పవర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. పవన్ కళ్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ మూవీ షూటింగ్ స్టార్ట్..

Published : Feb 22, 2023, 10:58 AM ISTUpdated : Feb 22, 2023, 10:59 AM IST
పవర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. పవన్ కళ్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ మూవీ షూటింగ్ స్టార్ట్..

సారాంశం

మెగా హీరోలు కలిసి వెండితెరపై సందడి చేయబోతున్నారు. మెగా మామ.. మేనల్లుడు కలిసి నటిస్తున్న సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.  

మెగా అభిమానులకు పండగలాంటి వార్త..  మెగా హీరోలు ఇద్దరు కలిసి సిల్వర్ స్క్రీన్ మీద  సందడి చేయబోతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ఈరోజు అధికారికంగా స్టార్ట్ అయ్యింది. తమిళ,తెలుగు ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతున్న దర్శకుడు సముద్రఖని ఈమూవీని డైరెక్ట్ చేయబోతున్నారు. టాలీవుడ్ లో గతంలో సముద్ర ఖని దర్శకుడిగా సినిమాలు తెరకెక్కించారు.  రవితేజ 'శంభో శివ శంభో సినిమాను డైరెక్ట్ చేసింది సముద్రఖనే. తమిళంలో సముద్రఖని ప్రధాన పాత్రలో నటించి.. దర్శకత్వం వహించిన  దర్శకత్వం వహించిన సూపర్ హిట్  సినిమా వినోదయ సీతమ్ తెలుగు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. 

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమాకు  టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. ఇక ఈమూవీని పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి  షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ రోజు హైదరాబాదులో షూటింగ్ స్టార్ట్ అయ్యింది. దీనికి సబంధించి వివరాలను మూవీ మేకర్స్ అండ్ టీమ్ అఫీషియల్ గా వెల్లడించారు. మూవీ ఓపెనింగ్ కు సబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు టీమ్. ఇక ఈ ప్రారంభోత్సవంలో మామా అల్లుడు బ్లాక్ డ్రెస్ లలో మెరిసిపోయారు. ఒకే స్టైల్ లో వచ్చిన ఇద్దరిని చూసి పవర్ స్టార్ అభిమానులు తెగ ముచ్చట పడుతున్నారు. బ్లాక్ కలర్ హుడీస్ ఫస్ట్ డే షూటింగుకు వచ్చిన ఇద్దరినిచూడటానికి రెండు కళ్ళు చాలడంలేదంటూ కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ముందు ఈ సినిమా కంప్లీట్ చేయాలని పవర్ స్టార్ తో పాటు టీమ్ కూడా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 20 డేస్ కేటాయించారట. మార్చి నెలాఖరు వరకు ఈ సినిమా షూటింగ్ చేస్తారని సమాచారం.

 

ఈ సినిమాకు ముందు గా బుర్రా సాయి మాధవ్ మాటలు రాయడానికి తీసుకున్నారు. కాని ఆయన బిజీగా ఉండటంతో.. ఆబాధ్యతను త్రివిక్రమ్ శ్రీనివాస్ కు అప్పటించారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం.. మాటల మాత్రికుడు రంగంలోకి దిగాడు అంటే.. అది ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతే కాదు ఈసినిమాకు స్క్రీన్ ప్లే కూడా త్రివిక్రమ్ శ్రీనివాసే రాస్తున్నారు.  పవన్ కళ్యాణ్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని తెలుగుకు కావాల్సిన మార్పులు, చేర్పులు చేశారట. ఒక వైపు మహేష్ బాబు హీరోగా సినిమా  తెరకెక్కిస్తూనే.. ఈసినిమా బాధ్యలను కూడా చూస్తున్నారు త్రివిక్రమ్. 

తమిళంలో తెరకెక్కిన వినోదయ సీతయం కాన్సెప్ట్ గురించి చూస్తే.. ఓ యువకుడు కారు యాక్సిడెంట్‌లో మరణించగా.. దేవుడు ఆ యువకుడికి  రెండో అవకాశం ఇస్తాడు.. ఇక ఇదే కాన్సెప్ట్ ను.. కాస్త అటూ..ఇటుగా మార్చి.. పవర్ స్టార్ కు తగ్గట్టు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈక్రమంలో ..తెలుగులో భగవంతుని పాత్రను పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడిగా సాయి ధరమ్ తేజ్ నటించనున్నారు. ఈరంగా వరుస ప్లాప్ లు ఫేస్ చేస్తున్నసాయి ధరమ్ తేజ్ కు లైఫ్ ఇవ్వబోతున్నాడు పవర్ స్టార్. ఇక పవన్ కళ్యాన్ దేవుడి పాత్ర వేయడం ఇది రెండో సారి.  గోపాల గోపాల సినిమా కోసం కృష్ణుడిగా కనిపించి సందడి చేశాడు పవర్ స్టార్. ఈసారి కూడా అలాంటి ఫస్నీ అండ్ సీరియస్ నెస్ కలగలిపిన పాత్రను పవన్ చేస్తున్నట్టు సమాచారం. 

వినోదయ సీతమ్  తెలుగు రీమేక్  వెర్షన్ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన  హీరోయిన్ గా రొమాంటిక్ మూవీ ఫేమ్  కేతికా శర్మ నటించనున్నారు. సూపర్ ఫాస్ట్ గా సినిమాను కంప్లీట్ చేసి.. ఈ ఏడాదే సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అటు పాలిటిక్స్ ను.. ఇటు సినిమాలను బ్యాలన్స్ చేస్తూ వస్తోన్న పవర్ స్టార్ ఖాతాలో ఈ సినిమాతో పాటు.. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న హరి హర వీర మల్లు, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సుజీత్ దర్శకత్వంలో గ్యాంగ్ స్టర్ సినిమాలు ఉన్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి మేనేజ్మెంట్ కోటా అని తేలిపోయిందా ? నిహారికతో నాగార్జున షాకింగ్ వీడియో వైరల్
Chiranjeevi: చిరంజీవితో నటించి సెలెబ్రిటీలని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీళ్ళే..సుహాసిని నుంచి జ్యోతిక వరకు