తెలుగు సినిమాలో WWE స్టార్ ఖలీ!

Published : Jan 30, 2019, 07:53 PM IST
తెలుగు సినిమాలో WWE స్టార్ ఖలీ!

సారాంశం

డబ్ల్యూడబ్ల్యూఈ  అంటే తెలియని కుర్రాళ్ళు ఉండరు. అందులో ఎక్కువ హైట్ గల రెస్ట్లెర్ ఎవరో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రెస్ట్లెర్ వరల్డ్ లో ఇండియాకు గుర్తింపు తెచ్చిన సూపర్‌ స్టార్ ద గ్రేట్‌ ఖలీ అప్పుడపుడు సినిమాల్లో కూడా కనిపిస్తూ అభిమానులను ఆకర్షిస్తున్నాడు.

డబ్ల్యూడబ్ల్యూఈ  అంటే తెలియని కుర్రాళ్ళు ఉండరు. అందులో ఎక్కువ హైట్ గల రెస్ట్లెర్ ఎవరో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రెస్ట్లెర్ వరల్డ్ లో ఇండియాకు గుర్తింపు తెచ్చిన సూపర్‌ స్టార్ ద గ్రేట్‌ ఖలీ అప్పుడపుడు సినిమాల్లో కూడా కనిపిస్తూ అభిమానులను ఆకర్షిస్తున్నాడు. ఇక మన తెలుగు తెరపై కూడా ఈ WWE కస్టార్ నటించడానికి సిద్దమయ్యాడు. 

ప్రేమించుకుందాం రా - బావగారు బాగున్నారా - శంకర్ దాదా MBBS వంటి బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం నరేంద్ర. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో  ఖలీ స్పెషల్ రోల్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. గతంలో హాలీవుడ్ బాలీవుడ్ లోనే కాకుండా అమెరికన్ రియాలిటీ షోల్లో కూడా  ఖలీ  కనిపించాడు. 

హిందీ బిగ్ బాస్ సీజన్ 4లో కూడా ఈ బలవంతుడు కంటెస్టెంట్ గా ఉన్నాడు. ఇక ఫైనల్ గా తెలుగు సినిమాలో కూడా మొదటి అడుగు వేయడానికి సిద్ధం అయ్యాడు. మరి అతను ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి. నీలేష్ అనే యువకుడు ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం కాబోతున్నాడు.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా