
ఈరోజు ఎపిసోడ్ లో జానకి టాబ్లెట్స్ తీసుకుని జ్ఞానాంబ అప్పుడు జ్ఞానాంబ అన్న మాటలు గుర్తు తెచ్చుకొని వెన్నెలను పిలుస్తుంది. అప్పుడు జానకి ఈ టాబ్లెట్స్ అన్ని అత్తయ్యకు క్రమం తప్పకుండా ఇవ్వాలి అనడంతో ఇన్ని టాబ్లెట్స్ ఎందుకు వదిన అనగా బలం కోసం డాక్టర్ గారు రాయించారు మనం కాదు అనకూడదు కదా అత్తయ్య గారికి తప్పకుండా ఇవి ఇవ్వాలి అని అంటుంది జానకి. అత్తయ్య టైమ్ టు టైమ్ వేసుకోవాలి నేను ఇస్తుంటే ఎందుకు పేషెంట్ చేస్తున్నావని అంటుంది అని అంటుంది జానకి. అప్పుడు వెన్నెల సరే అని ఆ టాబ్లెట్ తీసుకొని వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత గోవిందరాజులు ఇంట్లోకి వెళుతుండగా అప్పుడు గార్డెన్లో అద్దం కనిపించడంతో అద్దంలో చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. మరోవైపు మల్లికా ఈ చిన్న అత్తయ్య ఎందుకు వచ్చిందో ఏమో కానీ నాతో పని చేయించి నా ఒళ్ళు పూనం చేస్తుంది అనుకుంటూ ఉంటుంది. గోవిందరాజులు వైపు చూసి ముసలోనికి దసరా పండుగ అన్నట్టు ఈ మామయ్యకు ఈ వయసులో ఇలాంటివి అవసరమా అనుకుంటూ ఉంటుంది. అప్పుడు తెలిసిందిలే అనే పాట పాడుతూ ఉంటుంది. అప్పుడు గోవిందరాజులు మల్లిక వైపు చూసి తింగరి మల్లిక ఇలా రా అని పిలుస్తాడు. ఎందుకమ్మా అరిగిపోయినా టేప్ రికార్డర్ లో పాడిందే పాట మళ్లీ మళ్లీ పాడుతున్నావు అని అంటాడు.
అప్పుడు గతంలో గోవిందరాజులు లవ్ స్టోరీని చెప్పడంతో గోవిందరాజులు ఆశ్చర్యపోతాడు. అప్పుడు మల్లిక మాట్లాడే మాటలకు గోవిందరాజులు కంగారుపడుతూ ఉంటాడు. అప్పుడు గోవిందరాజులు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఇప్పటినుంచి నేను మిమ్మల్ని ఒక ఆట ఆడుకుంటాను చూడండి మామయ్య అని అనుకుంటూ ఉంటుంది. మరోవైపు రామచంద్ర,విష్ణు కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి విష్ణు వస్తాడు. మీ షాపులోకి సమోసాలు కావాలని పంపించావు మరి డబ్బు ఎందుకు పంపించావు అనడంతో నువ్వు కష్టపడి సంపాదిస్తుంటే ఊరికే తీసుకోవడం బాగోదు కదా అన్నయ్య అని అంటాడు. ఒకప్పుడు షాపు నీది ఇప్పుడు మీదే కదా అని అనగా నీది నాది అని జతకట్టేసావా అని అంటాడు రామచంద్ర.
ఇంకొకసారి నాకు డబ్బులు పంపించద్దు,డబ్బులు పంపించేలా ఉంటే మనిషినే పంపొద్దు అలాగే ఆ బ్యాంకు వాయిదా ఏదో తొందరగా కట్టు వాళ్లు ఇంటి దగ్గరికి వచ్చేలా ఉన్నారు అనడంతో విష్ణు షాక్ అవుతాడు. అప్పుడు రామచంద్ర అక్కడి నుంచి రామ వెళ్ళి పోవడంతో ఆ మాటలు అన్ని జ్ఞానాంబ వింటూ ఉంటుంది. ఒకే తల్లి కడుపున పుట్టినంత మాత్రాన అందరికీ ఒకే బుద్ధులు ఉండాలని లేదు రామా అంటూ రామచంద్ర మాట్లాడిన మాటలకు సంతోషపడుతూ ఉంటుంది. మరోవైపు జానకి జ్ఞానాంబ పరిస్థితి తలుచుకుని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో రామచంద్ర అక్కడికి వచ్చి మీరు కాలేజీకి ఎందుకు వెళ్లలేదు హాస్పిటల్ కి ఎందుకు వెళ్లారు జానకి గారు నేను మీకు క్యారేజ్ ఇద్దామని కాలేజీకి వెళ్తే మీరు రాలేదని చెప్పారు అసలు ఏం జరుగుతుంది అని అంటాడు రామచంద్ర. అప్పుడు రామచంద్ర మాటలకు జానకి కన్నీళ్లు పెట్టుకుంటుంది.
