Ennenno Janmala Bandham: వేదను చూసి కుమిలిపోతున్న యష్.. యష్ గురించి విన్నీకి అబద్ధాలు చెప్పిన అభి?

Published : Feb 22, 2023, 12:07 PM IST
Ennenno Janmala Bandham: వేదను చూసి కుమిలిపోతున్న యష్.. యష్ గురించి విన్నీకి అబద్ధాలు చెప్పిన అభి?

సారాంశం

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది.  నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఫిబ్రవరి 22వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.  

ఈరోజు ఎపిసోడ్ లో వేదకి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తుండగా అది చూసి యష్ టెన్షన్ పడుతూ వేద వైపు చూసి బాధపడుతూ ఉంటాడు. వేదని బెడ్ పై ఆ పరిస్థితులలో చూసి యష్ బాధపడుతూ ఉంటాడు. వేదని చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇంతలోనే అక్కడికి వసంత్, వర్మ, రత్నం, సులోచన వస్తారు. అల్లుడు గారు వేదకి ఎలా ఉంది అనడంతో లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది ఇంకా సిచువేషన్ ఏంటని చెప్పలేదు అనడంతో అయ్యో వేద అని బాధపడుతూ ఉండగా వర్మ సులోచనని ఓదారుస్తూ ఉంటాడు. అప్పుడు సడన్గా కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి యష్ అని రత్నం అడగగా అప్పుడు యష్ చెప్పడానికి తడబడుతూ వేద అన్నమాటలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు.

మరొకవైపు చిత్ర ఆఫీసులో వర్క్ చేసుకుంటూ ఉండగా వేద గురించి ఫోన్ చేసి చెప్పడంతో చిత్ర షాక్ అవుతుంది. ఆ తర్వాత నర్స్ టెన్షన్ టెన్షన్ గా వెళ్తుండగా వేదకు ఎలా ఉంది అనడంతో నాకు తెలియదు సార్ అనగా యష్ కోపంతో సిస్టర్ మీద అరుస్తాడు. అసలు ఏం హాస్పటల్ లో ఇర్రెస్పాన్సిబిలిటీ అంటూ వారి మీద సీరియస్ అవుతాడు. అప్పుడు వసంత్ నువ్వు సైలెంట్ గా ఉండు యష్ అనగా ఏంట్రా సైలెంట్ ఉండేది లోపలికి వేదని పిలుచుకొని వెళ్లి 1 అవర్ అవుతుంది ఇంతవరకు ఏం చెప్పలేదు అని వాళ్ళ మీద సీరియస్ అవుతాడు. డాక్టర్ వచ్చి ఏంటండి మీరు దబాయిస్తున్నారు,  గొడవ చేస్తున్నారు కావాలంటే మీ వైఫ్ ని పిలుచుకొని వెళ్ళిపోవచ్చు అనడంతో స్వారీ డాక్టర్ తన భార్యకు ఏదైనా అవుతుందేమో అలా మాట్లాడుతున్నాడు అని అంటాడు విన్నీ.

అప్పుడు విన్నీ వైపు అలాగే చూస్తూ ఉంటాడు. ఇది మీరు మాట్లాడినట్లు అతను మాట్లాడడం లేదు అతని ప్రవర్తన బాగోలేదు అనడంతో అర్థం చేసుకోండి ఆ విషయాన్ని వదిలేయండి వేద పరిస్థితి ఎలా ఉంది అనడంతో ఇప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము మరి కొద్ది సేపట్లో తెలుస్తుంది అని అంటుంది డాక్టర్. అప్పుడు డాక్టర్ మాటలకు యష్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మరొకవైపు చిత్ర ఆటోల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి అభిమన్యు వచ్చి కారు ఆపుతాడు. ఏంటి చిత్ర ఇక్కడ ఉన్నావు అనడంతో క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను మా వేద అక్కకి బాగోలేదు హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు అనడంతో అవునా ఏం జరిగింది అని అడుగుతాడు అభి.

