృతి గురించి ఇప్పుడు ఎవరూ మాట్లాడుకోవడం లేదు. రాబోయే సినిమాల్లో ఆమెకు ఆఫర్లు వెళ్తుననట్టు కూడా కనిపించడంలేదు. దాంతో కృతి శెట్టి జోరు తగ్గినట్టే అంటున్నారు సినిమా పండితులు.
వరుస ఫ్లాపులు పడినప్పుడు అవకాశాలు తగ్గడం .. మంచి ప్రాజెక్టు అయితేనే చేద్దాంలే అనుకుని దూకుడు తగ్గించడం సహజంగానే జరుగుతుంటాయి. అయితే ఇలాంటి టైమ్ లో ఆమె కెరీర్ ను లైట్ తీసుకుంటే ఇక కృతి శెట్టిని మరిచిపోయే పరిస్థితి వస్తుంది అంటున్నారు. అంతే కాదు సినిమాలు లేకపోతే హీరోలు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుంటూ.. జనాలు మర్చిపోకుండా చేస్తుంటారు. కాని కృతి శెట్టి సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టీవ్ గా లేదు. సినిమాకోసం ఎంత బోల్డ్ గా నటించడానికి అయినా సై అన్న బ్యూటీ. సోషల్ మీడియాలో మాత్రం కాస్త పద్దతిగానే ఉంటోంది.