ఏమైంది జానకి గారు నిన్నటి నుంచి చూస్తున్నాను మీరు ఏదోలా ప్రవర్తిస్తున్నారు ఏదైనా చెప్పడం లేదు అని గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేస్తూ ఉంటాడు రామచంద్ర. అప్పుడు జానకి అబద్ధాలు చెబుతూ రోజు డాక్టర్ దగ్గరికి వెళ్లి జెస్సి ఆరోగ్యం గురించి అడగాలి అనుకుంటున్నాను కానీ కుదరలేదు అందుకే ఈరోజు వెళ్లాను అని అపద్దాలు చెబుతుంది. అయిన జెస్సిని చూసుకోవడానికి అఖిల్ ఉన్నాడు కదా మీరు మీ చదువుపై శ్రద్ధ పెట్టండి అనడంతో అదేంటి రామగారు అఖిల్ కూడా చిన్నపిల్లాడే అని నేను కూడా అనుకున్నాను జానకి గారు అంటాడు రామచంద్ర. నిజమే రామ గారు కొన్ని నిజాలు తెలిస్తే తట్టుకోలేరు అత్తయ్య గారి పరిస్థితి తెలిస్తే మీరు ప్రాణాలతో ఉండలేరు అనుకుంటూ ఉంటుంది జానకి.
మరొకవైపు జ్ఞానాంబ గది సర్దుతూ ఉండగా అప్పుడు టాబ్లెట్స్ కనిపించడంతో అవి కనిపించకుండా దాస్తుంది. వెన్నెల అక్కడికి వచ్చి ఏంటమ్మా మాకు కనిపించకుండా టాబ్లెట్స్ దాస్తున్నావా అనగా అది కాదు వెన్నెల అనడంతో నువ్వేం చెప్పద్దమ్మా నువ్వు ఏం చెప్పినా కూడా నేను వినను ప్రవర్తిస్తావని తెలిసి ముందే నాకు వదిన చెప్పింది అని అంటుంది వెన్నెల. అలా అని టాబ్లెట్స్ మింగడం నావల్ల కాదు అనడంతో గోవిందరాజులు వచ్చి ఉండకపోతే ఎలా జ్ఞానం అనగా అవన్నీ నాకు తెలియదండి ఇలా బస్తాల మీద బస్తాలు టాబ్లెట్స్ నేను వేసుకోలేను అని అంటుంది జ్ఞానాంబ.
మీ అమ్మ చెప్పింది కూడా కరెక్టే కాదమ్మా నిన్ను మర్డర్లు మింగుతారా అనడంతో అమ్మ హెల్త్ బాగుండడం కోసమే జానకి వదిన అని చెప్పింది నాన్న అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెన్నెల. మలయాళం గ్రీన్ కాఫీ అని తీసుకుని రావడంతో గోవిందరాజులు మలయాళం మీద సీరియస్ అవుతూ ఉంటాడు. ఇంతలోనే జ్ఞానాంబ ఇంటికి ఒక డాక్టర్ ఒక నర్స్ వచ్చి గవర్నమెంట్ ప్రాజెక్టులో భాగంగా ఇంటింటికి వెళ్లి హెల్త్ గురించి సర్వే చేయాలి అని వస్తారు. గోవిందరాజులు మా ఇంట్లో అందరూ బాగున్నారు అనడంతో మామయ్య గారు అలా అంటారు వాళ్ళు చెక్ చేస్తున్నప్పుడు మనం చెక్ చేయించుకోవాలి కదా అని జానకి వాళ్ళని లోపలికి పిలుచుకొని వెళ్తుంది.
అప్పుడు జ్ఞానాంబ బాగా డాక్టర్స్ ని చూసి జానకి నాకు ఇస్తున్న టాబ్లెట్స్ ఎందుకు ఇస్తుందో ఈ డాక్టర్స్ ని అడిగి తెలుసుకుంటే సరిపోతుంది అనుకోని లోపలికి వెళుతుంది. ఆ తర్వాత గోవిందరాజులు అందరినీ హాల్లోకి పిలుస్తారు. అప్పుడు జ్ఞానం బాధ టాబ్లెట్ తీసుకొని వచ్చి డాక్టర్ కి ఇచ్చి ఇవి ఎందుకు ఉపయోగిస్తారో ఒకసారి చెప్పండి అని అనగా ఇప్పుడు జానకి అక్కడికి వచ్చి అసలు నిజం ఎక్కడ చెప్పేస్తారో అని జానకి డాక్టర్ కి సైగలు చేస్తూ అసలు నిజం చెప్పొద్దు అని అంటూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ ని జానకిని చూసి మల్లిక ఏదో కుట్ర జరుగుతుంది అనుకుంటూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ ఇంట్లో ఒక్కొక్కరికి టెస్ట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా జానకి డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు జానకి డాక్టర్ తో మాట్లాడుతున్న మాటలు రామచంద్ర వింటూ ఉంటాడు.