అవునా నేను హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేస్తాను తొందరగా వచ్చేయ్ అని అంటాడు అభి. అప్పుడు చిత్ర నేను రాను మీరు వెళ్లిపోండి అనడంతో పర్లేదు చిత్ర అని అంటాడు అభి. అప్పుడు మాళవిక కూడా వచ్చి కూర్చోమని చెప్పడంతో చిత్ర వెళ్లి కార్లో కూర్చుంటుంది. మరొకవైపు హాస్పిటల్ లో సులోచన ఏడుస్తూ ఉండగా వర్మ ఓదారుస్తూ ఉంటాడు. అప్పుడు యష్ వేదవైపు చూస్తూ నిన్ను ఇలా చూస్తే నాకు చాలా బాధగా ఉంది నువ్వు ఇలా అవడానికి కారణం నేనే కదా అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. నేనే ఆవేశంగా నిన్ను అనగాని మాటలు అన్నాను నీ మీద కోపడ్డాను సారీ వేద నీకు ఇలా అవ్వడానికి కారణం నేనే అని బాధపడుతూ ఉంటాడు.

తొందరగా కోలుకో మీద నన్ను తిట్టు నీకోసం అక్కడ ఎదురు చూస్తోంది అని బాధగా మాట్లాడుతాడు. ప్లీజ్ వేద అంటూ బాధపడుతూ ఉంటాడు యష్. మరొకవైపు విన్నీ ఆఫీస్ కి సంబంధించి ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే అభి అక్కడికి వస్తాడు. అప్పుడు చిత్ర అభిమన్యు కార్ లో నుంచి రావడం చూసి వసంత్ షాక్ అవుతాడు. అప్పుడు విన్నీని చూసి ఏంటి విన్నీ ఇక్కడ ఉన్నావు అనగా మా ఫ్రెండ్ వేద కళ్ళు తిరిగి పడిపోయింది అందుకే ఇక్కడ ఉన్నాను అని అంటాడు విన్నీ. అప్పుడు అభి యష్ గురించి, యష్, మాళవిక,వేద ల రిలేషన్ గురించి విన్నీకి వివరిస్తూ ఉంటాడు. అలాంటి ఒక షాట్ టెంపర్ మనిషిని బరిస్తోంది ఇగో ఎక్కువ అని యష్ గురించి బ్యాడ్ గా చెబుతూ ఉంటాడు అభి.

అతనితో కాపురం చేయడం అంటే కష్టమే అంటూ నోటికొచ్చిన విధంగా మాట్లాడుతూ ఉంటాడు అభిమన్యు. అప్పుడు అభి మాటలు నిజం అని నమ్మిన విన్నీ ఆశ్చర్యపోతాడు. అప్పుడు వేద రిలేషన్ గురించి చాలా బ్యాడ్ గా చెప్పి విన్నీ మనసుని చెడగొడతాడు అభి. అప్పుడు అభి చెప్పాల్సిన వన్నీ చెప్పి విన్నీ మనస్సును చెడగొట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అసలు ప్రేమే లేనప్పుడు వారిద్దరూ ఎలా పెళ్లి చేసుకున్నారు సంథింగ్ ఇస్ రాంగ్ వారిద్దరి మధ్య ఏదో జరుగుతోంది అనుకుంటూ ఉంటాడు విన్నీ. మరొకవైపు వేదని చూసి యష్ ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో చిత్ర అక్కడికి రావడంతో సులోచన ఏడుస్తూ మాట్లాడుతుంది.

అప్పుడు వర్మ,సులోచనని ఓదారుస్తూ ఉంటాడు. అప్పుడు వారు బాధపడుతూ ఉంటారు. అప్పుడు చిత్ర,యష్ దగ్గరికి వెళ్లి బావగారు ధైర్యంగా ఉండండి అనడంతో నా ధైర్యం నా దగ్గర లేదు చిత్ర అదిగో లోపల ఐసియూ లో ఉంది అని అంటాడు. అప్పుడు మీరు కంట్రోల్ లో ఉండాలి బావగారు లేదంటే పెద్దమ్మ వాళ్ళు ఇంకా భయపడతారు అని అంటుంది చిత్ర.

PREV
click me!

Recommended Stories

Prabhas: దేశముదురు దెబ్బకి అడ్రస్ లేకుండా పోయిన ప్రభాస్ సినిమా..ఒకే ఏడాది బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్
Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?